
photo credit:HINDUSTAN TIMES
చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు విడిచిపెట్టడం లేదు. మొన్నటి దాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్‌కాశి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు,ప్రైవేటు సంస్థల ఆఫీసులకు సెలవు ప్రకటించింది.
దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
‘కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్‌కాశీ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్‌ఎఫ్)కు చెందిన 250 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం నియమించాం’ అని తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మంత్రి రామచంద్రన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment