Telangana: TSPSC Group 4 Exam Date Holiday For These Students - Sakshi
Sakshi News home page

గ్రూప్‌ 4 పరీక్ష: వాళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Published Thu, Jun 29 2023 9:16 PM | Last Updated on Fri, Jun 30 2023 6:07 PM

Telangana: Tspsc Group 4 Exam Date Holiday For These Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూలై 1న జరిగే గ్రూప్‌-4 పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఈ క్రమంలో జూలై 8 రెండో శనివారం రోజును వర్కింగ్ డే ప్రకటించింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి జులై 1న పరీక్ష జరగనుంది. 

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్‌లో గ్రూప్‌-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష మొత్తం 9 లక్షల 50 వేలమంది రాయనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.

చదవండి: గ్రూప్‌-4 ప‌రీక్ష‌.. అభ్య‌ర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement