MLC quota
-
ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్‌పై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఏపీతో పాటు కర్ణాటక(జగదీష్ శెట్టర్-రాజీనామా), బీహార్(రామ్‌బాలి సింగ్-అనర్హత వేటు), ఉత్తరప్రదేశ్(స్వామి ప్రసాద్ మౌర్య-రాజీనామా) మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది.నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ జులై 2 కాగా, ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన ఉండనుంది. జులై 12వ తేదీన ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. -
తమిళిసైపై హరీష్ రావు ఫైర్.. మీరు గవర్నర్ కావచ్చా? అంటూ..
సాక్షి, మెదక్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను టార్గెట్ చేస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల నుంచి వచ్చిన మీరు గవర్నర్ కావచ్చా? అంటూ తమిళిసైపై హరీష్ సీరియస్ అయ్యారు. తాజాగా, మంత్రి హరీష్ రావు మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై కరెక్ట్ కాదు. ఎరుకల జాతి, విశ్వ బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వీరి ఎంపికను గవర్నర్ తమిళిసై అడ్డుకున్నారు. దేశంలో గవర్నర్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఎరుకల జాతిని రిజెక్ట్ చేసింది. మీరంతా బీజేపీకి గుణపాఠం చెప్పాలి. బీజేపీలో ఉండి తమిళిసై మాత్రం గవర్నర్ కావచ్చు. కానీ, కుర్రా సత్యనారాయణ మాత్రం బీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్సీ కావద్దా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిపక్ష హోదానే లేదు.. ఎన్డీయేలో కేసీఆర్ చేరుతా అన్నారని మొన్న చెబుతున్నారు. అన్నీ జూటా మాటలు. రెండేళ్ల క్రితం కలిస్తే అప్పుడు ఎందుకు చెప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారు. మీతో కలవాల్సిన అవసరం లేనే లేదు. అసలు కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదానే లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే. హైదరాబాద్ నుంచి మెదక్‌కు గూండాల గ్యాంగ్ పైసల కట్టలతో బయలుదేరింది. గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్టు నోట్ల కట్టలు గెలవాలా?. మెదక్ ఆత్మగౌరవం గెలివా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇక, అంతకుముందు.. సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను హరీష్ రావు ప్రారంభించారు. 175 సీట్లు సిద్దిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారని, ఇందులో 25% అంటే 25 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతారని, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందని ప్రశంసించారు. గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పంపించేవారు కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని, నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందించబడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బీఎల్ సంతోష్, బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్ -
రాజ్‌భవన్ అడ్డాగా పాలిటిక్స్.. తమిళిసైపై మంత్రి వేముల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కోటాలో పంపిన(దాసోజు శ్రవణ్, సత్యనారాయణ) సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. ఈ క్రమంలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించలేనని, అర్హుల పేర్లను ప్రతిపాదించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో, గవర్నర్‌పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టే.. తాజాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి ప్రశాంత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందరరాజన్‌కి లేదు. ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయా నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం. అత్యంత వెనుక బడిన కులాలకు(ఎంబీసీ)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణ లను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరపర్చినట్టే. అప్రజాస్వామిక నిర్ణయం.. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమించబడబడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్‌కు నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలి. సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధంలేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు -
కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య వ్యవహారం నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కేసీఆర్ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చారు. రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు. ఇక, అంతకుముందు కూడా గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వ సిఫార్సులను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అర్హతలు వీళ్లకు లేవు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు అని అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఇటీవలే బీజేపీలో చేరారు. అనంతరం, కొన్ని పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా.. సోనియా సమక్షంలో చేరుతున్నా: మైనంపల్లి -
AP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ
సాక్షి, విజయవాడ: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం ఆమోదించారు. కాగా, ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ , కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీవోను జారీ చేశారు. గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం జూలై 20వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా వీరిరువురిని నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఇది కూడా చదవండి: సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు: ఎంపీ విజయసాయిరెడ్డి -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
-
పీవీ కూతురికి కీలక పదవి..!
