pelliki mundu prema katha
-
'పెళ్ళికి ముందు ప్రేమకథ' మూవీ స్టిల్స్
-
ఫుల్ మీల్స్
చేతన్ శీను, సునైన జంటగా మధు గోపు దర్శకత్వంలో ప్రేమ్‌కుమార్ పాట్ర సమర్పణలో గణపతి ఎంటర్టైన్మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘పెళ్ళికి ముందు ప్రేమకథ’. డీఎస్కే, అవినాష్ సలండ్ర, సుథాకర్ పట్నం నిర్మాతలు. హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఈ సినిమా తీశా. యూత్‌పుల్ ఎంటర్టైనర్ ఇది. చేతన్ శీను బాగా యాక్ట్ చేశాడు. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి చిత్రమిది’’ అన్నారు. ‘‘డి.ఎస్. రావుగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్స్. ‘రాజుగారి గది’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుం దని నమ్ముతున్నాను’’ అన్నారు హీరో చేతన్ శీను. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డి.ఎస్. రావు, మల్కాపురం శివకుమార్, దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి పాల్గొన్నారు. -
పెళ్లికి ముందు ప్రేమ
‘‘చాలామంది జీవితాల్లో పెళ్లికి ముందు ప్రేమకథలుంటాయి. ఆ ప్రేమకథలు ఎలా ఉంటాయి. పెళ్లి తర్వాత ఎలాంటి మార్పు లు వస్తాయి?’’ అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళికి ముందు ప్రేమ కథ’. చేతన్ శీను, సునైన జంటగా మధు గోపు దర్శకత్వంలో డి.ఎస్.కె, అవినాష్ సలండ్ర, సుధాకర్ పట్నం నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాతలు కేయస్ రామారావు, మల్కాపురం శివకుమార్, టీజర్‌ను దర్శకుడు అశోక్ విడుదల చేశారు. ‘‘పెళ్లికి ముందు నడిచిన లవ్‌స్టోరీస్ వల్ల ఓ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలొచ్చాయి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది కథ. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సమర్పణ: ప్రేమ్‌కుమార్ పాట్ర, మాస్టర్ అవినాష్ సలండ్. -
ప్రేమను గెలిచాడా?
ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? అనే కథాంశంతో సుధాకర్ పట్నం, నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లికి ముందు ప్రేమకథ’. ప్రిన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అశ్విన్, సునయన కథానాయికలు. మధు గోపు దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అనంత్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, ‘అల్లరి’ నరేశ్ క్లాప్ ఇచ్చారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. కథాకథనాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: రవికుమార్.