వివాహితకు ఫోన్‌లో వేధింపులు | Married woman phone harassment | Sakshi
Sakshi News home page

వివాహితకు ఫోన్‌లో వేధింపులు

Published Wed, Jul 2 2014 12:40 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

వివాహితకు ఫోన్‌లో వేధింపులు - Sakshi

వివాహితకు ఫోన్‌లో వేధింపులు

ఉప్పలగుప్తం : ఇటీవల వివాహమైన తన కు ఫోన్ చేసి వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన భర్తతో కలిసి ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్ ముందు మంగళవారం రాత్రి బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ ఏడాది మార్చి ఏడున కిత్తనచెరువుకు చెందిన పులపర్తి నానిబాబుతో సత్యశైలకు వివాహమైంది. అదే గ్రామానికి చెందిన పోతుల నాగేశ్వరరావు(నాగు) అనే వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు.
 
 ఈ విషయాన్ని తన భర్తకు చెప్పినా.. నాగేశ్వరరావు నుంచి ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్దల ద్వారా చెప్పించినా.. ఎస్సై స్వామినాయుడు పట్టించుకోలేదు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ భార్యాభర్తలు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మాజీ సర్పంచ్ యల్లమిల్లి రాముతో పాటు పలువురు గ్రామస్తులు వారికి అండగా నిలిచారు. దీనిపై ఎస్సై స్వామినాయుడును వివరణ కోరగా, ఆ వ్యక్తిని పిలిపిస్తానని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement