![నా భార్య మోసం చేసింది](/styles/webp/s3/article_images/2017/09/3/61448045620_625x300.jpg.webp?itok=LIm35JsF)
నా భార్య మోసం చేసింది
మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం
సెల్ఫ్ వీడియోలో ‘మరణ వాంగ్మూలం’ రికార్డు
గాంధీ ఆస్పత్రి : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసిందని, తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికి దారితీసిన పరిస్థితుల్ని తన సెల్‌ఫోన్‌లో సెల్ఫ్ వీడియో ద్వారా చిత్రీకరించాడు. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం...
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన డి.నాగేశ్వరరావు(28) కరాటే మాస్టర్. బామవరిది చెల్లెలైన బాపట్లకు చెందిన వరలక్షి్ష్మని ప్రేమించి గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నాడు. వరలక్షి్ష్మ హైదరాబాద్ చంచల్‌గూడలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. బన్సీలాల్‌పేటలో వీరి నివాసం. తెనాలిలోనే ఉంటున్న నాగేశ్వరరావు వారంలో రెండు రోజులు ఇక్కడికి వచ్చి వెళతాడు. కొద్దిరోజులగా వరలక్ష్మి ప్రవర్తనలో మార్పు గమనించిన నాగేశ్వరరావు... ఆమె ఓ వ్యక్తితో చాటింగ్ చేస్తుండగా చూసి మందలించాడు. ఆమెలో మార్పు లేకపోవడంతో విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లగా వారు కౌన్సెలింగ్ చేశారు.
అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో నాగేశ్వరరావు మంగళవారం బన్సీలాల్‌పేటలోని ఇంట్లో పురుగుల మందు తాగి నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న నాగేశ్వరరావును గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య తనను మోసం చేసి పదిమందిలో పరువు తీసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తమకు నాగేశ్వరరావు ఫోన్ చేసి చెప్పాడని అతడి తల్లి పాపమ్మ, సోదరి ఆదిలక్షి్ష్మ ఆస్పత్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.
అదే విషయాన్ని తన వీడియోలో బందించాడు బాధితుడు. నాగేశ్వరరావు తండ్రి పోలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, తనను వెంటపడి పెళ్లి చేసుకున్న నాగేశ్వరరావు అనుమానంతో నిత్యం వేధించేవాడని వరలక్ష్మి చెప్పారు.