
నాగార్జున
దివంగత ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా (సోమవారం, సెప్టెంబరు 20) ‘ఏయన్నార్ లివ్స్’ అంటూ ఓ ప్రత్యేకమైన వీడియోను షేర్ చేశారు ఆయన తనయుడు, హీరో నాగార్జున. తన తాజా చిత్రం ‘బంగార్రాజు’లోని తన పాత్ర తాలూకు విశేషాలను ఈ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘నా హీరో, నా స్ఫూర్తిప్రదాత మా నాన్నగారు. ఆయనకు పంచెకట్టు చాలా ఇష్టం. ముఖ్యంగా పొందూరు ఖద్దరంటే ఇంకా ఇష్టం.
ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా పొందూరు ఖద్దరే. అలాగే నవరత్నాల హారం, నవరత్నాల ఉంగరం. ఇక నేను పెట్టుకున్న ఈ వాచ్ నాకన్నా సీనియర్. నాన్నగారి ఫేవరెట్ వాచ్ ఇది. ఇప్పుడు నా ఫేవరెట్ వాచ్. ఇవన్నీ ధరిస్తే నాన్నగారు నాతోనే ఉన్నట్లు ఉంటుంది. ఏదో తృప్తి. నాన్నగారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం’’ అంటూ ఆ వీడియోను నాగార్జున షేర్ చేశారు. ‘బంగార్రాజు’ సినిమాలో ఏయన్నార్‌ని గుర్తు తెచ్చేలా నాగార్జున గెటప్‌ను డిజైన్ చేశారు ఈ చిత్రదర్శకుడు కల్యాణ్‌కృష్ణ. ఈ చిత్రంలో నాగచైతన్య, కృతీ శెట్టి, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రధారులు.
Comments
Please login to add a commentAdd a comment