National SC Commission
-
బాబు సర్కార్‌కు షాక్!.. జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
-
ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అంబేడ్కర్ విగ్రహంపై దాడి తర్వాత వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS), రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసింది. ఒకవేళ.. ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా ఉన్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఆ నోటీస్‌లో స్పష్టం చేసింది. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహంపై దాడికి సంబంధించి గత బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానాను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.చంద్రబాబు సర్కార్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు -
ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ను కలిసిన YSRCP నేతలు
-
జన్మభూమి కమిటీపై అలుపెరగని పోరాటం
ద్వారకాతిరుమల: గత టీడీపీ జన్మభూమి కమిటీ నిర్వాకం కారణంగా వ్యవసాయ భూమిని కోల్పోయిన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పావులూరివారిగూడెంకు చెందిన బంటుమిల్లి రామలక్ష్మి అలుపెరుగని న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. భూవివాద సమయంలో సంభవించిన తన భర్త మృతి ముమ్మాటికీ జన్మభూమి కమిటీ చేసిన హత్యేనని ఆమె జాతీయ ఎస్సీ కమిషన్ (న్యూఢిల్లీ)ను ఆశ్రయించారు. దాంతో సదరు కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ ఈనెల 18న ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. 1981లో పావులూరివారిగూడెంలో భూస్వామి దేవరపల్లి హనుమంతరావు వద్ద లాండ్ సీలింగ్‌లో అధికంగా ఉన్న 16.44 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఆ భూమిని నిరుపేదలైన 16 మందికి ఒక్కో ఎకరం చొప్పున, మరో వ్యక్తికి 44 సెంట్లు ఇచ్చారు. అందులో బంటుమిల్లి సుబ్బారావు ఎకరం భూమిని పొందారు. అయితే హనుమంతరావు తన వద్ద ప్రభుత్వం అధిక భూమిని సేకరించిందని హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు 2012లో 7.80 ఎకరాల భూమిని తిరిగి హనుమంతరావుకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా భూమిని కోల్పోయే లబ్ధిదారులకు మరోచోట భూమిని కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో హనుమంతరావుకు రెవెన్యూ అధికారులు భూమిని తిరిగి వెనక్కిచ్చారు గానీ, బాధితులకు ఏవిధమైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించలేదు. అడ్డగోలుగా జన్మభూమి కమిటీ నిర్ణయం ఇదిలా ఉంటే 2015 నవంబర్ 27న టీడీపీ జన్మభూమి కమిటీ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పటికే సాగులో ఉన్న సుబ్బారావు ఎకరం భూమిలో అరెకరం నంబూరి సోమరాజు కుటుంబ సభ్యులకు కేటాయించారు. దాంతో అప్పటి నుంచి గ్రామంలో భూ వివాదాలు, కొట్లాటలు మొదలయ్యాయి. సుబ్బారావుకు హైకోర్టులో సైతం అనుకూలంగా తీర్పు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2021 ఫిబ్రవరి 17న వివాదాస్పద భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కొందరు సుబ్బారావుపై దాడి చేశారు. అదేరోజు అతడు మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య రామలక్ష్మి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు సుబ్బారావు మృతికి సంబంధించి పోలీసుల విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రామలక్ష్మి 2021 మార్చిలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. 2021 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో విచారణ చేపట్టింది. పోలీస్, రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022 డిసెంబర్ 22న భూమిని కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను కమిషన్ ఆదేశించింది. సుబ్బారావు మృతిపై పునఃవిచారణ చేపట్టాలని కూడా డీఎస్పీ పైడేశ్వరరావు, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బాధితులకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయించారు. కాగా పోలీసులు సమర్పించిన నివేదికపై సంతృప్తి చెందని కమిషన్ సుబ్బారావు మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ సంచలన తీర్పు ఈనెల 18న కమిషన్ చేపట్టిన విచారణకు డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఏలూరు ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, భీమడోలు సీఐ భీమేశ్వర రవికుమార్, ద్వారకాతిరుమల తహసీలా్దర్ పి.సతీష్, ఎస్సై టి.సుధీర్‌లు హాజరై, తమ నివేదికను సమర్పించారు. దీనిపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన కమిషన్ కేసు దర్యాప్తును సీబీ సీఐడీకి అప్పగిస్తూ సంచలన ఆదేశాలను జారీ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుని, నివేదికను సమర్పించాలని కమిషన్ మెంబర్ సుభాష్ రాంనాథ్ పార్ధీ ఆదేశించారు. న్యాయం జరుగుతుంది: జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రామలక్ష్మి తెలిపారు. నా భర్త సుబ్బారావు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అప్పటి గ్రామ రెవెన్యూ అధికారి వీర్రాజుకు తగిన శిక్ష పడేవరకు పోరాటం చేస్తానన్నారు. -
చట్టం ముందు అందరూ సమానమే
దోమ: చట్టం ముందు అందరూ సమానమేనని, కులాల పేరుతో గొడవలు తగవని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్ అన్నారు. మండల పరిఽధిలోని బ్రాహ్మణపల్లిలో దళితుల ఆలయ ప్రవేశం విషయమై ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ముందుగా గ్రామంలోని ఆలయంలో పూజలు చేసిన అనంతరం స్థానికులతో సమావేశమై మాట్లాడారు. దేశంలో సామాజిక మార్పు కోసం ప్రజలను జాగృత పర్చాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలోనూ అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో ఇలాంటి అసమానతలను తొలగించడానికి రాజకీయాలకు అతీతంగా జనాలను చైతన్యం చేయాలన్నారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన ఘటనలు జిల్లాలో ఎక్కడా పునరావృతం కాకుండా నిఘా పెట్టాలని సూచించారు. ఘటనకు బాధ్యులపైన వారిపై 302 సెక్షన్ అమలు చేసి త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగిన రోజే ఎస్ఐ విశ్వజన్ అప్రమత్తమై జిల్లా అధికారులతో కలసి బాధ్యులను గుర్తించి జైలుకు పంపడంపై ఎస్పీ కోటిరెడ్డి, ఎస్ఐని అభినందించారు. సోదర భావంతో మెలగాలి కులాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో కలసి మెలసి ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బడి, గుడి అందరివని కులాల ప్రస్తావన ఇక్కడ రావద్దని సూచించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయాలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘట నలు మళ్లీ రీపీట్ కాకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తాం.. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరిగినా పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన ఘటనపై వెంటనే స్పందించి బాధ్యులైన 35 మందిపై కేసు నమోదు చేసి, 20 మందిని రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుని కోర్టులో ప్రవేశపెడుతామని స్పష్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి చెప్పాలన్నారు. అనంతరం బాధితులైన రఘురాం, అనసూయమ్మకు ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్, కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా రూ.25 వేల చొప్పున పరిహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, అడిషన్ ఎస్పీ మురళీధర్, తహసీల్దార్ షాహెదబేగం, డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, ఎంపీడీఓ జయరాం, ఆర్ఐలు లింగం, శివప్రసాద్, సీఐ వెంకటరామయ్య, ఎస్ఐలు గిరి, శ్రీశైలం, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు, ఎస్బీ సీఐ రామకృష్ణ, కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుడినే: సమీర్ వాంఖెడే
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్(ఎన్సీఎస్సీ) చైర్పర్సన్ విజయ్ సాంప్లాను కలిశారు. తన కులాన్ని(దళిత) ధ్రువీకరించే పత్రాలను అందజేశారు. తాను ముమ్మాటికీ దళితుడినేనని పేర్కొన్నారు. ఎన్సీఎస్సీ కోరిన అన్ని పత్రాలను, సాక్ష్యాధారాలను అందజేశానని వాంఖెడే చెప్పారు. ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో పట్టుబడిన డ్రగ్స్ కేసును ఆయన దర్యాప్తు చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలో నెగ్గి, ఎస్సీ కోటాలో ఉద్యోగం సంపాదించడానికి వాంఖెడే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేశాడని, ఆయన దళితుడు కాదని, జన్మతా.. ముస్లిం అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ కొడుకు ఆర్యన్ నుంచి రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారంటూ సమీర్ వాంఖెడే సహా ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎన్సీబీ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఏపీ తక్షణ స్పందన అందరికీ ఆదర్శం
సాక్షి, అమరావతి: ప్రేమోన్మాది చేతిలో పది రోజుల క్రితం గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిన తీరు అభినందనీయమని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థిని హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుకు నూటికి 200 మార్కులు వేయవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలు ముఖ్యంగా మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. రమ్య హత్యోదంతం ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం వేగంగా వ్యవహరించిన తీరును దేశమంతా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర కేసుల్లోనూ ఇలాగే స్పందించాలని కమిషన్ కోరుకుంటోందని తెలిపారు. ఘటన పూర్వాపరాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం మంగళవారం గుంటూరు చేరుకుని బాధిత కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించి వివరాలు సేకరించింది. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులతో సమావేశం అనంతరం కమిషన్ సభ్యులు అంజుబాలా, సుభాష్పార్థిలతో కలసి అరుణ్ హల్దార్ మీడియాతో మాట్లాడారు. అత్యాచార నిరోధక చట్టాన్ని వేగంగా అమలు చేయడం, నిందితుడిని వెంటనే అరెస్టు చేయడం, చార్జ్‌షీట్ వేగంగా ఫైల్ చేయడం, పరిహారాన్ని వెంటనే చెల్లించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. శభాష్ పోలీస్.. అవార్డులకు సిఫార్సు డీఐజీ నేతృత్వంలో గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని అరుణ్ హల్దార్ అభినందించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేసిన అధికారులకు అవార్డులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. ఎస్సీల వినతులు సత్వర పరిష్కారం కోసం జాతీయ కమిషన్ తరఫున ఒక ప్రత్యేక సెల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చర్యలు: సీఎస్ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. గుంటూరు ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలిచిందని చెప్పారు. బాధితురాలి తల్లికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రూ.8.25 లక్షల పరిహారాన్ని అందించడంతోపాటు అదనంగా మరో రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెల్లించినట్లు తెలిపారు. ఇంటిపట్టాను కూడా మంజూరు చేసి సొంత ఇంటి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా గత ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగిందని, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన క్రమం తప్పకుండా సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలో ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల ప్రతినిధులతో సంప్రదించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు: డీజీపీ సవాంగ్ ఘటన జరిగిన వెంటనే పోలీస్ యంత్రాంగం యుధ్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించి చార్జ్‌షీట్ ఫైల్ చేసిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళల భద్రత కోసం దిశ యాప్‌ను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్రానికి ఐదు జాతీయ అవార్డులు లభించాయని చెప్పారు. పోలీస్ సేవా యాప్ ద్వారా గత 10 నెలల వ్యవధిలో 7 లక్షల మందికిపైగా ఎఫ్ఐఆర్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న నేపథ్యంలోగత ఏడాదిన్నర కాలంలో 34 వేల కేసులు రిజిస్టర్ అయ్యాయని, వీటిలో 52 శాతం ఫిర్యాదులు మహిళలకు సంబంధించినవేనని తెలిపారు. సమావేశంలో డీఐజీలు రాజకుమారి, పాలరాజు, గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు పాల్గొన్నారు. దిశ యాప్‌తో దేశానికే ఆదర్శంగా నిలిచారు మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఎస్సీ కమిషన్ సభ్యులు అంజుబాలా ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి దిశ యాప్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. వీటిని సమర్థంగా నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కమిషన్ బృందం వెంట సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ హర్షవర్థన్ తదితరులున్నారు. మేం అడగకుండానే ప్రభుత్వం ఆదుకుంది ఇటీవల గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని ఎన్.రమ్య దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబం కూడా అదే కోరుతోందని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. తాము వచ్చి అడగక ముందే బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకుని చట్టపరంగా రావాల్సిన అన్ని సదుపాయాలను అందచేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బాధిత కుటుంబం పట్ల ఏపీ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించిందన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ బృందం మంగళవారం గుంటూరులో పర్యటించింది. బాధితురాలు రమ్య ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించింది. సంఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరుపై వివరాలు సేకరించింది. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వివిధ పక్షాల నుంచి వినతిపత్రాలు స్వీకరించింది. ఈ సందర్భంగా హల్దార్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేశారని చెప్పారు. కేంద్ర సాయం అందించేలా చర్యలు.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాధితురాలి కుటుంబానికి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హల్దార్ తెలిపారు. అధైర్యం చెందవద్దని, బాధితులకు ఎస్సీ కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్సీల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కమిషన్ రక్షణ కల్పిస్తుందన్నారు. వివిధ పక్షాలు అందచేసిన వినతిపత్రాలను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, విడదల రజని, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్య విమోచన కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితోపాటు పలు పార్టీల నేతలు కమిషన్‌ను కలిశారు. -
సీఎం జగన్‌ను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. కాగా గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ స్పాట్ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ టీం మంగళవారం గుంటూరులో పర్యటించింది. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్డర్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే నిందితుడిని అరెస్ట్ చేయడం సహా బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ తీరును ఆయన అభినందించారు. చదవండి: ఏపీ ప్రభుత్వ పనితీరును అభినందిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ -
ఏపీ ప్రభుత్వ పనితీరును అభినందిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్
సాక్షి, గుంటూరు: ఇటీవల గుంటూరు నగరంలో జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ స్పాట్ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం మంగళవారం గుంటూరులో పర్యటించింది. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్డర్ మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. నిందితుడిపై త్వరగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని కోరామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును అరుణ్ హల్డర్ ప్రశంసించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కూడా ఏపీ ప్రభుత్వం వెంటనే అందించిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ దృక్పథం చాలా పాజిటివ్‌గా ఉందని ఆయన వివరించారు. దేశం మొత్తం ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకోవాలని వైస్ ఛైర్మన్ అన్నారు. గుంటూరు రూరల్, అర్బన్ పోలీస్ అధికారులు బాగా పని చేశారు. వారందరికీ అవార్డులు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని వైస్ ఛైర్మన్ అరుణ్ హల్డర్ తెలిపారు. చదవండి: AFG Vs Pak: అఫ్గన్- పాకిస్తాన్ వన్డే సిరీస్ నిరవధిక వాయిదా -
రమ్య మృతి ఘటన: ప్రభుత్వ చర్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి
గుంటూరు: రమ్య మృతిపై ప్రభుత్వం ఎలా స్పందిచిందో జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసి వివరించినట్లు వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్సోషల్ జస్టిస్ గవర్నమెంట్ అడ్వైజర్ జూపూడి ప్రభాకర రావు మాట్లాడుతూ.. 24 గంటల్లోపు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి సాయం చేశామన్నారు. ప్రభుత్వ చర్యలకు జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు. చదవండి: అవినీతికి బ్రాండ్ వరదాపురం సూరి సీఎం జగన్ న్యాయం చేశారని రమ్య కుటుంబసభ్యులే చెప్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి నాలుగు రోజుల్లో న్యాయం చేసిందని కమిషన్ చెప్పినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని జూపూడి ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, మేరుగ నాగార్జున, విడదల రజని, లక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: 200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత -
మల్కాజిగిరి వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ ఏస్సి కమిషన్
-
పది లక్షలిస్తేనే పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య శాఖలో డిప్యూటీ సెక్రటరీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. ‘రూ.10 లక్షలిస్తే పదోన్నతి వచ్చేలా చేస్తా.. కోరిన చోటుకు పోస్టింగ్ ఇస్తా’ అంటూ నేరుగా ఒక వైద్యుడి క్లినిక్‌కు వెళ్లి డబ్బు డిమాండ్ చేసిన వైనం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటకొచ్చింది. గుంటూరు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డా.వై.కిరణ్‌కుమార్ తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి దక్కలేదంటూ నాలుగున్నరేళ్ల పాటు అప్పటి ప్రభుత్వంతో పోరాడారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా పదోన్నతి ఇవ్వాల్సిందేనని కమిషన్ తీర్పుచెప్పింది. అధికారులు మాత్రం పదోన్నతి ఇవ్వకుండా తిప్పుకున్నారు. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించగా.. కిరణ్‌కుమార్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎంఓ ఆదేశించింది. అయితే కిరణ్‌కుమార్ బావమరిది ఆనంద్... సచివాలయంలో ఆరోగ్యశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే యిర్మియా రాజును సంప్రదించి తన బావ పదోన్నతి అంశాన్ని చర్చించారు. తనకు రూ.10 లక్షలు ఇస్తే నోషనల్ ప్రమోషన్, మళ్లీ పోస్టింగ్ ఇస్తానని యిర్మియా డిమాండ్ చేశారు. ఫైలు చదివాక మిగతా విషయాలు మాట్లాడుతా నవంబర్ 4న గుంటూరులో కిరణ్‌కుమార్ నిర్వహిస్తున్న క్లినిక్‌కు వెళ్లిన యిర్మియా.. దాదాపు 30 నిముషాలు మాట్లాడి రూ.10 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. నవంబర్ 20న మళ్లీ క్లినిక్‌కు వెళ్లి రూ.50వేలు తీసుకున్నారు. ‘మీకు మూడేళ్ల నుంచి వేతనం రాలేదు కదా అది కూడా వచ్చేలా చేస్తా..మీ ఫైలు చాలా క్లిష్టంగా ఉంది. బాగా చదవాలి. అన్నీ చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా’ అని చెప్పారు. ఫైలు పరిశీలించాక నాలుగైదు రోజుల్లో కలుస్తానని, అప్పుడు మిగతా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను క్లినిక్‌కు వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో అడ్డంగా దొరికిపోయారు. వైద్యుడి నుంచి డబ్బు తీసుకుంటున్న దృశ్యాలు.. ఎడమవైపు డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు, కుడివైపున వైద్యుడి బావమరిది ఆనంద్ సీఎంవో కార్యాలయ ఆదేశాలు బేఖాతరు తనకు న్యాయం జరగడం లేదని కిరణ్‌కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆ వినతిని పరిశీలించిన సీఎం కార్యాలయం 2019 నవంబర్ 5న వైద్య ఆరోగ్యశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని, 2015లో జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేసి న్యాయం చేయాలని సూచించింది. అయితే ఇవేమీ ఖాతరు చేయకుండా డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు డబ్బులు వసూలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రూ.10 లక్షలు డిమాండ్ చేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా నోషనల్ ప్రమోషన్‌పై పోరాడుతున్నాను. అప్పటి ప్రభుత్వం న్యాయం చేయకపోగా విజిలెన్స్, ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని కూడా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో నా బావమరిది ఆనంద్...డిప్యూటీ సెక్రటరీ యిర్మియా రాజును సంప్రదించారు. అనంతరం ఆయన నా దగ్గరకొచ్చి రూ.10 లక్షలు డిమాండు చేశారు. అడ్వాన్సుగా రూ.50వేలు ఇచ్చాను. మరో రెండు లక్షలు ఇవ్వాలని, మిగతా సొమ్ము పనయ్యాక ఇవ్వాలని అడిగారు. అలాగే ఇస్తానని చెప్పాను. – డా.కిరణ్‌కుమార్, ప్రొఫెసర్, జనరల్ సర్జరీ -
రూ.15 వేల అప్పుకు ఇల్లు ఆక్రమించారు
గుంటూరు ,అనంతవరం(తుళ్లూరురూరల్) : స్థలం తాకట్టు పెట్టి ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నామని... తిరిగి చెల్లించినా ఇంకా బాకీ ఉందంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని అనంతవరం గ్రామానికి చెందిన మేకల బసవమ్మ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు వద్ద తన గోడు విన్నవించింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులదూషణ కేసుపై విచారించేందుకు రాములు శుక్రవారం అనంతరం వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బాధితులు తమ సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. తన భర్తకు అనారోగ్యం కారణంగా అదే గ్రామానికి చెందిన పోలు రమేష్ అనే వ్యక్తి నుంచి స్థలం తాకట్టు పెట్టి రూ.15,000 అప్పు తీసుకున్నామని మేకల బసవమ్మ చెప్పింది. కొంత కాలం తరువాత తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి వెళితే తొలుత వడ్డీ మాత్రమే రూ.20,000 చెప్పాడంది. అనంతరం అసలు స్థలం మీది కాదంటూ ఇంటి నుంచి తమను బయటకు పంపించారని వాపోయింది. తన ఇంటిని రమేష్ అనుచరులతో కలిసి పడగొట్టారని పేర్కొంది. ఈ ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో స్పందించిన రాములు పోలు రమేష్, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తుళ్లూరు డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. రిపోర్టును ఎస్సీ కమిషన్ క్యాలయానికి పంపించాలని సూచించారు. కులాంతర వివాహం చేసుకున్న తమకు బంధువుల నుంచి రక్షణ కల్పించాలని పెదకూరపాడుకు చెందిన ఓ ప్రేమ జంట రాములును కోరింది. అనూష, శ్రీను అనే దంపతులు తమకు తమ తల్లిదండ్రులు, బంధువుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. తమ సమస్యను చెప్పుకునే సమయంలో యువతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారికి పటిష్ట భద్రత కల్పించాలని, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కమిషన్ సభ్యులు రాములు అడిషనల్ ఎస్పీకి సూచించారు. -
శ్రీనివాస్‌కు భద్రత కల్పించాలి : జాతీయ ఎస్సీ కమిషన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఏసీపీ నాగేశ్వరరావు బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కమిషన్ గతంలోనే ఆంధ్రప్రదేశ్ డీజీపీని తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే డీజీపీ బదులు సిట్ అధికారి నాగేశ్వరరావు కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు ఈ కేసును ఇప్పటికే ఎన్ఐఏకు బదిలీ చేశామని కమిషన్‌కు తెలిపారు. అంతేకాక ఈ కేసులో నిందుతుడైన శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్నాడని చెప్పారు. ఈ నెల 11 శ్రీనివాస రావును మరోసారి కోర్టు ముందు హాజరుపర్చుతామని నాగేశ్వర రావు.. కమిషన్‌కు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషన్ ఈ కేసుతో సంబంధమున్న మిగతా పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించింది. అంతేకాక ఈ విషయమై విశాఖ కమిషనర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అనంతరం ఈ కేసులో నిందుతుడైన శ్రీనివాస్‌కు, అతని కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్.. రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. -
చంద్రబాబు అక్రమ కట్టడం కనిపించడం లేదా..?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. ప్యాకేజీ ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులపై వివక్ష చూపిందని అమరావతి రైతులు కమిషన్‌ను ఆశ్రయించారు. టీడీపీ ప్రభుత్వంపై దాఖలైన ఫిర్యాదును కమిషన్ స్వీకరించింది. కాగా, రైతులు ఇచ్చిన పిటిషన్‌పై విచారణకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ శ్రీధర్ హాజరుకాకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ఏపీ ప్రభుత్వం తరపున మరొకరు విచారణకు హజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే తాము ప్యాకేజీ అమలు చేశామని ఏపీ ప్రభుత్వ అధికారులు కమిషన్‌కు తెలిపారు. పొంతనలేని సమాధానాలు.. నదీ సమీపంలోని భూములకు కొట్టుకు పోయే ప్రమాదం ఉందని సుప్రీం కోర్టు చెప్పినందునే ఆ భూములకు తక్కువ ప్యాకేజి ఇచ్చామని సీఆర్డీఏ అధికారులు కమిషన్‌కు విన్నవించారు. కాగా, నదీ సమీపంలోనే చంద్రబాబు అక్రమ కట్టడం కూడా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం అక్రమ కట్టడం మీకు కనిపించడం లేదా అని కమిషన్ ఏపీ అధికారులను ప్రశ్నించింది. అధికారులు పొంతన లేని జవాబులు చెప్పడంతో విచారణ వాయిదా వేసింది. మభ్యపెట్టి తమ నుంచి బలవంతంగా లాక్కున్న భూములు వెనక్కి ఇప్పించాలని, సమాన ప్యాకేజీ ఇవ్వాలని రైతులు కమిషన్‌ను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా.. జరీబు రైతులకు ఇచ్చిన మాదిరిగానే అసైన్డ్ భూములకు కూడా సమాన ప్యాకేజీ ఇవ్వాలనీ, రైతు కూలీలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సురేష్ డిమాండ్ చేశారు. అలాగే, జీవో నెంబర్ 41 ని రద్దు చేయాలనీ, లేదంటే హై కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. -
బాధితురాలిని పరామర్శించిన కె రాములు
సాక్షి, అక్కయ్యపాలెం (విశాఖ ఉత్తర) : నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా సరోగసి పేరిట అద్దె గర్భాల అక్రమ వ్యాపారం సంచలనం రేపుతోంది. మధ్యవర్తుల చేతుల్లో మోసపోయిన మహిళ ఫిర్యాదుతో ఈసంఘటన వెలుగుచూసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు నాగలక్ష్మి, మహిళా సంఘాలతో కలసి బుధవారం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు కె రాములు బాధితురాలిని పరామర్శించారు. జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై కేజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ అర్జునను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ బాధితురాలి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న పద్మజ ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్ విచారణ వేయాలని, బాధ్యులైన డాక్టర్లపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని రాములు డిమాండ్ చేశారు. సరోగసి వివాదంపై ఐదుగురు సీనియర్ వైద్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అందులో దళిత వైద్యుడు సభ్యుడిగా ఉండాలని అన్నారు. బాధితురాలుకి ప్రభుత్వం తక్షణమే ఎనిమిది లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ముగ్గురు పిల్లలకు డిగ్రీ వరకూ సాంఘీక సంక్షేమ శాఖ ఉచిత విద్య అందించాలని అన్నారు. దర్యాప్తుకు సహకరించని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. -
నా సమావేశానికే రారా?
సిద్దిపేటటౌన్/రాయపోలు(దుబ్బాక) : కేంద్ర కేబినెట్ స్థాయి కలిగిన తాను దళితుల సమస్యలపై సమీక్షించడానికి వస్తే జిల్లా ఉన్నతాధికారులు రాకపోవడంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు నా సమావేశానికే రాకపోతే, సామాన్యులకేం న్యాయం చేస్తారు’అని ప్రశ్నించారు. రాములు శనివారం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం లో దళిత సంఘాలు, నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలపై చర్చించడానికి ఒక్కో విభాగం అధికారి వచ్చారా? లేదా? అని ఆరా తీశారు. 34 శాఖలకు ఇద్దరే అధికారులు వచ్చారని తేలడంతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల రెండో వారంలో మళ్లీ వస్తానని చెప్పారు. శనివారం సమావేశానికి రాని అధికారులందరికీ ఢిల్లీ వెళ్లాక నోటీసులు పంపిస్తానని స్పష్టం చేశారు. -
ఇంత తక్కువా..?
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్డీఎఫ్) అమలు తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేటాయించిన నిధులు, ఖర్చు తీరును సమీక్షించి నివ్వెరపోయింది. మరో నెలన్నరలో వార్షిక సంవత్సరం ముగియనుండగా.. సగం నిధులు కూడా ఖర్చు చేయకపోవడంతో యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల తీరును పరిశీలించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కఠారియా ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఎల్.మురుగన్, సభ్యులు కె.రాములు, యోగేంద్ర పాశ్వాన్, సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరి బృందం రెండు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించింది. ఎస్సీ సంక్షేమ సంస్థలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖలతో వేర్వేరుగా సమావేశమై పరిస్థితిని పరిశీలించింది. 2017–18లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి అమలు తీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితోపాటు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించింది. అయినా మారలేదు.. 2017–18లో ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సగం కూడా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లో ఉన్నప్పుడూ పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయలేదని, ఈసారి ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినా పరిస్థితి మాత్రం మారలేదని పేర్కొన్నారు. కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసినప్పుడే దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. లక్ష్య సాధనలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ స్పష్టం చేసింది. వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్అండ్బీ, పరిశ్రమలు, రుణ వితరణ శాఖలు పురోగతిలో తీవ్ర వెనుకబాటును ప్రదర్శిస్తున్నాయని అభిప్రాయపడింది. ఎస్సీఎస్‌డీఎఫ్‌లో ఉన్న అన్ని శాఖల పనితీరులో అంతరాలున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపైనా సమీక్షించింది. డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయ్ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నా యని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనట్లు తెలిపింది. పోలీసుల తీరుతో బాధితులు నష్టపోతున్నట్లు అభిప్రాయపడింది. దాడి జరిగిన వెంటనే కేసు నమోదు చేయాలని, కానీ కేసుల నమోదు, దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సభ్యులు పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదైతేనే బాధితులకు పరిహా రం వస్తుందని, కానీ నమోదులో జాప్యం జరగడంతో బాధితులకు పరిహారం సకాలంలో అందట్లేదన్నారు. కేసు నమోదు విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోందని, బాధితులందరికీ కోర్టును ఆశ్రయించే చైతన్యం ఉండకపోవచ్చని అన్నారు. కేసుల నమోదులో జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉందని కమిషన్ వైస్‌చైర్మన్ మురుగన్ అన్నారు. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, పరిహారం తది తర వివరాలతో నివేదికను సమర్పించాలని రాష్ట్ర పోలీసు శాఖకు స్పష్టం చేసినట్లు చెప్పారు. బాలికల అక్షరాస్యత తగ్గింది రాష్ట్రంలో దళిత బాలికల అక్షరాస్యత క్రమంగా తగ్గుతోందని కమిషన్ తెలిపింది. కారణాలను అన్వేషించాలని, బాలికల అక్షరాస్యత తగ్గడం ప్రమాదకరమని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎస్సీ బాలికల డ్రాపౌట్ శాతం పెరుగుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనితీరు బాగుందని సభ్యులు కితాబిచ్చారు. దళిత యువతుల వివాహానికి సంబంధించి అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం సత్ఫలితాలిస్తుందన్నారు. -
రాష్ట్రానికి రేపు జాతీయ ఎస్సీ కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం హైదరాబాద్‌కు రానుంది. ఈ నెల 20, 21 తేదీల్లో వివిధ వర్గాలతో సమీక్ష నిర్వహించనుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కటారియా, వైస్ చైర్మన్ ఎల్.మురుగన్, సభ్యులు కె.రాములు, యోగేంద్ర పాశ్వాన్, స్వరాజ్ విద్వాన్, సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరి తదితరులు రెండ్రోజుల పర్యటనలో భాగంగా 20వ తేదీ ఉదయం నగరానికి చేరుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. సాయంత్రం అక్కడే ఎస్సీ ఉద్యోగ సంఘాలు, సంక్షేమ సంఘాలు, విద్యార్థి సంఘాలతో భేటీ కానున్నారు. అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘంతో సమావేశమవుతారు. 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు తాజ్ డెక్కన్ హోటల్లో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఎస్సీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలును సమీక్షిస్తారు. ఇదే రోజు మధ్యాహ్నం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం అమలుపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, డీజీపీ, సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమవుతారు. జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ పూర్తి చేసినట్లు ఆ శాఖ సంచాలకులు కరుణాకర్ తెలిపారు -
నిర్భయ చట్టం ప్రయోగించండి
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: విశాఖ జిల్లాలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన కేసులో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతోపాటు నిర్భయ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బాధితులకు న్యాయం జరగకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం గ్రామాన్ని గురువారం సందర్శించిన కమిషన్.. బాధితుల నుంచి ఘటన వివరాలను సేకరించింది. 40 ఏళ్ల క్రితం 14 మంది దళితులకు కేటాయించిన 80 సెంట్ల స్థలాన్ని ఇప్పుడు వేరొకరికి ఇవ్వడం ఏమిటని బాధితులు కమిషన్ దృష్టికి తెచ్చారు. సస్పెన్షన్‌కూ వెనుకాడం దళిత మహిళపై దాడికి పాల్పడ్డ నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు విశాఖ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. రెవెన్యూ అధికారుల ఉదాసీన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురైన బాధిత మహిళకు రూ.8 లక్షల పరిహారాన్ని చెల్లించాలని, 25 శాతం సొమ్మును ఈరోజు(గురువారం) రాత్రిలోగా ఇవ్వాల న్నారు. దాడికి గురైన మహిళ లేదా ఆమె కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించాలని ఆదేశించారు. తన ఆదేశాలను పట్టించుకోకుంటే బాధ్యులైన ప్రతి ఒక్కర్ని సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోనన్నారు. ‘మా స్థలాలు మాకివ్వమని అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వద్దకు వెళితే పట్టించుకోలేదు. మేం అక్కడ ఉండగానే స్థానిక వైస్ ఎంపీపీకి ఫోన్ చేసిన ఎమ్మెల్యే... మీరు ఇళ్లు కట్టుకోండి. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరని వారికి అభయం ఇచ్చారు. మా స్థలంలో టీడీపీ నేతలు తవ్వకాలు చేపడుతుంటే అడ్డుకున్నాం. అంతే.. అంతా కలబడి నా దుస్తులు చింపేసి దారుణంగా కొట్టారు. ’ – జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట బాధిత దళిత మహిళ ఆక్రోశం. -
24 గంటల్లో భరత్‌రెడ్డిని అరెస్టు చేయాలి
నవీపేట(బోధన్): నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నం దళిత యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్‌లను కిడ్నాప్ చేసి, చిత్ర హింసలకు గురి చేసిన నిందితుడు భరత్‌రెడ్డిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తానని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు హెచ్చరించారు. గ్రామంలోని దళిత బాధితులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దళితుల పట్ల క్రూరంగా వ్యవహరించిన భరత్‌రెడ్డి తీరును గత నెల 11న వీడియోలో చూడగానే స్థానిక సీపీ, ఏసీపీలను అప్రమత్తం చేసి, భరత్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించానన్నారు. కానీ, పోలీసులు ఇంత వరకు అరెస్టు చేయలేదన్నారు. నిందితుడికి సహకరిస్తున్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిందితుడికి ఎంపీ కవిత ఆశ్రయం కల్పించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఆయన వెంట కలెక్టర్ రవీందర్‌రెడ్డి, సీపీ కార్తికేయ ఉన్నారు. రాములు రాక కోసం దళిత సంఘాలు, కాకతీయ, ఉస్మానియా, శాతవాహన వర్సిటీలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు గంటల తరబడి నిరీక్షించారు. లక్ష్మణ్, రాజేశ్వర్‌ను పరామర్శించి బయటకు వస్తుండగా పలు సంఘాల నాయకులు కమిషన్ సభ్యుడు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. -
నేరెళ్లలో అసలేం జరిగింది..?!
సంఘటనపై సీఎం ఆరా - కీలక ప్రజాప్రతినిధులతో మాట్లాడిన కేసీఆర్ - ఉమ్మడి జిల్లా సీనియర్ అధికారులకు ఫోన్ సాక్షి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. శాంతిభద్రతల సమస్యగా మొదలై.. మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్ వరకూ చేరిన ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను సీఎం కేసీఆర్ వివిధ కోణాల్లో తెలుసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఇసుక లారీ దహనం.. పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసి చితకబాదినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు ఘటన వివాదాస్పదం కావడంతో ‘అసలేం జరిగింది’అన్న కోణంలో సీఎం వివరాలు సేకరించినట్లు సమాచారం. ఐదు రోజులపాటు దళిత కుటుంబాలకు చెందిన పెంట బానయ్య, కోల హరీశ్, చెప్యాల బాలరాజు, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్, బత్తుల మహేశ్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారంటూ బాధిత కుటుంబసభ్యుల కథనాలు ఇటు ప్రింట్, అటు ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచారం కావడంతో ఈ సంఘటన దుమారం రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల రాష్ట్ర, జాతీయ నాయకులు, దళిత, ప్రజాసంఘాలు, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల ఆస్పత్రి, జైలు సందర్శన, బాధితులకు పరామర్శ.. సిరిసిల్ల పోలీసులకు మద్దతుగా పోలీసు అధికారుల సంఘం చేసిన ప్రకటన తదితర అంశాలపై ఇంటెలిజెన్స్ అధికారులు పంపించిన నివేదికలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం పూర్వ కరీంనగర్ జిల్లా పరిధిలోని నలుగురు కీలక ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి స్వయంగా మాట్లాడి వివరాలు అడిగినట్లు సమాచారం. ఐదుగురు ఉన్నతాధికారులతో సైతం ఇదే అంశంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు నేరెళ్ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గానే స్పందించింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన కేసు విచారణ బాధ్యతలను సీఐడీకి బదలాయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం మరింత తీవ్రతకు దారితీస్తోంది. నేరెళ్ల వివాదం చినికిచినికి గాలివానగా మారగా.. హక్కుల సంఘాలు, కోర్టులు జోక్యం చేసుకుంటుండటం.. మరోవైపు స్వయంగా సీఎం ఆరా తీస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. -
అమరావతిలో దళితులపై వివక్ష
-
అమరావతిలో దళితులపై వివక్ష
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దళితులపై వివక్ష జరుగుతోందని జాతీయ ఎస్సీ కమిషన్ పేర్కొంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో అసమానతలు చూపుతున్నారని వ్యాఖ్యానించింది. పట్టా భూములకు ఎక్కువ.. లంక, అసైన్డ్ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లిస్తున్నారని.. రాజధానిలో ప్లాట్లు కేటాయించి, న్యాయమైన పరిహారం ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ సూచించింది. అప్పటి వరకు లంక భూముల్లో ఇసుక మైనింగ్ ఆపేయాలని ఆదేశించింది. వీటన్నింటిపై విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక పంపాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సీఆర్డీఏను ఆదేశించింది. -
ఎస్సీ వర్గీకరణ కోరుతూ హైకోర్టులో పిటిషన్
విచారణకు స్వీకరణ కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలోని జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం, ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలై న పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ఆదేశించారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. బీసీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయక పోవడం వివక్ష చూపడమేనని, అందువల్ల ఎస్సీ వర్గీకరణకు 2008లో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, 1999లో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్లు ఇచ్చిన నివేదికలను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదిగ హక్కుల పరిరక్షణ సేవా సమితి సంయుక్త కార్యదర్శి రాయవరపు చిరంజీవరావు, మాదిగ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వ రరావులు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మంగళ వారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్ అనందకుమార్ వాదనలు వినిపిస్తూ.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం సెక్షన్ 3(4) కింద కమిషన్ నివేదికలు సమర్పించిన 6 నెలల్లోపు వాటిని పార్లమెంట్ ఉభయ సభల ముందుం చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నివేదికను అమలు చేసేందుకు కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించా రు. అందువల్ల ఎస్సీ వర్గీకరణ అవసరమని, జస్టిస్ ఉషా మెహ్రా, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ల నివేదికలను అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివా దులుగా ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. -
ఆ భూములను రికార్డుల్లో నమోదు చేయండి
ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్ సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందిన 29 మంది దళిత రైతులకు చెందిన 30 ఎకరాల భూమిని రికార్డుల్లో నమోదు చేసే విధంగా అధికారులకు అదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఉండవల్లి గ్రామంలో తమకు 1977లో లంక భూమలును సాగు చేసుకోవడానికి డీకే పట్టాలిచ్చారని, కానీ ఆ భూముల్ని సాగు, రికార్డుల్లో నమోదు చేయనీయకుండా కొందరు అడ్డుపడుతున్నారని బాధిత రైతులు గ్రామ సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో విచారణకు హాజరుకావాలని గుంటూరు కలెక్టర్‌ను, అధికారులను, బాధిత రైతులను కమిషన్ ఆదేశించింది. బుధవారం విచారణకు అధికారులు హాజరుకాక పోవడంతో కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దళిత రైతుల హక్కులను కాపాడాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కమిషన్ సభ్యురాలు కమలమ్మ మండిపడ్డారు. ఏపీ నుంచి తరచుగా దళితుల భూముల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై తమకు ఫిర్యాదులు అందడం దురదృష్టకరమని ఆమె అన్నారు. అధికారులకు అదేశాలు జారీ చేసి దళిత రైతుల భూములు ఆన్లైన్లో రికార్డు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఆమె లేఖ రాశారు. -
వైఎస్ జగన్ దృష్టికి దళితులపై దాడి ఘటన
పోలీసు హింసపై విచారణకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం సాక్షి, హైదరాబాద్/తెనాలి: గుంటూరు జిల్లా చుండూరు మండలం అంబేడ్కర్ నగరంలో పోలీసులు బెల్టులతో ఇష్టా రాజ్యంగా కొట్టిన ఘటనను బాధిత దళితులు మంగళవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది సోమవారం డిశ్చార్జి అరుున మేడికొండు రవి, కర్రి ప్రేమ్‌చంద్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ని కలసి పోలీసుల దాడితో అరుున గాయాలను చూపించారు. తమకు నిలువ నీడ లేకుండా చేసేలా భయబ్రాంతుల్ని చేస్తున్నారని వాపోయారు. ఈ దాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్.. దాడి దుర్మార్గమని అన్నారు. దీనిపై ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్లలో కేసు వేయాలని పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జునను ఆదేశించారు. అనంతరం బాధితులు నాగార్జున వెంట ఎస్సీ కమిషన్, మానవహక్కుల సంఘ కార్యాలయాలకు వెళ్లి, తమకు జరిగిన అన్యాయంపై విచారించి న్యాయం చేయాలని కోరుతూ అర్జీలిచ్చారు. గత నెల 30వ తేదీ నుంచి జరిగిన సంఘటనల వివరాలను నాగార్జున కమిషనుకు వివరించారు. దీనిపై స్పందించిన కమిషన్ గుంటూరు జిల్లా కలెక్టరు, ఎస్పీకి వెంటనే సమాచారం పంపుతూ ఆ కాపీని బాధితులకు అందజేసింది. బాధితుల ఆరోపణలపై విచారణ చేసి వెంటనే నివేదిక పంపాలని రూరల్ ఎస్పీ నారాయణ్‌నాయక్‌కు లేఖ పంపింది.