హైదరాబాద్: శాసనమండలి ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సురభి వాణీదేవికి ప్రాధాన్యతగల పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఉన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన కుటుంబానికి మరింత గుర్తింపు దక్కేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ముగియనుంది. దీంతో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల నుంచి ఇద్దరు నేతలు తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్‌గా పీవీ కుమార్తె, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ గుత్తా సుఖేందర్‌రెడ్డిని తిరిగి మండలికి నామినేట్ చేసే పక్షంలో డిప్యూటీ చైర్మన్ పదవి వాణీదేవికి లభించే సూచనలున్నాయి. సామాజికవర్గ సమీకరణాల లెక్కలపరంగా చూస్తే బ్రాహ్మణ/కరణం సామాజికవర్గం నుంచి శాసనమండలిలో పురాణం సతీష్, శాసనసభలో వొడితెల సతీష్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన సురభి వాణీదేవికి మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవిని అప్పగిస్తే ఆ సామాజికవర్గానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. పీవీ కుటుంబానికి మరింత గుర్తింపు కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆ పార్టీ తగిన గుర్తింపునివ్వలేదని గతంలో విమర్శించిన సీఎం కేసీఆర్... పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం కూడా చేశారు. దీంతోపాటు హైదరాబాద్‌లో పీవీ స్మారకం అభివృద్ధి, త్వరలో అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఆవిష్కరణ, ఢిల్లీ తెలంగాణ భవన్లో కాంస్య విగ్రహం ఏర్పాటు వంటి ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాణీదేవిని మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవిని పీవీ శతజయంతి సందర్భంగా ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. వాణీదేవి ప్రస్తుతం కరోనా బారినపడటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆమె వచ్చే నెల ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. -
‘మండలి’ గందరగోళానికి తెర
* ఎమ్మెల్సీ స్థానాల కోటాపై స్పష్టత * పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదం * ఎమ్మెల్యే కోటాలో ఒకటి కట్ * స్థానిక సంస్థల కోటాలో 3 అదనం * ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్యే కోటాకు ఎన్నికల షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం శాసన మండలిలో స్థానాల అంశంపై నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నుకునే సభ్యుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యలో మార్పులు చేర్పులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ పంపిన ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్ర వేయటంతో గురువారం గెజిట్ వెలువడింది. దీంతో రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఒక స్థానం తగ్గిపోయింది. స్థానిక సంస్థల కోటాలో మాత్రం అదనంగా మూడు సీట్లు పెరగనున్నాయి. జనాభా ప్రాతిపదికన రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఈ సీట్లు పెంచే అవకాశముంది. అంటే ఈ మూడు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో ఇద్దరేసి ఎమ్మెల్సీలు ఎన్నికవుతారు. విభజనతో గందరగోళం.. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర శాసనమండలికి మొత్తం 40 సీట్లు కేటాయించారు. అందులో ఎమ్మెల్యే కోటాలో 14 సీట్లు.. స్థానిక సంస్థల కోటాలో 14 సీట్లు.. గవర్నర్ కోటాలో ఆరు, పట్టభద్రుల కోటాలో మూడు, టీచర్ల కోటాలో మూడు సీట్లుగా నిర్దేశించారు. కానీ విభజన జరిగే నాటికి ఎమ్మెల్యే కోటాలో 15 మంది, స్థానిక సంస్థల కోటాలో 11 మంది సభ్యులు ఉండడం గందరగోళానికి దారి తీసింది. ఇక ఇటీవల ఎమ్మెల్యే కోటాలోని ఏడుగురు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి స్థానాల సంఖ్య, కోటా విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)ను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. దీనిపై సీఈసీ కేంద్ర హోంశాఖను సంప్రదించగా.. కోటాల్లో మార్పులు చేస్తూ సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఎమ్మెల్యే కోటాలో పదవీ విరమణ చేసిన కేఆర్ ఆమోస్ మినహా మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సూచించారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల కోటా స్థానాల సంఖ్యను 14కు పెంచాలని, ఇందుకోసం ఆయా స్థానాల పునర్విభజన చేపట్టాలని పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్.. ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యపై స్పష్టత రావడంతో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇక స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఆయా స్థానాల పునర్విభజన చేపట్టిన అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. జనాభా ప్రాతిపదికన రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా సీట్లను పెంచేందుకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ కోటాలో ఆదిలాబాద్, వరంగల్ స్థానాలు రెండేళ్ల కిందే ఖాళీ అయ్యాయి. వివిధ కారణాలతో వాటికి ఎన్నికలు జరగలేదు. ఇదే కోటాలోని మరో ఏడుగురు ఎమ్మెల్సీలు మే ఒకటో తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ లెక్కన స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరపాల్సి ఉంటుందని ఈసీ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు గవర్నర్ కోటాలోనూ ఒక సీటు మార్చి 29న ఖాళీ అయింది. దీన్ని సైతం భర్తీ చేయాల్సి ఉంది. -
తమ్ముడి ‘కోటా’ అన్న పాలు
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక చిన్న పొరపాటు తెలుగు తమ్ముడు ఒకరికి టికెట్ రాకుండా చేసింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్రయాదవ్ పేరు దాదాపుగా ఖరారైంది. ఖరారైనట్టు ఆయనకు సమాచారం కూడా ఇచ్చారు. దాంతో ఆయన నామినేషన్ వేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ పత్రికలు, టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. అయితే ఈ పరిణామం అదే జిల్లాకు చెందిన కీలక నేత ఒకరికి కోపం తెప్పించింది. టికెట్ ఖరారైన తర్వాతగానీ ముందుగానీ తనను కలుసుకోలేదనీ కనీసం ఫోన్లో పలకరించలేదన్న కోపంతో చివరి నిమిషంలో చక్రం తిప్పి టికెట్ రాకుండా చేశారట! దీనికోసం రవిచంద్ర అన్నను రంగంలోకి దింపారు. రవిచంద్ర సోదరుడు మస్తాన్‌రావు గత ఎన్నికల్లో కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మీ సోదరుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే భవిష్యత్తులో మీకు ఎమ్మెల్యే టికెట్ రాదని చంద్రబాబు వద్ద పలుకుబడి ఉన్న ఆ నేత మస్తాన్‌రావు చెవిలో ఊదారు. తన తమ్ముడి టికెట్ కాస్తా తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందన్న ఆలోచన అన్నను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో చెవిలో ఊదిన ఆ ముఖ్య నేత ద్వారానే విషయాన్ని అధినేతకు చేరవేశారు. దాంతో భవిష్యత్తులో అన్నకు టికెటిస్తాం... కాబట్టి ఈసారి తమ్ముడికి లేదని తేల్చేశారు. ఎంపిక చేసిన అభ్యర్థిని పక్కకు తప్పించాల్సిన పరిస్థితి ఇంత సులభంగా దక్కడంతో అధినేత సైతం అనంతపురం జిల్లాకు చెందిన తిప్పేస్వామి పేరును ఖరారు చేశారట. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో... అన్నన్నా! ఎంతపనిచేశారంటూ తెలుగు తమ్ముడు నివ్వెరపోయారట.