సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల వివాదం తారాస్థాయికి చేరుకుంది. టిక్కెట్ల కేటాయింపులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. బీజేపీకి ఓడిపోయే సీట్లను కేటాయించేలా చంద్రబాబు వ్యూహం పన్నారు. బీజేపీకి టీడీపీ కేటాయిస్తున్న సీట్లు.. శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలుగా ప్రచారం జరుగుతోంది.
విశాఖ జిల్లాలో రెండు స్ధానాలు విశాఖ నార్త్/ పాడేరు/ చోడవరం లేదా మాడుగుల, తూర్పు గోదావరి జిల్లాలో రెండు స్ధానాలు పి.గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్ధానాలు కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో ఒక స్ధానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి సీట్లను బీజేపీ అడుగుతోంది.
బీజేపీ అడిగిన స్ధానాలలో చోడవరం, మాడుగుల రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి.. ఎనిమిది స్ధానాలలో ఇప్పటికే అభ్యర్ధులను టీడీపీ ప్రకటించింది. చోడవరం లేదా మాడుగుల స్ధానాలు బీజేపీ కోరగా.. నిన్న ఏకపక్షంగా చంద్రబాబు ఆ స్ధానాలు ప్రకటించారు.
రాజమండ్రి స్ధానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుకి కేటాయించి అనపర్తిని బీజేపీకి చంద్రబాబు అంటగట్టారు. అనపర్తిలో బీజేపీకి అర్బన్ అధ్యక్షుడు కూడా లేరని బీజేపీ నేతలు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్ట్ చంద్రబాబు కేటాయించారు. జనసేన నేత పోతిన మహేష్ ఆశలకి గండి కొడుతూ విజయవాడ వెస్ట్ బీజేపీకి కేటాయించారు. కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలంటూ బీజేపీ పట్టుబట్టగా, బీజేపీకి మొండిచేయి చూపి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలను చంద్రబాబు ప్రకటించారు.
హిందూపూర్ లోక్ సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు పెట్టుకోగా, లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని ఆయన భావించారు. చంద్రబాబు రాజకీయంతో విష్ణువర్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లారు. కదిరిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్ధసారధి, ఆయన తనయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీలకి నిరాశే ఎదురైంది. కడప పార్లమెంట్‌లో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బీజేపీకి కే టాయించారు. బద్వేలు ఉప ఎన్నికలలో డిపాజిట్ కూడా రాలేదని బీజేపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. బద్వేలులో టీడీపీకి అభ్యర్ధి లేకపోవడంతో బీజేపీకి కేటాయించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వరదాపురం సూరి కోసం ధర్మవరం, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు సీట్లు చంద్రబాబు.. బీజేపీకి కేటాయించారు.
ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు బి టీమ్ అంటూ బీజేపీ అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదులు చేశారు. రెండున్నర దశాబ్దాలుగా టీడీపీ ఓడిపోతున్న సీట్లన్నీ బీజేపీకే కేటాయించడంపై చంద్రబాబు కుటిల రాజకీయాలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీలో శివప్రకాష్‌జీకి బీజేపీ సీనియర్లు ఫిర్యాదు చేశారు. కొన్ని సీట్లు మార్చాలంటూ టీడీపీపై బీజేపీ ఒత్తిడి చేస్తోంది.
ఇదీ చదవండి: రెండు కళ్ల సిద్ధాంతంతో బాబుని గుర్తు చేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment