పెరుగుతున్న ఎండలకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడులో ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతిచెందాడు. గ్రామానికి చెందిన కొలక నాగేశ్వరరావు(41) సొంత పని పై ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందాడు.