కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భామ సునయన. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.
తాజాగా ఆమె ప్రముఖ యూట్యూబర్, దుబాయ్‌కు చెందిన ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖలీద్ ఇటీవల జూన్ 26న అమ్మాయి వేలికి డైమండ్ రింగ్‌తో చేతులు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
కాగా.. సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్‌లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది.
మొదటి భార్యతో విడాకులు..
కాగా.. జూలై 1న ఖలీద్ అల్ అమెరీ మాజీ భార్య సలామా మొహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ తాను, ఖలీద్ విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీనే కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆమె పేర్కొంది. దుబాయ్‌కు చెందిన ఖలీద్ అల్ అమెరికీ సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment