
పూరి జగన్నాథ్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ప్రముఖ నటుడు బోస్ మృతి చెందారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు మూడు దశాబ్ధలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బోస్, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సుమన్ హీరోగా తెరకెక్కిన సాహసపుత్రుడు సినిమాతో తెరకు పరిచయం అయిన బోస్‌కు ప్రేమఖైదీ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.