ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసులు | Vijayawada Ambedkar Statue Incident: National SC Commission Notices To AP Govt, Check Out The Details | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసులు

Published Fri, Aug 16 2024 3:16 PM | Last Updated on Fri, Aug 16 2024 4:52 PM

Vijayawada Ambedkar Statue Incident: National SC Commission Notices to AP Govt

న్యూఢిల్లీ, సాక్షి: విజయవాడలోని అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించింది. ఈ ఘటన తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి తర్వాత వైఎస్సార్‌సీపీ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించింది. ఈ ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌–ఏటీఆర్‌) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS), రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసింది. ఒకవేళ..  

ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా ఉన్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఆ నోటీస్‌లో స్పష్టం చేసింది. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహంపై దాడికి సంబంధించి గత బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కిషోర్‌ మక్వానాను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు సర్కార్‌కు జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement