
ప్రేమను గెలిచాడా?
ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? అనే కథాంశంతో సుధాకర్ పట్నం, నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లికి ముందు ప్రేమకథ’. ప్రిన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అశ్విన్, సునయన కథానాయికలు. మధు గోపు దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అనంత్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, ‘అల్లరి’ నరేశ్ క్లాప్ ఇచ్చారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. కథాకథనాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: రవికుమార్.