
డ్రైవర్ టు డెరైక్టర్
సినిమాలంటే చాలా ఇష్టం
వరంగల్‌లో సూపర్ లొకేషన్లు
‘ఒక్కడితో మొదలైంది’ డెరైక్టర్ నాగేశ్వర్ రావు
పోచమ్మమైదాన్ : డ్రైవర్ నుంచి డెరైక్టర్‌గా ఎదగడం.. పొంతన లేదు కదూ! కావాల్సినంత ఆసక్తి మాత్రం ఉంది. సినిమాపై ఎనలేని ఇష్టం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు ‘ఒక్కడితో మొదలైంది’ చిత్ర దర్శకుడు మొగిళి నాగేశ్వర్‌రావు. తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి లొకేషన్లు చూసేందుకు ఆదివారం వరంగల్‌కు వచ్చిన ఆయనను ‘సాక్షి’ పలకరించింది. ఆయన మాటల్లోనే..
అలా సినిమాలు చూసేవాణ్ని
నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే చాలా ఇష్టం. స్కూల్‌కు వెళ్లే సవుయంలో చాక్లెట్ల కోసం తరచూ ఇంట్లో డబ్బులడిగే వాణ్ని. వాటిని కూడబెట్టి సినిమాకు వెళ్లేవాణ్ని. తర్వాత కొత్త సినిమా రిలీజైతే చాలు కాలేజీ బంక్ కొట్టి చూసేవాణ్ని. ఆ ఇష్టం కాస్తా ఇండస్ట్రీ వైపు నడిపించింది.
వరంగల్‌లోనే తీశాను..
ఒక్కడితో మొదలైంది చిత్రాన్ని జిల్లాలోఏ 70 శాతం చిత్రీకరించాను. లో బడ్జెట్ లో సూపర్ లొకేషన్లు ఇక్కడ ఉన్నారుు. నా తదుపరి చిత్రం కోసం లొకేషన్లు అన్వేషించేం దుకు వచ్చాను. కాశిబుగ్గకు చెందిన పాషా, సత్యనారాయణ కొత్త లొకేషన్లు చూపిస్తారు.
త్వరలో చక్రి స్మారక కార్యక్రమం..
ఖమ్మంలో చక్రి స్మారక కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తాం. వృద్ధ కళాకారులను ఘనంగా సన్మానించి ఆ రోజును చక్రికి అంకితం చేస్తాం. సినీ ప్రముఖులను ఆహ్వానిస్తాం. చక్రి అన్న పాటలు అంటే నాకు ప్రాణం. ఆయన మరణించిన సమయంలో అందుబాటులో లేను.
ఇలా డెరైక్టర్ అయ్యూను..
మా కుటుంబం కష్టాల్లో ఉండడంతో చదువు ఆపేసి డ్రైవర్ శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో తెలిసిన వారి ద్వారా సినిమా ఫైనాన్సియర్ జగదీశ్వర్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా చేరి రెండేళ్లు పనిచేశాను. పరిచయమైన డెరైక్టర్ల వద్ద మెళకువలు నేర్చుక్నునారు. నాకో పాత్ర ఇప్పించండి అని ఓ రోజు జగదీశ్వర్ రెడ్డి సార్‌ను అడిగాను. మనమే ఓ సినిమా తీద్దాం అన్నారాయన. తర్వాత జీవితం అనే సీరియల్, ‘తొలి అడుగు’ వీడియో సాంగ్స్ తీసి విజయవంతమయ్యూ. ఓ మిత్రుడు నన్ను దర్శకుడిగా మారమని, తాను ప్రొడ్యూస్ చేస్తానని అడిగాడు. అలా ‘ఒక్కడితో మొదలైంది’ చిత్రం పురుడుపోసుకుంది. మరో 20 రోజుల్లో సినిమాను రిలీజ్ చేస్తాం.