అమరావతిలో దళితులపై వివక్ష | dalits Partialitised in amaravathi, says national sc commission | Sakshi
Sakshi News home page

అమరావతిలో దళితులపై వివక్ష

Published Sat, Mar 4 2017 11:40 AM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

అమరావతిలో దళితులపై వివక్ష - Sakshi

అమరావతిలో దళితులపై వివక్ష

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో దళితులపై వివక్ష జరుగుతోందని జాతీయ ఎస్సీ కమిషన్ పేర్కొంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో అసమానతలు చూపుతున్నారని వ్యాఖ్యానించింది.

పట్టా భూములకు ఎక్కువ.. లంక, అసైన్డ్ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లిస్తున్నారని.. రాజధానిలో ప్లాట్లు కేటాయించి, న్యాయమైన పరిహారం ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ సూచించింది. అప్పటి వరకు లంక భూముల్లో ఇసుక మైనింగ్ ఆపేయాలని ఆదేశించింది. వీటన్నింటిపై విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక పంపాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సీఆర్‌డీఏను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement