
ఫుల్ మీల్స్
చేతన్ శీను, సునైన జంటగా మధు గోపు దర్శకత్వంలో ప్రేమ్‌కుమార్ పాట్ర సమర్పణలో గణపతి ఎంటర్‌టైన్‌మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘పెళ్ళికి ముందు ప్రేమకథ’. డీఎస్‌కే, అవినాష్ సలండ్ర, సుథాకర్ పట్నం నిర్మాతలు. హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఈ సినిమా తీశా. యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ఇది. చేతన్ శీను బాగా యాక్ట్ చేశాడు. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి చిత్రమిది’’ అన్నారు. ‘‘డి.ఎస్. రావుగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్స్. ‘రాజుగారి గది’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుం దని నమ్ముతున్నాను’’ అన్నారు హీరో చేతన్ శీను. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డి.ఎస్. రావు, మల్కాపురం శివకుమార్, దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి పాల్గొన్నారు.