
పెళ్లికి ముందు ప్రేమ
‘‘చాలామంది జీవితాల్లో పెళ్లికి ముందు ప్రేమకథలుంటాయి. ఆ ప్రేమకథలు ఎలా ఉంటాయి. పెళ్లి తర్వాత ఎలాంటి మార్పు లు వస్తాయి?’’ అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళికి ముందు ప్రేమ కథ’. చేతన్ శీను, సునైన జంటగా మధు గోపు దర్శకత్వంలో డి.ఎస్.కె, అవినాష్ సలండ్ర, సుధాకర్ పట్నం నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాతలు కేయస్ రామారావు, మల్కాపురం శివకుమార్, టీజర్‌ను దర్శకుడు అశోక్ విడుదల చేశారు.
‘‘పెళ్లికి ముందు నడిచిన లవ్‌స్టోరీస్ వల్ల ఓ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలొచ్చాయి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది కథ. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సమర్పణ: ప్రేమ్‌కుమార్ పాట్ర, మాస్టర్ అవినాష్ సలండ్.