చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు స్లిమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. అలాగే ఆరోగ్యంపై సరైన అవగాన కల్పిస్తున్నారు కూడా. కొంతమంది వారిని ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గుతున్నారు కూడా. ఇప్పుడు తాజాగా అదే కోవలోకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా కూడా చేరిపోయారు. కిలోల కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సునైనా వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ కుమార్తె సునైనా బొద్దుగా అందంగా ఉండేది. చాలమందికి తెలుసు ఆమె చాలా లావుగా ఉంటుందని. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతలా స్లిమ్‌గా మారిపోయింది. దాదాపు 50 కిలోలు బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆమెకు కామెర్లు వంటి ఆరోగ్య సమస్యలున్నప్పటికీ విజయవంతంగా బరువు తగ్గినట్లు వెల్లడించిది. నిజానికి ఆమె గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్‌తో పోరాడుతోంది. ఆమె ఇన్ని అనారోగ్య సమస్యలను అధిగమించి మరీ..బరువు తగ్గేందుకు ఉపక్రమించడం విశేషం.
తన అనారోగ్య భయమే తనను సరైన ఆహారం తీసుకునేలా చేసిందంటోంది సునైనా. తాను పూర్తిగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. "సరైన జీవనశైలితో కూడిన ఆహారం కామెర్లు సమస్యను తగ్గుముఖం పట్టేలా చేసింది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. తన తదుపరి లక్ష్యం పూర్తి స్థాయిలో ఫ్యాటీలివర్‌ని తగ్గిచడమే". అని ధీమాగా చెబుతోంది సునైనా
ఫ్యాటీ లివర్‌తో బరువు తగ్గడం కష్టమా..?
ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఆ సమస్యతో ఉండే వ్యక్తులు బరువు తగ్గడం అనేది అంత ఈజీ కాదు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇది జీవక్రియ చర్యలకు అంతరాయం కలిగించి బరువు పెరిగేలా చేస్తుంది. పైగా దీర్ఘకాలిక మంట, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీసి కండరాల పనితీరుని, శరీరంలోని శక్తి స్థాయిలను తగ్గించేస్తుంది. ఫలితంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..)
Comments
Please login to add a commentAdd a comment