ఐదు లక్షలతో అమ్మవారికి అలంకరణ
ఐదు లక్షలతో అమ్మవారికి అలంకరణ
Published Fri, Aug 12 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
పాతపోస్టాఫీసు : పాతనగరం ఉడ్‌యార్డ్ వీధిలో వెలసిన శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయంలో శ్రావణ మాసం రెండో∙శుక్రవారం ఉచిత వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు నాలుగు విడతులుగా వ్రతాలలో పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు పుష్పార్చనతో పాటు లక్ష పుష్పార్చన, ఆలయ మండపంలో సామూహిక కుంకుమార్చనలతో పాటు శ్రీ లక్ష్మీ హోమం చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.5లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు.
Advertisement
Advertisement