
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్‌పై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఏపీతో పాటు కర్ణాటక(జగదీష్ శెట్టర్-రాజీనామా), బీహార్(రామ్‌బాలి సింగ్-అనర్హత వేటు), ఉత్తరప్రదేశ్(స్వామి ప్రసాద్ మౌర్య-రాజీనామా) మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

ఈ నెల 25వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది.నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ జులై 2 కాగా, ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన ఉండనుంది. జులై 12వ తేదీన ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment