varalaxmi
-
‘వండర్’ వరలక్ష్మి.. సాఫ్ట్‌బాల్ క్రీడలో సత్తా చాటుతున్న సిక్కోలు విద్యార్థిని
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు విద్యార్థిని కూటికుప్పల వరలక్ష్మి సాఫ్ట్‌బాల్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఏసియన్ యూనివర్సిటీ మహిళల(సీనియర్స్) సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2022 పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ పోటీలు డిసెంబర్ 17 నుంచి 21 వరకు బ్యాంకాక్‌లో జరగనున్నాయి. త్వరలో భారత జట్టు సభ్యులతో కలిసి ఆమె శిక్షణ తీసుకోనుంది. కొత్తవలస నుంచి బ్యాంకాక్‌కు.. వరలక్ష్మి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కొత్తవలస. ఆమె తల్లిదండ్రులు కూటికుప్పల రాజు, భారతి దినసరి కూలీలు. పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. తొగరాంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న సమయంలో వరలక్ష్మి సాఫ్ట్‌బాల్ క్రీడపై ఆసక్తి కనబరిచింది. అక్కడి ఫిజికల్ డైరెక్టర్ మొజ్జాడ వెంకటరమణ ఆమెకు సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో ఆమె జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయికి ఎంపికైంది. సాఫ్ట్‌బాల్ క్రీడలో పిక్చర్(బౌలింగ్) చేయడంలో వరలక్ష్మి దిట్ట. 2012లో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటిసారి పాల్గొన్న వరలక్ష్మి తన అద్భుత ఆటతీరుతో.. జాతీయ పోటీలకు ఎంపికైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. తాను పాల్గొన్న ప్రతి పోటీలోను రాణించింది. 2019–20లో రాజస్తాన్‌లో జరిగిన సౌత్‌జోన్ సీనియర్ నేషనల్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో వరలక్ష్మి ప్రాతినిథ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ జట్టు రజత పతకం సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యానాంలో జరిగిన ఆసియా కప్ సెలెక్షన్స్‌లో కూడా పాల్గొని ప్రతిభ కనబరిచి ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకుంది. వీరికి మధ్యప్రదేశ్‌లో శిక్షణా శిబిరం నిర్వహించగా.. వరలక్ష్మి సత్తా చాటి బ్యాంకాక్‌లో జరిగే ఏసియన్ యూనివర్సిటీ మహిళల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యింది. వరలక్ష్మి మరోవైపు చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. తొగరాం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనే ఇంటర్ పూర్తిచేసిన ఆమె.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ కాలేజీలో డిప్లమో ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ప్రతిభకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాదని వరలక్ష్మి నిరూపిస్తోందని గ్రామస్తులు, పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మ, నాన్న కూలి పనులకు వెళ్తుంటారు. మా అమ్మా, నాన్నతో పాటు మా గురువు, పీడీ వెంకటరమణ ప్రోత్సాహం వల్లే నేను ఆటలో ముందుకెళ్లా. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. జాతీయ సీనియర్ జట్టుకు ఎంపిక కావడమే నా లక్ష్యం. – కూటికుప్పల వరలక్ష్మి, సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి -
హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వరలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎం.వరలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం వరలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని క్షమశిక్షణ చర్యల కింద తొలగించడంతో వరలక్ష్మిని నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. (క్లిక్: ముందే చెబితే ‘చెయ్యి’స్తారేమో?) -
వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి అవకాశాలు
శంషాబాద్: వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యువత నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున్‌రావు స్వాగతం పలికారు. ఫౌండేషన్‌లో వివిధ కోర్సుల శిక్షణ తీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. టైలరింగ్ శిక్షణ తీసుకుని అక్కడే పనిచేస్తున్న మహిళలతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం బాగుందని కితాబిచ్చారు. తర్వాత జీఎంఆర్, చిన్మయ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో వెంకయ్యనాయుడు మొక్కను నాటారు. -
వరలక్ష్మీ ఘటన చాలా బాధాకరం
-
వరలక్ష్మీ హత్య కేసు: అఖిల్ సాయికి 14 రోజుల రిమాండ్
-
ఉన్మాదం
-
10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్
-
గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, విశాఖపట్నం : గాజువాక ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ, సీఎస్‌ని ఆదేశించారు. బాధితురాలు వరలక్ష్మి కుటుంబసభ్యులకు 10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్‌లను సీఎం జగన్ ఆదేశించారు. విద్యార్థినులందరూ దిశా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ప్రేమోన్మాదం ఓ యువతి ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్న వరలక్ష్మి (17) అనే యువతిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్(21) ప్రేమ పేరుతో వేధించేవాడు. శనివారం రాత్రి రాము అనే స్నేహితుడితో కలిసి ఆమెకు ఫోన్‌చేసి సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్‌సాయిని నిలదీయగా.. మాట్లాడాలి రా అంటూ తుప్పల్లోకి లాక్కెళ్లాడు. అక్కడి పరిస్థితిని చూసిన వరలక్ష్మి ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్ చేసి చెప్పగా.. కోపోద్రిక్తుడైన అఖిల్‌సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికాడు. హోం మంత్రి మేకతోటి సుచరితకు ఆదేశం.. ఘటన తెలిసిన వెంటనే ఆదివారం ఉదయం సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి సీఎం జగన్ వివరాలను తెలుసుకున్నారు. వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్‌ను ఆదేశించారు. ప్రతి టీనేజ్ బాలిక మొదలు ప్రతి మహిళ వరకు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా వారిని ఎడ్యుకేట్ చేయాలన్నారు. ప్రత్యేకించి పాఠశాలల్లో చదువుతున్న బాలికలు మొదలు కాలేజీ విద్యార్థినుల వరకు వందకు వంద శాతం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని బాలిక లేదా మహిళ ఏదైనా సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. కాగా ఘటనలో ప్రధాన నిందితుడు అఖిల్‌సాయి ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదువుతున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రేమోన్మాది అఖిల్ సాయి, రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల్‌సాయి - రాముతో వరలక్ష్మికి ఉన్న సాన్నిహిత్యంపై విచారణ చేపడుతున్నారు. రాముతో సాన్నిహిత్యంగా ఉండటంతో అఖిల్ వరలక్ష్మిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వరలక్ష్మి హత్యకేసులో లోతుగా విచారణ చేపట్టాము. నిందితుడు అఖిల్ సాయి పై దిశా చట్టం పై కేసు నమోదు చేశాము. వారం రోజుల్లో చార్జిషీట్ కూడా దాఖలు చేస్తాము. ప్రేమ వ్యవహారంలో దారి తప్ప డమే హత్యకు కారణంగా అనుమానం ఉంది. త్వరలో విశాఖ వ్యాప్తంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా -
భర్త వివాహేతర సంబంధం.. ఆత్మహత్య
అనంతపురం ,కళ్యాణదుర్గం: పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో వరలక్ష్మి (23) అనే వివాహిత కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి రామచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నార్పలకు చెందిన వరలక్ష్మికి రెండేళ్ల క్రితం కళ్యాణదుర్గానికి చెందిన శ్రీకాంత్‌తో వివాహమైంది. వీరికి సంతానం లేదు. భర్త మద్యానికి బానిసవడమే కాకుండా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త ఏమి మందలించాడో తెలియదు కానీ వరలక్ష్మి శనివారం రాత్రి ఇంటిలోని పైకప్పు కడ్డికీ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో భర్త ఇంటిలో లేడు. ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైదు కవితో కరచాలనం
ప్రధాని హత్యకు కుట్ర చేశారనే అర్థం పర్థం లేని ఆరోపణ కింద, నకిలీ ఉత్త రాలు సాక్ష్యాలుగా చూపి విప్లవ కవి వరవరరావును ఐదు నెలలుగా దుర్భరమైన పూణే జైల్లో నిర్బంధించారు. సెషన్స్ కోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా కలిసే అవకాశం ఉంటుందని తెలిసి వీవీని చూడ్డానికి తెలంగాణ నుండి 26 మంది రచయితలు, ప్రజాసంఘాల మిత్రులం వెళ్లాం. నిరీక్షణలో అరుణ్ ఫెరేరా సహచరి పరిచయమైంది. అరుణ్ ఇదివరకే సుమారు ఐదేళ్లు జైలు జీవితం గడిపాడు. జెన్నిఫర్ కొడుకుని తలచుకుంటూ తను మొదటిసారి అరెస్టయినప్పుడు వాడికి రెండేళ్లని, విడుదలయ్యాక వచ్చిన తండ్రిని వింతగా చూస్తుంటే మీ నాన్న అని పరిచయం చేయవలసి వచ్చిందని చెప్పింది. ఇప్పుడు పన్నెండేళ్లొచ్చి విషయాలు అర్థం అవుతున్నాయి గనుక నాన్నను మళ్లీ ఎప్పుడు చూస్తానని అడుగుతున్నాడట. చివరికి వీవీని చూడగలిగాం. నల్లబడిన శరీర రంగు, సన్నబడ్డ దేహం, కానీ అదే ఉత్సాహం. దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటే కళ్లను కప్పేస్తూ నీటిపొర. వీవీ ముఖంలో ఎన్నడూ లేనంతగా వృద్ధా ప్యం పైకి తేలింది. షోమాసేన్ బక్కచిక్కిపోయింది. చూపుడువేలితో అభినయిస్తూ చాలా సన్నబడ్డావని పరామర్శిస్తున్న మిత్రులకు ‘మంచిదేగా’ అని నవ్వుతూ సమాధానం చెప్తున్నారామె. సుధా భరద్వాజ్‌కు అభివాదం చేస్తుంటే విప్పారిన చిరునవ్వుతో ఆమె పలకరింపులు ప్రసన్నంగా ఉన్నాయి. బయట ఉంటే తీరిక లేకుండా ఉండే వీవీకి ఇక్కడి ఖాళీతనంతో పాటు ఉన్న భౌతిక స్థితి వల్ల, అననుకూల పరి సరాల్లో వయసు వల్ల తిరగబెట్టిన అనారోగ్యాల వల్ల చాలా అలసిపోయి కనిపిస్తున్నారు. ఇరుకు బెంచీలో ఆయన కోరికమీద పక్కన సర్దుకొని కూర్చున్నాను. అక్కడ సాయిబాబా, ఇక్కడ ఈయన? తనతో పాటు అదే బ్యారక్‌లో ఉంటున్న ఉరిశిక్షపడ్డ ఖైదీల గురించి, ముఖ్యంగా వారిలో కేవలం ముస్లింలుగా పుట్టినందువల్ల అల్‌ఖైదా ముద్ర వేయించుకున్న ఇద్దరని గురించి బాధపడుతున్న వీవీ, సాహిత్యం గురించి ముచ్చటిస్తూ తెలుగులో మాట్లాడక ఎన్నాళ్లయిందో అన్నప్పుడు తన స్థితిని ఆదివాసులతో పోల్చుకున్నారు. ఆదివాసుల భాష, సంస్కృతి, ఉనికి కూడా గల్లంతవుతున్నది కదా, అదింకెంత దుర్భరం అన్నారు. నోట్బుక్కులెన్నో కవిత్వం, అనువాదాలు, అనుభూతులతో నింపేసారు కానీ, తెలుగు కావడం వల్ల బైటికి పంపనివ్వడంలేదట. ఇంగ్లీషులో ఉత్తరాలు రాయగలిగినా, సహచరికి తెలియని ఇంగ్లీషు భాషలో రాయలేక మానేసానన్నారు. ఎనభైలలో జైలునుండి రాసిన ప్రేమలేఖల్లో సెన్సార్ అవుతున్న ప్రేమ గురించి బాధపడ్డ కవి, ఇప్పుడు ప్రేమను వ్యక్తీకరించే భాష కూడా చేతికందక విలవిల్లాడుతున్నాడా? అక్కడ నాగ్‌పూర్‌లో సాయిబాబాను కనీసం కుటుంబసభ్యులతో కూడా తెలుగు మాట్లాడనివ్వడం లేదని వసంత చెప్పింది. ప్రొఫెసర్ షోమాసేన్ ఆర్థరైటిస్ వల్ల కిందకూర్చోలేక, ఎన్నిసార్లు విన్నవించినా కుర్చీ ఇవ్వని జైలు కాఠిన్యంలో శరీరం కృశించిపోయే స్థితి. రిటైర్ అవ్వడానికి కొద్దిరోజుల ముందు ఈ కేసువల్ల నాగపూర్ యూనివర్సిటీ ఆమెను సస్పెండ్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని స్థితి. ప్రతిష్టాత్మక పీఎంఆర్‌డీ ఫెలోషిప్ సాధించిన చురుకైన పరిశోధక విద్యార్థి మహేశ్ రౌత్, తన చదువును, మనసును, ఆచరణను కూడా ఆదివాసులపై లగ్నం చేసినందుకు ఇక్కడ ఇలా వీళ్ల మధ్యకు వచ్చి చేరాడు. వీళ్ల బెయిల్ వినతిని తిరస్కరించమని ఆరోజు ప్రాసిక్యూషన్ చేసిన వాదనలో ఎల్గార్ పరిషత్ పేరు మీద దళితుల్ని సమీకరించడం అనే ‘నేరాన్ని’ గురించి పదేపదే ప్రస్తావించడం విన్నాం. వీవీని ఉద్దేశించి ‘బడా నేతా’ అంటున్నప్పుడు ఆయనకేసి చూస్తే నవ్వుతున్నారు. ఆయనే కాదు, ఆ తొమ్మిదిమందీ ఎవరిపేరు ప్రస్తావనకొచ్చినా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిరునవ్వులు చిందిçస్తున్నారో, అంతగా కసి, ద్వేషం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతులో వినిపించి ఆశ్చర్యపోయాం. ఆ రోజే విన్న కొత్త వింత వాదన, భీమా కోరేగావ్ అల్లర్లలో నిందితులుగా సంఘ్‌పరివార్ నాయకులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బొటేల పేర్లు డిఫెన్స్ వారు తెస్తున్నారని, వారికి అందులో ఏ ప్రమేయం లేకున్నా కేసు తప్పుదారి పట్టించడానికే ఇందులోకి లాగుతున్నారని చెప్పడం. నిజానికి భీమా కోరేగావ్ అల్లర్ల మీద మొదట దాఖ లైన ఎఫ్ఐఆర్ ఆ ఇద్దరి మీదే! వీడ్కోలు సమయంలో బిగిసిన పిడికిలి చూస్తున్నప్పుడే కాదు ఎప్పటికీ వీవీ చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ‘‘దళితులు ఆదివాసీల జీవితాలను, పోరాటాలను గురించి మాట్లాడే స్వేచ్ఛను మేం కోల్పోయాం. అది బాధాకరమేగానీ, మా గురించి మాట్లాడే స్నేహితులు ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతే ఆ మాత్రం స్వేచ్ఛ త్యాగం చేసిన తృప్తి మిగులుతుంది’’. వ్యాసకర్త విరసం కార్యవర్గ సభ్యురాలు ఈ–మెయిల్ : varalurwa@gmail.com పి.వరలక్ష్మి -
నా జీవితంలో ‘ఆమె’ ప్రత్యేకం: హీరో
చెన్నై: హీరోయిన్ వరలక్ష్మి తనకు దక్కిన భాండాగారం అని అన్నది ఎవరో తెలుసా? ఎస్.మీరు ఊహించింది కరక్టే. అలా అన్నది హీరో విశాల్‌నే. నడిగర్ సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడుగా బాధ్యతాయుతమైన పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మరో పక్క కథానాయకుడిగా, నిర్మాతగా విజయాల బాటలో పయనిస్త్ను స్టార్ విశాల్. తాజాగా అతడు నటించి నిర్మించిన ఇరుంబుతిరై తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. హీరో విశాల్, వరలక్ష్మి మధ్య ప్రేమ, పెళ్లి అంటూ చాలా రకాల ప్రచారమే జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా విశాల్, వరలక్ష్మి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటిది ఇటీవల మిస్టర్ చంద్రమౌళి చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఈ సంచలన జంట పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం ఈ కార్యక్రమంలో అందరినీ ఆకర్షించింది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విశాల్ ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన భేటీ చూద్దాం. ‘సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన నాలో నటుడిని చూసింది అర్జున్నే. ఆ తరువాతే చెల్లమే చిత్రంలో హీరోగా పరిచయం అయ్యాను. నేను సహాయ దర్శకుడిగా పని చేసినప్పుడు తీసుకున్న తొలి వేతనం కేవలం 100 రూపాయలే. హీరోగా పరిచయమైన తరువాత మొదట్లో కమర్శియల్ చిత్రాలు చేశాను. అదే బాటలో పయనించకూడదన్న ఆలోచనతోనే బాలా దర్శకత్వంలో అవన్ ఇవన్ చిత్రంలో నటించాను. ఆ చిత్రం నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగని పేరు కోసమే చిత్రాలు చేయకూడదని, వైవిధ్యభరిత కథా చిత్రాలను చేయడానికి ఆసక్తి చూపుతున్నాను. తదుపరి నవ దర్శకుడితో చిత్రం చేయనున్నాను. ఆ చిత్రం సమాజంలోని ఒక ముఖ్య సమస్య గురించి చర్చించేదిగా ఉంటుంది. నా జీవితంలో స్నేహితులకు ముఖ్య భాగం ఉంటుంది. మనలోని కొరతలను చెప్పేది వారే. అలా నాకు లభించిన పెద్ద భాండాగారం మిత్రులే. అలా వరలక్ష్మీ కూడా నాకు దక్కిన భాండాగారమే. తను నాకు 8 ఏళ్ల నుంచే తెలుసు. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. వరలక్ష్మీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఆమెలో ఆత్మవిశ్వాసం మెండు. నా తప్పులను ఎత్తి చూపి మార్గదర్శిగా ప్రోత్సహించిన ఆమె నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి, అత్యంత సన్నిహితురాలు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మంచి చెడు అంతా ఆమెతో పంచుకుంటాను. నా ప్రధాన లక్ష్యం దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణం.’ అని తెలిపాడు. -
ఉపాధి కోసం వెళ్లి..
పెదపట్నం (మామిడికుదురు): జీవనోపాధి కోసం బెహరైన్ వెళ్లిన పెదపట్నం అగ్రహారానికి చెందిన అవివాహిత బత్తుల వరలక్ష్మి(27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత ఏడాది డిసెంబర్ 18న వరలక్ష్మి మృతి చెందినా కుటుంబ సభ్యులకు ఈ సమాచారం మంగళవారం అందడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బెహరైన్‌లో పని చేస్తున్న విజయవాడకు చెందిన మహిళ ఫోన్ చేసి వరలక్ష్మి మరణ సమాచారాన్ని ఆమె కుటుంబం సభ్యులకు తెలిపింది. తమతో చివరి సారిగా డిసెంబర్ 8న ఫోన్లో మాట్లాడిందని తరువాత ఆమె నుంచి తమకు ఏవిధమైన సమాచారం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రాజోలు మండలం చింతలపల్లికి చెందిన ఏజంట్ గుబ్బల లక్ష్మి అలియాస్ బండారు లక్ష్మి ఆమెను బెహరైన్ తీసుకు వెళ్లిందని చెబుతున్నారు. వరలక్ష్మి నుంచి ఏవిధమైన సమాచారం లేకపోవడంతో ఏజెంట్‌ను సంప్రదించగా తమకు తప్పుడు సమాచారం చెబుతూ వచ్చిందని వాపోతున్నారు. వరలక్ష్మి మరణించిందన్న సమాచారం తెలిసిన తర్వాత ఆమెను నిలదీయగా వరలక్ష్మి మృతి చెందిందని ధ్రువీకరించిందన్నారు. వరలక్ష్మి తండ్రి సత్యనారాయణమూర్తి, తల్లి పెద్దిలక్ష్మి ఇద్దరూ కూలీలే. వీరికి ముగ్గురు కుమార్తెలు. కుటుంబ పోషణ భారాన్ని తనపై వేసుకున్న పెద్ద కుమార్తె వరలక్ష్మి గత ఏడాది ఏప్రిల్ 3న బెహరైన్ వెళ్లింది. ఆమె చెల్లెళ్లు శ్రీవాణి, శ్రీవేణి. వీరిలో శ్రీవేణికి గత ఏడాది జూలై 6న వివాహం జరిపించారు. తండ్రి సత్యనారాయణ మూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వరలక్ష్మి చనిపోయిందన్న సమాచారం తెలిసిన వెంటనే నేషనల్ వర్క్స్ వెల్ఫేర్ ట్రస్టు సభ్యుడు నల్లి శంకర్ ద్వారా ఇండియన్ ఎంబసీని సంప్రదించామని వరలక్ష్మి చిన్నాన్న బత్తుల అశోక్‌కుమార్ తెలిపారు. వరలక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇండియన్ ఎంబసీ ద్వారా దీనికి ప్రతిగా తమకు సమాచారం వచ్చిందని అశోక్‌కుమార్ చెప్పారు. బెహరైన్ పంపించేందుకు ఏజెంట్ రూ.రెండు లక్షలు తీసుకుందని, ఇంకా నగదు ఇవ్వాలని ఇబ్బంది పెడుతోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏజంట్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నాన్నకు ప్రేమతో...
నటుడు శరత్‌కుమార్ తొలిసంతానం నటి వరలక్ష్మి అన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య సఖ్యత లేదంటూ రకరకాల వదంతులు ప్రచారం అవుతుంటాయి. అవి నిజం కాదని నటుడు శరత్‌కుమార్, నటి వరలక్ష్మీ సమయం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం సాయంత్రం స్థానిక నందనంలోని ఫ్లక్స్ ఫిట్నెస్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలో నటుడు శరత్‌కుమార్‌తో పాటు పాల్గొన్న వరలక్ష్మీ తండ్రిని ప్రేమగా హత్తుకున్నారు. -
అప్పుడే నూరేళ్లు నిండాయి
వంట చేయబోయి బాలిక మృత్యువాత శరీరమంతా ఎగిసిన మంటలు శోకసంద్రంలో పాల్తూరు కష్టాన్నే నమ్ముకున్న ఆ దంపతులకు నలుగురు సంతానం. ఆస్తి పాస్తులు పెద్దగా లేవు.. బతకడానికి ఏ ఆధారంలేదు..కష్టమే వారి జీవనాధారం..కూలి పనికి పోతేనే పూట గడుస్తుంది. మొదటి సంతానంగా మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అమ్మానాన్న పనులకెళ్లినా .. ఇంటి పట్టున చెల్లెల్లు, తమ్ముడికి అక్కలా.. అమ్మలా అన్నీ తానై మెలిగేది. ఆడుతూ పాడుతూ ఆ ఇంట తిరిగే ఆ ఇంటి వరలక్ష్మిని చూసి విధి ఓర్చుకోలేకపోయింది. అమ్మలా అన్నం చేస్తుండగా .. అగ్ని ప్రమాదం రూపంలో ఆయువు తీసుకుంది. కళ్లముందు కనకమహాలక్ష్మిగా గెంతులేయాల్సిన ఆచిట్టితల్లికి అప్పుడే వందేళ్లు నిండాయన్న విషయం తెలిసి ఆదంపతులు గుండెలవిసేలా విలపించారు. ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన కట్టతిప్పన్నగారి లక్ష్మీ, చెన్నయ్య దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. శుక్రవారం ఉదయమే చెన్నయ్య పొలానికెళ్లాడు. అన్నం చేసిన తర్వాత లక్ష్మీ కూడా భర్తకు పొలం పనుల్లో తోడుగా ఉండేందుకు బయల్దేరింది. వెళుతూ వెళుతూ ‘పప్పు’ చేసి పెట్టి వెళ్లమ్మా అంటూ ఏడో తరగతి చదివే పెద్ద కుమార్తె వరలక్ష్మి (13)కి చెప్పింది. సరే అని ఆ అమ్మాయి కట్టెల పొయ్యి వెలిగించి పప్పు చేసేందుకు ఉపక్రమించింది. మిగతా ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో గోడపై పోపు సామాన్లు తీసుకుంటుండగా అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బా కిందకు పడింది. కొంత అమ్మాయి శరీరంపైకి, మరికొంత మండుతున్న పొయ్యిలోకి ఎగిసిపడింది. అంతే ఒక్క ఉదుటున అగ్నికీలలు వరలక్ష్మిని చుట్టుముట్టాయి. మంటలకు తాళలేక గట్టిగా కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు పొలంలోంచి పరుగులు తీసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. బాధ తట్టుకోలేక విలవిలలాడుతున్న కుమార్తెను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందింది. వరలక్ష్మి మృతితో పాల్తూరు శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మురళీ తెలిపారు. -
హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు
మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణల కేసు సృష్టించిన సంచలనం ఇంకా వీడిపోక ముందే మరో తమిళ నటి తనపై ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టి సంచలనం సృష్టించారు. తమిళంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, స్వయంగా హీరోయిన్ కూడా అయిన వరలక్ష్మి తనపై చోటుచేసుకున్న వేధింపుల విషయాన్ని వెల్లడించారు. తాను ఇటీవల ఒక టీవీ చానల్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రోగ్రాం హెడ్ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో అక్కడినుంచి బయటకు వచ్చేశానన్నారు. అతడు దారుణంగా మాట్లాడాడని, తనను వేధించాడని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిత్రసీమలో హీరోయిన్లపై కూడా వేధింపులు వెలుగు చూడటం దారుణంగా ఉందని తెలిపారు. ట్విట్టర్లో ఈ అంశంపై ఆమె ఒక భారీ లేఖ పోస్ట్ చేశారు. (వరలక్ష్మి లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి) అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందని, మహిళల భద్రత అనేది జోక్‌గా మారిపోయిందని ఆమె మండిపడ్డారు. ఈ వెధవలను ఉరి తీయాలన్నారు. మళయాళ నటికి మద్దతు పలుకుతున్నానని, వాళ్లకు శిక్ష పడి తీరుతుందని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ పెట్టిన సందర్భంలోనే ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఒక భారీ లేఖ రూపంలో ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని బయట పెట్టాలా వద్దా అని రెండు రోజులుగా మధనపడుతున్నానని, చివరకు చెప్పి తీరాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ రాస్తున్నానని అన్నారు. ఒక ప్రముఖ టీవీ చానల్ ప్రోగ్రామింగ్ హెడ్‌తో తాను సమావేశంలో పాల్గొన్నానని, ఒక అరగంట తర్వాత సమావేశం ముగుస్తోంది అనగా అతడు తనను ''మనం బయట ఎక్కడ కలుద్దాం'' అని అడిగాడని, ఏదైనా పని కోసమా అని తాను అడగ్గా.. కాదని, ఇతర విషయాల కోసమని అతగాడు అన్నట్లు ఆమె తెలిపారు. తాను కోపంగా అక్కడినుంచి వెళ్లిపోవాలని అతడికి చెప్పానన్నారు. సినిమా పరిశ్రమతో పాటు బయట కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని, పరిశ్రమలోకి తాను శరీరాన్ని అమ్ముకోడానికి రాలేదని, మహిళలపై జరుగుతున్న దోపిడీ ప్రమాణాలను పాటించడానికి కూడా రాలేదని చెప్పారు. తనకు నటన అంటే ఇష్టమని, ఇలాంటి అఘాయిత్యాలను అడ్డుకుని, వాటిపై బయటకు మాట్లాడాలన్నదే తన ఉద్దేశమని అన్నారు. పురుషులకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉందని, వాళ్లు మహిళలను అగౌరవపరచడం మానుకోవాలి లేదా బయటకు పోవాలని ఆవేశంగా ఆ లేఖలో వరలక్ష్మి రాశారు. తాను ఒక నటినని, వెండితెర మీద గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన తన గురించి ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదరదని స్పష్టం చేశారు. తన జీవితం, తన శరీరం తన ఇష్టమని, ఏ మగాడూ కూడా తనను అగౌరవంగా చూసి సులభంగా వెళ్లిపోతానని అనుకోకూడదని వరలక్ష్మి అన్నారు. ఇది చిన్న విషయమని, ఏమీ జరగలేదని అనుకునేవాళ్లు కూడా ఉంటారని, అయితే ఇది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ మాత్రమేనని తెలిపారు. అదృష్టవశాత్తు తాను సురక్షితంగా బయటపడ్డాను గానీ, దీనివల్ల చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడే అవకాశం తనకు లభించిందని తెలిపారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాక.. అన్ని రకాల పరిశ్రమలు, ఆర్థిక పరిస్థితులు, సంస్కృతులు, వయసులో కూడా ఇలాంటి వేధింపులు ఉంటున్నాయని, మనది పురుషాధిక్య సమాజం కావడంతో మహిళలను వస్తువులుగా చూస్తూ అసమానతలు పెంచుతున్నారని ఆవేశంగా చెప్పారు. మహిళల భద్రత అనేది కేవలం ఒక కలగా మిగిలిపోయిందని, మన సమాజం నుంచి 'రేప్' అనే పదం ఎప్పటికీ తొలగిపోదా అని ఆమె ప్రశ్నించారు. తాను మౌనంగా ఊరుకునేది లేదని, తన స్నేహితులు, చెల్లెళ్లు కూడా మౌనాన్ని వీడాలని తెలిపారు. మీరు ఒంటరి కారని.. తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. What the hell is going on??!!! #WomenSafety has become a joke.. hang those bloody b@st@rds.. strength to #bhavna ... they will be punished — varu sarathkumar (@varusarath) 19 February 2017 Needs to be said..!! pic.twitter.com/GjJimBIKd3 — varu sarathkumar (@varusarath) 20 February 2017 -
హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు
-
ఎడ్‌సెట్ కమిటీ సభ్యురాలిగా వరలక్ష్మి
కోవెలకుంట్ల: 2017 విద్యా సంవత్సర ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ కమిటీ సభ్యురాలిగా కోవెలకుంట్లకు చెందిన వరలక్ష్మి నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో కర్నూలు జిల్లా నుంచి స్థానిక శ్రీనివాస బీఎడ్ కళాశాల కరస్పాండెంట్‌కు కమిటీలో చోటు కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే ఎడ్‌సెట్‌ను ఆన్లైన్లో నిర్వహించాలని సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సౌకర్యార్థం తమ కళాశాలలో ఉచిత ఆన్లైన్ నమోదుకేంద్రం ఏర్పాటు చేసి, ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్‌బాషా, గౌరవ సలహాదారుడు నాగరాజు పాల్గొన్నారు. -
ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్?
అటు తమిళంలో, ఇటు తెలుగులో (డబ్బింగ్) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న కథానాయకుడు విశాల్. నటుడు శరత్‌కుమార్ కుమార్తెగానే కాకుండా హీరోయిన్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని గుసగుసలు వినిపించాయి. ‘‘తమిళ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం కడుతున్నాం. అది పూర్తి కాగానే అందులో జరిగే మొదటి పెళ్లి నాదే’ అని విశాల్ చెబుతూ వచ్చారు. ఆయన పెళ్లాడనున్నది వరలక్ష్మీనే అని చాలామంది ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ప్రేమ ఇటీవల పరిహాసంగా మారుతోంది. ఓ వ్యక్తి ఏడేళ్ల బంధాన్ని తేలిగ్గా వద్దనుకున్నాడు. అది కూడా తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయికి ఆ విషయం తెలియజేశాడు. ప్రపంచంలో ప్రేమ ఏమైపోతోందో? ఎక్కడుందో?’’ అంటూ ఆమె ఆవేదనగా ట్వీట్ చేశారు. విశాల్‌ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. విశాల్‌ను వరలక్ష్మి ప్రేమించడం ఆమె తండ్రి శరత్‌కుమార్‌కి నచ్చలేదని, పెళ్లికి ఆయన సమ్మతం వ్యక్తం చేయలేదని ఓ టాక్ ఉంది. దానికి తోడు నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్, శరత్‌కుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయి కూడా. ఒకవేళ విశాల్-వరలక్ష్మి బ్రేకప్ వెనక శరత్‌కుమార్ హస్తం ఉండి ఉంటుందేమోనన్నది కొందరి ఊహ. ఇంతకీ వరలక్ష్మి ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుక. -
భార్యను చంపి.. అడ్డొచ్చిన అత్తపై దాడి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో దారుణం చోటుచేసుకుంది. తన పుట్టింట్లో తల్లిదండ్రులతో ఉంటున్న భార్యను విచక్షణ లేకుండా కత్తితో అతి దారుణంగా నరికేశాడో భర్త. ఈ ఘటన కొవ్వూరు 19వ వార్డు దొగ్గువారివీధిలో గురువారం చోటుచేసుకుంది. తన భర్త పెట్టే వేధింపులను భరించలేని భార్య వరలక్ష్మీ కొవ్వూరులోని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త నర్సింహమూర్తి ఆమె పుట్టింటికి వెళ్లి ఆమెను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను కూడా గొంతుకోసుకున్నాడు. ఈ దాడిలో అత్త అచ్చాయమ్మ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని, అత్త అచ్చాయమ్మను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఐదు లక్షలతో అమ్మవారికి అలంకరణ
పాతపోస్టాఫీసు : పాతనగరం ఉడ్యార్డ్ వీధిలో వెలసిన శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయంలో శ్రావణ మాసం రెండో∙శుక్రవారం ఉచిత వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు నాలుగు విడతులుగా వ్రతాలలో పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు పుష్పార్చనతో పాటు లక్ష పుష్పార్చన, ఆలయ మండపంలో సామూహిక కుంకుమార్చనలతో పాటు శ్రీ లక్ష్మీ హోమం చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.5లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. -
ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
సూర్యాపేట మున్సిపాలిటీ శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంతో పాటు పలు దేవాలయాల్లో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణశర్మ ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సంతోషిమాతను ప్రత్యేక ఊయలలో పరుండబెట్టి పవళింపు సేవ నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మండ్లపల్లి మురళీధర్, దయాకర్, సురేష్, విద్యాసాగర్, పాపిరెడ్డి, శ్రీకాంత్, పురుషోత్తం, జగన్నాథశర్మ, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
మహిళ మెడలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్‌సిటీ: చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చైన్ స్నాచర్ల ఘటనలతో మహిళలు ఒంటరిగా బయటకు రావలంటేనే భయపడుతున్నారు. తాజాగా మేడిపల్లి పరిధిలోని పిర్జాదిగూడలో ఆదివారం మహిళ మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వరలక్ష్మి అనే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వరలక్ష్మికి మంచి రోజులొచ్చాయా?
కుట్రపరంపరై ఇద్దరు ప్రముఖ దర్శకుల మధ్య పోరుకు కారణమైన కథ ఇది. దీంతో చాలా ఏళ్లుగా మరుగున పడ్డ ఈ కథ ఇప్పుడు ఎనలేని ప్రచారాన్ని సంపాదించుకుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రాసిన ఈ కథతో తాజాగా ప్రయుఖ దర్శకుడు భారతీరాజా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. చిత్రాన్ని ఆయన ఇటీవలే ప్రారంభించారు కూడా. అదే పేరుతో దర్శకుడు బాలా చిత్రం తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఇందులో విశాల్, ఆర్య, అరవింద్‌సామి, అధర్వ, రానా, అనుష్క నటించనున్నట్లు ప్రకటించడంతో భారతీరాజా,బాలాల మధ్య వివాదం మొదలైంది. అయితే ఆరోపణలు, ప్రతి ఆరోపణలనంతరం బాలా తాను కుట్రపరంపరై కథను చిత్రంగా చేయడం లేదు,అదే కాల ఘట్టంలో జరిగిన వేరే సంఘటనలను చిత్రంగా ఆవిష్కరించనున్నట్లు స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇకపోతే బాలా తన చిత్ర నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అలాగే తన చిత్రంలో అదనంగా నటి వరలక్ష్మికి పాత్రను సృష్టించారన్నది తాజా సమాచారం. వరలక్ష్మి ఇంతకు ముందు బాలా దర్శకతంలో తారైతప్పట్టై చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆమె నటన బాలాను విపరీతంగా ఆకట్టుకుంది. ఫలితం తాజా చిత్రంలోనూ వరలక్ష్మికి అవకాశం కల్పించినట్లు తెలిసింది. ప్రపంచ సినిమానే ప్రశంసించే పాత్ర అని కోలీవుడ్‌లో ప్రచారం హల్చల్ చేస్తోంది. మరో విషయం ఏమిటంటే చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్‌కే పరిమితమైన విశాల్‌కు జంటగా ఈ బ్యూటీ నటించిన మదగజరాజా చిత్రానికి మోక్షం వచ్చింది. ఈ నెల 29న తెరపైకి రానుంది. మొత్తం మీద ఆలస్యంగా అయినా వరలక్ష్మికి మంచి రోజులు మొదలయ్యాయన్న మాట. -
మదగజరాజా వస్తోంది!
మదగజరాజా చిత్రానికి మోక్షం కలగనుందనేది కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. విశాల్, వరలక్ష్మి,అంజలి జంటగా నటించిన చిత్రం మదగజరాజా. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించింది.చిత్ర నిర్మాణం పూర్తయి చాలా కాలమైంది. ఒకసారి విడుదల తేదీ వెల్లడించి కూడా చిత్రం విడుదల కాలేదు. కారణం ఆర్థికపరమైన సమస్యలే. అంతే కాదు మరోసారి చిత్ర హీరో విశాల్‌నే మదగజరాజా విడుదలకు ప్రయత్నించి విఫలమవడం గమనార్హం. అప్పట్లో కొందరు బయ్యర్లు చిత్ర విడుదలకు సహకరించక పోవడమే అందుకు కారణం అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు మదగజరాజా చిత్రానికి మోక్షం కలిగిందని కోలీవుడ్ వర్గాల టాక్. విశాల్ నటించిన తాజా చిత్రం కథకళి మంచి సక్సెస్ సాధించడం, అదే విధంగా దర్శకుడు సుందర్.సీ తాజా చిత్రం అరణ్మణై-2 చిత్రం విజయం సాధించడం మదగజరాజా చిత్రానికి హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నట్లు సమాచారం. బయ్యర్లు కూడా అదే ఆలోచనతో ఉండడంతో మదగజరాజా చిత్రాన్ని మార్చి 11న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. పక్తు కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్రంపై అప్పటిలోనే మంచి అంచనాలు నెలకొన్నాయన్నది గమనార్హం. విశాల్ ప్రస్తుతం మరుదు అనే చిత్రంలో నటిస్తున్నారు. కథకళి చిత్రం తరువాత విడుదలయ్యే చిత్రం మరుదునేనని భావిస్తున్న ఆయన అభిమానులకు మధ్యలో మదగజరాజా రానుండడం ఆనందమే అవుతుంది. -
నా భార్య మోసం చేసింది
మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం సెల్ఫ్ వీడియోలో ‘మరణ వాంగ్మూలం’ రికార్డు గాంధీ ఆస్పత్రి : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసిందని, తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికి దారితీసిన పరిస్థితుల్ని తన సెల్ఫోన్లో సెల్ఫ్ వీడియో ద్వారా చిత్రీకరించాడు. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన డి.నాగేశ్వరరావు(28) కరాటే మాస్టర్. బామవరిది చెల్లెలైన బాపట్లకు చెందిన వరలక్షి్ష్మని ప్రేమించి గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నాడు. వరలక్షి్ష్మ హైదరాబాద్ చంచల్‌గూడలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. బన్సీలాల్‌పేటలో వీరి నివాసం. తెనాలిలోనే ఉంటున్న నాగేశ్వరరావు వారంలో రెండు రోజులు ఇక్కడికి వచ్చి వెళతాడు. కొద్దిరోజులగా వరలక్ష్మి ప్రవర్తనలో మార్పు గమనించిన నాగేశ్వరరావు... ఆమె ఓ వ్యక్తితో చాటింగ్ చేస్తుండగా చూసి మందలించాడు. ఆమెలో మార్పు లేకపోవడంతో విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లగా వారు కౌన్సెలింగ్ చేశారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో నాగేశ్వరరావు మంగళవారం బన్సీలాల్‌పేటలోని ఇంట్లో పురుగుల మందు తాగి నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న నాగేశ్వరరావును గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య తనను మోసం చేసి పదిమందిలో పరువు తీసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తమకు నాగేశ్వరరావు ఫోన్ చేసి చెప్పాడని అతడి తల్లి పాపమ్మ, సోదరి ఆదిలక్షి్ష్మ ఆస్పత్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. అదే విషయాన్ని తన వీడియోలో బందించాడు బాధితుడు. నాగేశ్వరరావు తండ్రి పోలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, తనను వెంటపడి పెళ్లి చేసుకున్న నాగేశ్వరరావు అనుమానంతో నిత్యం వేధించేవాడని వరలక్ష్మి చెప్పారు.