ఆటో యూనియన్‌లో చీలిక
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విడిచిపెట్టిన పోలీసులు
అచ్యుతాపురం: ఆటో స్టాండ్‌లో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో కుండలకు పసుపు రుంగుపూయడం వివాదానికి దారితీసింది. పసుపురంగు వేయడాన్ని వ్యతిరేకించినందుకు నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ పై కక్షసాధింపునకు దిగారు. వివరాలు ఇలా ఉన్నా యి. యలమంచిలో రోడ్డులో మంగళవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దేశంపార్టీ నాయకులు దీనినిప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కుండలకు పసుపు పసుపు రంగు పూశారు. యూనియన్‌లో 250 మంది సభ్యులు ఉన్నారు. ఒక వర్గం సభ్యులకు పసుపు రంగుపూయడం నచ్చలేదు.
ఆ వర్గం తరఫున గొర్లెధర్మవరానికి చెందిన నాగేశ్వరావు అనే ఆటోడ్రైవర్ యూనియన్ కార్యవర్గాన్ని ప్రశ్నించాడు. అధికారపార్టీ నాయకులని పిలిచి ప్రారంభించడంవరకూ అభ్యంతరం లేదని, కానీ కుండలకు పసుపు రంగుపూసి యూనియన్‌ని దేశంపార్టీకి తాకట్టుపెట్టడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ విషయం దేశంపార్టీ నాయకులవరకూ వెళ్లింది. పోలీసులను రంగంలోకి దిం చారు. నాగేశ్వరావు ఆదుపులోకి తీసుకున్నారు. ఆరు గంటలపాటు నాగేశ్వరావుని స్టేషన్‌లో కూర్చోబెట్టారు. గొడవ జరిగితే ఇరువర్గాలను పిలిచి మాట్లాడాలిగాని ఒక వ్యక్తిపై కక్షకట్టడం ఏమిటని మీడియా జోక్యంచేసుకోవడంతో ఎట్టకేలకు నాగేశ్వరావుని విడిచిపెట్టారు.