జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయాలని డీఈవో నాగేశ్వరరావు ఆదే శించారు.
చిత్తూరు (గిరింపేట): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయాలని డీఈవో నాగేశ్వరరావు ఆదే శించారు. గత ఏడాది జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా ఇచ్చిన సెలవులకు ప్రత్యామ్నాయంగా ఈ నెలలో రెండో శనివారాన్ని పని దినంగా పాఠశాలలు నిర్వహించాలని తెలిపారు. కాగా, ఈ విషయాన్ని జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంలకు శుక్రవారం సాయంత్రం పాఠశాల సమయం పూర్తయ్యేలోగా సందేశాల రూపంలో అందజేయాల్సి ఉంటుంది.
అయితే ఆ విషయాన్ని శుక్రవారం రాత్రి 7 గంటలకు తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో దాదాపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు శనివారం సెలవు దినమని బాధ్యులు ప్రకటించారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో శనివారం పాఠశాలలను నిర్వహించినా చాలా మంది విద్యార్థులు డుమ్మా కొట్టడం ఖాయమని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంటున్నారు.