శ్రీనివాస్‌కు భద్రత కల్పించాలి : జాతీయ ఎస్సీ కమిషన్‌ | National SC Commission Ordered Police To Give Protection To Srinivasa Rao | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌కు భద్రత కల్పించాలి : జాతీయ ఎస్సీ కమిషన్‌

Published Wed, Jan 9 2019 2:44 PM | Last Updated on Wed, Jan 9 2019 3:03 PM

National SC Commission Ordered Police To Give Protection To Srinivasa Rao - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఏసీపీ నాగేశ్వరరావు బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కమిషన్‌ గతంలోనే ఆంధ్రప్రదేశ్‌ డీజీపీని తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే డీజీపీ బదులు సిట్‌ అధికారి నాగేశ్వరరావు కమిషన్‌ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు ఈ కేసును ఇప్పటికే ఎన్‌ఐఏకు బదిలీ చేశామని  కమిషన్‌కు తెలిపారు.

అంతేకాక ఈ కేసులో నిందుతుడైన శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్నాడని చెప్పారు. ఈ నెల 11 శ్రీనివాస రావును మరోసారి కోర్టు ముందు హాజరుపర్చుతామని నాగేశ్వర రావు..  కమిషన్‌కు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషన్‌ ఈ కేసుతో సంబంధమున్న మిగతా పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించింది. అంతేకాక ఈ విషయమై విశాఖ కమిషనర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అనంతరం ఈ కేసులో నిందుతుడైన శ్రీనివాస్‌కు, అతని కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్‌.. రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement