decorated
-
ప్రభుత్వ కార్యాలయాల ముస్తాబు
మహబూబ్‌నగర్ క్రైం / మహబూబ్‌నగర్ న్యూటౌన్ : స్వాతంత్య్ర దినోత్సవానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. ఈ పాటికే కలెక్టరేట్, జెడ్పీ, ఎస్పీ కార్యాలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. శనివారం రాత్రి వాటిని విద్యుద్దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. సోమవారం జరిగే వేడుకలకు జిల్లా పరేడ్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఇందులోభాగంగా జిల్లా పోలీస్ అధికారులు కవాతు సాధన చేశారు. ఇక్కడ జరిగే కార్యక్రమానికి జిల్లా మంత్రి జూపల్లి కష్ణారావు, కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్నారు. -
ఐదు లక్షలతో అమ్మవారికి అలంకరణ
పాతపోస్టాఫీసు : పాతనగరం ఉడ్యార్డ్ వీధిలో వెలసిన శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయంలో శ్రావణ మాసం రెండో∙శుక్రవారం ఉచిత వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు నాలుగు విడతులుగా వ్రతాలలో పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు పుష్పార్చనతో పాటు లక్ష పుష్పార్చన, ఆలయ మండపంలో సామూహిక కుంకుమార్చనలతో పాటు శ్రీ లక్ష్మీ హోమం చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.5లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. -
ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీ
విజయవాడ: విద్యుత్ వెలుగుల్లో కృష్ణమ్మ అందాలు ద్విగుణీకృతమయ్యాయి. కరెంట్ కాంతుల్లో 'పుష్కర కృష్ణా' సప్తవర్ణ శోభితంగా కనువిందు చేస్తోంది. వివిధ వర్ణాల్లో మెరిసిపోతూ హోయలు పోతున్న కృష్ణమ్మ అందాలను చూసి జనం మంత్రముగ్దులవుతున్నారు. ఈ నెల 12 నుంచి జరగనున్న కృష్ణా నది పురస్కరించుకుని విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో నయనానందకరంగా మెరిసిపోతున్న కృష్ణమ్మ అందాలను 'సాక్షి' కెమెరా క్లిక్ మనిపించింది. కరెంట్ దీపాల కాంతిలో ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీని, కృష్ణా నది నీటి ప్రవాహం చూసే వారికి కనువిందు చేస్తోంది. మరోవైపు ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా నది పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. -
కోటి రూపాయలతో అమ్మవారి అలంకారం
పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆదివారం సరస్వతీ, ధనలక్ష్మీ అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కోటీ పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలతో ధనలక్ష్మీ అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహాకులు భద్రతా ఏర్పాట్లను భారీగా పెంచారు. -
ప్రూట్స్‌తో విభిన్నంగా గణపయ్య అలంకరణ
-
70ల ఫ్యాషన్...ఆపాత అందాలు...
ముస్తాబు ప్రపంచం ఎంతో ముందుకు వెళుతోంది అనుకున్నప్పుడల్లా ఫ్యాషన్ ఒక్కసారి ‘కమ్ బ్యాక్’ అంటూ రీల్‌ని వెనక్కి తిప్పి చూపిస్తుంది. సంప్రదాయాన్ని, ఆధునికతను వేళవించి కాంటెంపరరీ దుస్తులను క్రియేట్ చేస్తుంది. లేటెస్ట్గా, లవబుల్‌గా 1970ల కాలం నాటి ఫ్యాషన్‌ని ఈ చలికాలానికి సరికొత్తగా కళ్లముందుంచుతోంది ఫ్యాషన్ ప్రపంచం. ఇప్పుడంతా 70ల కాలం నాటి దుస్తులు కనువిందు చేయబోతున్నాయి. నిజం! అతివలు ఆధునికతకు బ్రేక్ ఇచ్చి పాత కాలాన్ని లాక్కొచ్చి మరీ ముందు నిలుపుతున్నారు. ఎందుకంటే కాలం ఇప్పుడు ‘రెట్రో (అనుకరణ) స్టైల్’ వెంబడి పరుగులు తీస్తోంది. వేషధారణల్లో కాస్త ఫన్ ఉండేలా, జియోమెట్రికల్ ప్రింట్స్ అబ్బురపరిచేలా డ్రెస్ డిజైనర్స్ వీటిని మరింత అందంగా కళ్ల ముందు నిలుపుతున్నారు. ‘బాంబర్ జాకెట్స్, ప్లీటెడ్ స్కర్ట్స్, క్రాప్ టాప్స్పైన నాడు పువ్వులు, లతల హవా నడిస్తే నేడు జియోమెట్రికల్ ప్రింట్లు సందడి చేస్తున్నాయి’ అంటున్నారు ముంబై ఫ్యాషన్ డిజైనర్ అనితా డొంగ్రే. ఇటీవల ఇండియన్ లాక్మె ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న అనితాడోంగ్రే, పూర్వి దోషి, పరిణీతా సలూజ ఫ్యాషన్ ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులను తెలియజేస్తూ జియోమెట్రికల్ లైన్స్ 2014 వింటర్‌ని ఓ కొత్త కళతో చూపనున్నాయ’ని తెలిపారు. ఈ సందర్భంగా డెబ్భైల నాటి కాలపు స్టైల్స్ హైలైట్స్ జాబితాను వీరు విడుదల చేశారు. ఫన్‌గా, అందంగా..! ‘ఫ్యాషన్ ఎప్పుడూ ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒక ప్పుడు అకస్మాత్తుగా వెనకటి కాలమే మన ముందు నిలబడకమానదు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది. అలనాటి స్టైల్ ఇప్పుడు కొత్తగా, మరింత ఫన్‌గా, మరింత అందంగా రూపుకడుతుంది. ప్రస్తుతం కనువిందు చేస్తున్న ఈ స్టైల్స్ నాటి ట్రెండ్‌కు కొనసాగింపు’ అంటూ ఫ్యాషన్ డిజైనర్ పరిణీతా సలూజా వివరించారు. అంతేకాదు ఇప్పటి ట్రెండ్ ఇదేనంటున్నారు పరిణీత! నాడు, నేడు మేళవింపు... ‘ఫ్యాషన్‌లో ఎన్ని పోకడలు వచ్చినా రెట్రో వైపు దృష్టి ఎప్పుడూ వెళుతూనే ఉంటుంది’ అని తెలిపారు హైదరాబాద్ లఖోటియా ఫ్యాషన్ ఇన్స్ట్యూట్ డిజైనర్ అయేషా! అయితే 70ల కాలం నాటి డ్రెస్సులు, పూర్తి కాపీ అనడానికి వీల్లేదు అంటారీమె! ‘గుడ్డిగా వాటిని అనురించాలనీ లేదు. పాత కథకు కొత్త ముగింపు ఇచ్చినట్టుగా నాటి వేషధారణలోనే సరికొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చు’ అంటూ కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ‘లూప్ స్లీవ్‌లెస్’ 70ల కాలంలోనూ ఉన్నాయి. కానీ, దీంట్లోనే కొన్ని స్టైలిష్ కట్స్‌తో ఇప్పుడు పూర్తి కొత్తదనాన్ని తీసుకురావచ్చు’అని వివరించారు. బెల్ బాటమ్స్ నాటి గొప్ప ట్రెండ్. ఇప్పుడు ఇవే కొద్ది పాటి మార్పులతో పలాజో ప్యాంట్స్గా అలరిస్తున్నాయి. వాటికి ఫిటెడ్ షర్ట్స్, హిప్పీ షర్ట్స్ జత చేస్తే.. మగువలు, మగవారూ హ్యాపీగా ధరింవచ్చు’ అంటూ తెలిపారు ఆమె. పలాజో ప్యాంట్స్ చూస్తే అప్పటి స్టైలిస్ట్ ఐకాన్స్‌గా పేరొందిన ఫరా, జీనత్ అమన్‌లు గుర్తుకువస్తారు. వారు అప్పట్లో వేషధారణలో కొత్త పోకడలు సృష్టించి, స్టైలిస్ట్లుగా పేరొందారు. ఇప్పుడూ వారినే అనుసరించడానికి కారణం ఈ లుక్ ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండటమే! పలాజో ప్యాంట్స్... ఫ్యాషన్ డిజైనర్ పూర్వి దోషి మాట్లాడుతూ- ‘నాటి, నేటి స్టైల్స్‌ను సూచించే పలాజో ప్యాంట్స్ జంప్సూట్స్కి ఒక దారి చూపాయి. జంప్‌సూట్‌లో బాటమ్ (ప్యాంట్ అడుగు భాగాన) కొద్దిగా విచ్చు కున్నట్టు ఫ్లెయిర్గా ఉండటంతో బెల్బాటమ్ను తలపిస్తుంది. దీని పైన న్యారో కట్ ట్రౌజర్ ధరిస్తే ఆధునికంగా కనిపిస్తారు. ఇది యువతల శరీరసౌష్టవానికి చక్కగా సరిపోయే ఎంపిక’ అని తెలిపారు ఆమె. రంగులు, ప్రింట్లు... డెబ్భైల కాలమంతా రంగు రంగుల పువ్వుల ప్రింట్లు, మరీ కొట్టొచ్చినట్టు కన బడే ఎరుపు, గులాబీ.. మొదలైన కాంతిమంతమైన రంగులతో ఉండేవి. ‘అందుకే నాటి నేటి సమ్మేళనమైన కట్స్, కాంతిమంతమైన రంగులు, ప్రస్తుత పువ్వుల ప్రింట్లు.. ఇవన్నీ కలుపుతూనే 70ల నాటి కథనాన్ని ఇప్పుడూ సరికొత్తగా చూపించవచ్చు’ అంటారు అయేషా! అయితే రెట్రో లుక్‌తో అలరించాలంటే దుస్తులే కాదు వాటికి తగిన ఆభరణాలను, ఇతర ఆలంకారాలన్నీ సరిపోలాలి అని కూడా సూచిస్తున్నారు ఈ డిజైనర్లు. తలకట్టు, తలకు వాడే క్లిప్పులు, రబ్బర్‌బ్యాండ్లు, బ్యాగులు, బెల్టులు, చెప్పులు... వంటివన్నీ కూడా 70ల కాలం నాటి స్టైల్‌ను పోలినవాటినే ఎంచుకోవాలి’ అని చెబుతున్నారు. డిజైనర్ల సూచనలు తీసుకుంటూ నాటి అలంకరణతో ఈ వింటర్‌ని సరికొత్తగా ఎంజాయ్ చేయడానికి సిద్ధమవండి. - నిర్మలారెడ్డి -
నేడు ఏయూ స్నాతకోత్సవం
ఏర్పాట్లు పూర్తి వెబ్సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏయూ క్యాంపస్: ఆంధ్రా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేదికను విద్యుత్ కాంతుల వెలుగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సోమవారం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు రెండు గంటల పాటు ఈ వేడుక సాగనుంది. వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఏర్పాట్లను ఆదివారం స్వయంగా పరిశీలించారు. వేదికకు ఇరువైపులా అందరికి కనిపించే విధంగా రెండు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అతిథుల ఆగమనం, సభావేదికపై సిటింగ్, డాక్టరేట్ తీసుకునే వారి సిటింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు పి.ఎస్.అవధాని, సి.వి.రామన్, డి.సూర్యప్రకాశరావు, బి.గంగారావు, కె.గాయత్రి దేవి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవాన్ని www.youtube.com/users/andhrauniversitylive, www.andhrauniversity.edu.in, www.aucoe.infoవెబ్సైట్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథిగా రాఘవన్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కార్యాలయం సాంకేతిక కార్యదర్శిగా సేవలందిస్తున్న ఆచార్య ఎస్.వి.రాఘవన్ హాజరుకానున్నారు. ఆయనకు వర్సిటీ తరఫున డాక్టర్ ఆఫ్ సైన్స్(డీ.ఎస్సీ)ను ప్రధానం చేస్తారు. ఆయన స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. ఆయన మద్రాసు ఐఐటీ ఆచార్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యునిగా, నేషనల్ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ ఆర్కిటెక్‌గా పనిచేస్తున్నారు. -
విశాఖలో కరెన్సీ గణపతి
-
గోరింటా పూసిందీ...
మతాలకు అతీతమైనది. వయసు తేడా లేనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మగువ మనసుకు ముచ్చట కలిగించేది... గోరింట. ఈ మాసం ఆషాఢం. ఓ వైపు రంజాన్, మరో వైపు తెలుగు పండగలు వరసగా వస్తున్నాయి. అతివ చేతుల్లో గోరింట మందారంలా పూసి, మెరిసి, మురిసిపోయే రోజులే ఇక ముందన్నీ... అందుకే ఎర్రన్ని గోరింట ముస్తాబు... ఈ వారం... గోరింట చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, కావలసిన ఆకారంలో చేతులకు పెట్టి, రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే చేతులు ఎరుపు రంగులోకి మారతాయి. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. చర్మసంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజెన్లైన్నో సృష్టించారు సృజనకారులు. వీటిని మగువలతో పాటు మగవారూ తమ భుజాలు, వీపు, ఛాతీ భాగాలలో టాటూగా వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. తెలుగింటి పల్లెపడుచు చేతుల్లో నిండుగా... క్రిస్టియన్ పెళ్లి వేడుకలలో కాంతిమంతంగా... ముస్లిమ్ మగువ ముంజేతులలో ఆకర్షణీయంగా.. గోరింట రూపురేఖలు మార్చుకొని మెహెందీ డిజైన్లుగా ఆకట్టుకుంటోంది. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్,.. ఏ మతమైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. ప్రపంచం మొత్తమ్మీద గోరింటతో శారీరక అలంకరణలో రకరకాల ప్రయోగాలు చేసేది ఇండియా, అరబ్ దేశాలు మాత్రమే. అదృష్టానికి, ఆరోగ్యానికి ప్రతీకగా అరబ్దేశాలలో ఐదు వేల ఏళ్ల క్రితమే గోరింటను వాడినట్టు, హెన్నా పదం అక్కడి నుంచే వచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్టు ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని, మంచి ఆలోచనలు వస్తాయని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకునేవారు. వీటివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు మెరుగవుతుందని భావించేవారు. ఇప్పటికీ మన దేశ గ్రామీణ ప్రాంతాలలో ఈ నమ్మకం ఉంది. ఈజిప్ట్ ‘మమ్మీ’ల జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకును వాడేవారని ఒక వివాదాస్పద వార్త కూడా ఉంది. క్రీ.పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిప్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని, అప్పటి నుంచి అతివల చేతులు, పాదాలపై గోరింట ఎర్రగా పూయడం మొదలుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చారిత్రకపరంగా చూస్తే మనుషులకు గోరింటాకు ఔషధంగా... వస్త్రం, లెదర్, కేశాలు రంగు మారడానికి ‘డై’గా వాడేవారని తెలుస్తోంది. ఉత్తరాదిన కడ్వాచౌత్, దీపావళి, దక్షిణాదిన అట్లతద్ది వంటి పండగలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తోంది. ఉత్తరభారత వివాహ సంప్రదాయం ఇటీవల దక్షిణాదినీ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుతున్నారు. బాలీవుడ్ సినిమాలలో ‘మెహెందీ వేడుక’ ఒక ప్రధానాంశం. ఈ సినిమాల వల్ల నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులలో వివాహవేడుకల సమయాలలో అలంకరణలో భాగంగా మెహెందీ ప్రథమస్థానంలో నిలిచింది. ఆ విధంగా 1990 నుంచి మెహెందీ అలంకరణలలో నూతన పోకడలు వచ్చి చేరాయి. నాటి నుంచి ఈ డిజైన్లను ‘హెన్నా టాటూస్’గా పిలవడం ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు హెన్నా డిజైన్స్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ డిజైన్లని ముస్లిమ్ మహిళలు అలవోకగా వేయడం అక్కడి నుంచే మొదలైంది. వేదాలలో గోరింటరంగును సూర్యునికి ప్రతీకగా చె ప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. మనిషి లోపల ఉన్న జ్ఞాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు. డిజైన్లలో వైవిధ్యం ఇటీవల కాలంలో బ్రైడల్, ఇండియన్, అరబిక్... మెహెందీ డిజైన్లు పోటీ పడుతున్నాయి. వీటిలోనే షేడెడ్, ఫ్లోరల్, మోటిఫ్స్... ఇలా తీర్చిన డిజైన్లలో రంగురంగుల రాళ్లు, పూసలు, గ్లిట్టర్ (మెరుపుతో ఉండే పచ్చని రంగు)ను కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు నేరుగా అచ్చులతో రంగు డిజైన్లను నిమిషాలలో ఒంటి మీద ముద్రించుకుంటున్నారు. ఇంకొందరు ప్లాస్టిక్ డిజైన్ల్లో వచ్చిన స్టిక్కర్స్నీ అతికించుకుంటున్నారు. జీవనశైలి వేగవంతంగా మారుతుండటంతో ఈ డిజైన్లలోనూ ఆధునిక పోకడలు వేగం పుంజుకుంటున్నాయి. మెహెందీ.. ఇలా మేలు.. మెహెందీ కోన్లు మార్కెట్లో విస్తృతంగా లభిస్తున్నాయి. వీటితో డిజైన్ వేసుకోవడానికి ముందు ఆ మెహెందీ మన చర్మానికి సరి పడుతుందా లేదా అనేది పరీక్షించుకోవడం తప్పనిసరి. చెవి వెనుక భాగంలో (చెవి వెనుక భాగం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని ఏ రియాక్షన్ అయినా త్వరగా తెలిసిపోతుంది) లేదా మోచేతి దగ్గర మెహెందీ రాసుకొని, 3-4 రోజుల తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదంటే అప్పుడు డిజైన్ వేయించుకోవడం ఉత్తమం. మరీ ముఖ్యంగా బ్లాక్ మెహెందీలో ఎక్కువ అలెర్జీ కారకాలు ఉంటున్నాయి. డిజైన్ నల్లగా రావడానికి వీటిలో హానికారక రసాయనాలు కలుపుతున్నారు. మెరుపులు వచ్చే గ్లిట్టర్ తరహా మెహెందీలు సైతం చర్మానికి పడక చాలా మంది ప్రమాదకరమైన స్థితిలో ఆసుపత్రికి వస్తుంటారు. ముఖంతో పాటు గాలి పీల్చుకునే శ్వాసవాహిక కూడా ఉబ్బి పోతుంది. చేతులు, పాదాలపై మెహెందీ డిజైన్ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోయి, పొక్కులు, చీము కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును ఉపయోగించడాన్నే ప్రోత్సహించాలి. - శైలజ సూరపనేని, కాస్మటిక్ డెర్మటాలజిస్ట్ - నిర్మలారెడ్డి -
ఆషాఢ లక్ష్ములు...
ముస్తాబు ఆషాఢంలో గోరింట పూసిన చేతులతో ఆదిలక్ష్ములు... శ్రావణంలో సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్ములు... మాసమేదైనా... వేడుకేదైనా... అమ్మాయిల ఛాయిస్ లంగా, ఓణీ అయితే ఐశ్వర్యం ఆ ఇంట కొలువుదీరుతుంది. అమ్మానాన్నలకు కనులపండుగవుతుంది. నేటి తరం అమ్మాయిలు ముస్తాబుకు ఇష్టపడి ఎంచుకునే ముచ్చటైన లంగా, ఓణీల కాంబినేషన్ మీ కోసం... 1- నీలాకాశం రంగు నెట్ లెహంగాకు ఎరుపురంగు బెనారస్ చున్నీని జత చేరిస్తే ఏ పండగైనా నట్టింటికి నడిచొచ్చేస్తుంది. మిర్రర్ వర్క్ ఉన్న లెహంగా బార్డర్, బెనారస్ బ్లౌజ్ అదనపు ప్రత్యేకతలు. 2- హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సియాన్ గ్రీన్ రా సిల్క్ లెహంగాను మరింత ఆకర్షణీయంగా మార్చివేసింది బెనారస్ చున్నీ. కుందన్ వర్క్ చేసిన ఆఫ్‌వైట్ రా సిల్క్ బ్లౌజ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. 3- కనకాంబరం రంగు లెహెంగాకు రాయల్ బ్లూ చున్నీ జతకడితే పండిన గోరింటాకు ఎర్రదనం చెక్కిళ్లలో పూస్తుంది. సీక్వెన్స్ చమ్కీ వర్క్ బార్డర్ జత చేసిన లెహంగా స్టోన్ వర్క్‌తో మెరిసిపోతుంటే, కుందన్వర్క్ బ్లౌజ్ ప్రత్యేక శోభను తీసుకువస్తుంది. 4- మిర్రర్ వర్క్ చేసిన షిమా జార్జెట్ మెటీరియల్‌ను లెహంగాగా మార్చి, అద్దాలతో కట్ వర్క్ చున్నీని మెరిపిస్తే పట్టపగలే తారలు దిగివచ్చినట్టుగా అనిపించకమానదు. 5- పీచ్ కలర్ నెట్ లెహంగా, మింట్ గ్రీన్ చున్నీ, ఫుల్ స్లీవ్స్ నెట్ బ్లౌజ్.. పైనంతా స్వీక్వెన్స్ వర్క్‌తో రూపుకడితే రాత్రి దీపకాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోవచ్చు. డిజైనర్ టిప్స్: కుందన్స్, స్టోన్స్, చమ్కీ, మిర్రర్లతో చేసిన వర్క్‌లు పాడైపోకుండా ఉండాలంటే లెహంగాలను దగ్గరికి మడతపెట్టకూడదు. ఎంబ్రాయిడరీ గల లెహంగాలేవైనా హ్యాంగర్‌కి వేలాడదీయాలి. ఏ లెహంగా అయినా శుభ్రపరచాలంటే మైల్డ్ షాంపూతో లేదంటే డ్రై వాష్ చేయించడం ఉత్తమం. మిర్రర్ వర్క్, స్వీక్వెన్స్ వర్క్ గల లెహెంగాలు రాత్రి వేడుకలకు బ్రైట్‌గా కనిపిస్తాయి. సంప్రదాయ వేడుకలకు కేశాలంకరణగా జడ, కాంబినేషన్ ఆభరణాలు బాగా నప్పుతాయి. బర్త్‌డే, రిసెప్షన్ వంటి ఈవెనింగ్ వేడుకలకు కట్ వర్క్ చున్నీలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, వదులుగా ఉండే కేశాలంకరణ బాగా నప్పుతాయి. కర్టెసీ: శశి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్ www.mugdha410@gmail.com -
సంజె కాంతుల్లో...సౌందర్య రాగం!
ముస్తాబు వేసవి సాయంత్రాలలో మల్లెల గుబాళింపులే కాదు వేడుకల వాతావరణమూ ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చిన్నాపెద్దా గెట్ టు గెదర్లు, పాశ్చాత్యశైలి పార్టీలు ఇప్పుడు మన సంస్కృతిలో భాగమైపోవడంతో పార్టీకి తగ్గ వేషధారణ కూడా ముఖ్యమైంది. కొత్త కొత్త ఫ్యాషన్ల కోసం వెతుకులాట సాధారణమైంది.కొంచెం పాశ్చాత్యం... ఇంకొంచెం సంప్రదాయం... రెండింటి మేళవింపును ఇష్టపడే యువతరం కోరుకునే దుస్తుల పరిచయమే ఈ ముస్తాబు. 1- ఎరుపు, పువ్వుల కాంబినేషన్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పొడవాటి గౌన్ బర్త్ డే, వీకెండ్ పార్టీలలో అదుర్స్ అనిపిస్తుంది. కింద పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్ మెటీరియల్‌ను ఉపయోగించారు. నడుము, పై భాగాన్ని కలుపుతూ కర్దానా బెల్ట్‌ను ఉపయోగించారు. పైన వి నెక్ ఉన్న బ్లౌజ్‌కు ఎరుపు రంగు షిఫాన్ ఫ్యాబ్రిక్‌ను వాడారు. 2- వారాంతపు పార్టీలో చూపులను కట్టిపడేసే పొడవాటి గౌన్ ఇది. స్కర్ట్ భాగానికి షిఫాన్ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ భాగానికి బ్లాక్ వెల్వెట్ వాడారు. నడుము భాగాన్ని చుట్టి ఉన్న బెల్ట్‌పై శాటిన్ రిబ్బన్‌తో వర్క్ చేశారు. 3- సాయంకాలం పార్టీని ఆహ్లాదపరిచే రంగుల కలబోత ఈ లాంగ్ గౌన్ ప్రత్యేకత. జైపూర్ ప్రింట్ ఉన్న ఇక్కత్ సిల్క్, పైన ప్లెయిన్ షిఫాన్కు క్రాస్ షేప్ తీసుకువచ్చారు. బ్లౌజ్ పార్ట్‌కు ఇక్కత్ సిల్క్ వాడారు. స్కర్ట్ భాగంలో వాడిన ప్రింటెడ్ క్లాత్‌తో ఫ్లవర్‌ను తీర్చిదిద్ది, భుజం దగ్గర బ్రోచ్లా అమర్చారు. 4- మయూరాన్ని తలపించే నీలం రంగు పొడవాటి గౌన్ పార్టీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. తెల్లటి షిఫాన్ క్లాత్‌కు డై చేయించి, పీకాక్ కలర్ తెప్పించారు. బ్లౌజ్ భాగాన్ని రాసిల్క్ చెక్స్ మెటీరియల్‌తో డిజైన్‌చేశారు. సైడ్స్ పర్పుల్ ఫ్యాబ్రిక్వాడారు. 5- తెల్లటి పొడవైన ఈ గౌను సాయంకాలపు పుట్టిన రోజు, పెళ్లిరోజు పార్టీలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. క్రింది భాగానికి మూడు లేయర్లుగా తెల్లని నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన హై కాలర్ నెటెడ్ బ్లౌజ్‌కి క్యాప్ స్లీవ్స్ ఇచ్చి యాంటిక్ బీడ్స్, వైట్ గోల్డ్, రాక్ గోల్డ్ సీక్వెన్స్‌తో మొత్తం ఫ్లోరల్ డిజైన్ చేశారు. 6- సాయంకాలం సంగీత్, మెహెందీ, రిసెప్షన్ వంటి సంప్రదాయ వేడుకలకు ఈ ఎర్రటి పొడవాటి గౌన్ ఎందరిలో ఉన్నా ఇట్టే ఆకట్టుకుంటుంది. క్రింది భాగాన్ని మూడు లేయర్లుగా ఎక్రటి నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన బ్రొకేడ్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్, బోట్ నెక్ ఇచ్చి, కుడి భుజం పైన జర్దోసి వర్క్, గ్రీన్ స్టోన్స్‌తో మెరిపించారు. నడుము భాగంలో ఎరుపురంగు సిల్క్ మెటీరియల్‌తో చేసిన బెల్ట్‌ను జత చేశారు. పార్టీలో గ్రాండ్‌గా..: పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు మేకప్ మరీ ఎక్కువ కాకూడదు. మేకప్ కనిపించీ కనిపించనట్టు ఉండాలి కేశాలంకరణ సంగతికొస్తే - హై పోనీతో కానీ, జుట్టు పూర్తిగా వదిలేయడం కానీ చేయాలి. సమకాలీన లుక్ ఉండేలా చూసుకోవాలి గౌన్లు వేసుకున్నప్పుడు హై హీల్స్, శాండల్స్ బాగా నప్పుతాయి డ్రెస్‌కు సంబంధం లేనట్టు కాకుండా యాక్ససరీస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి హ్యాండ్‌బ్యాగ్ బదులు క్లచ్ లాంటివి పట్టుకుంటే లుక్ బాగుంటుంది. కర్టెసి: భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ www.bar9999@gmail.com -
సూర్య, చంద్రులపై వెంకన్న విహారం
నారాయణవనం, న్యూస్‌లైన్ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆదివారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. వేకువజామున 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యకట్ల, శుద్ధి, గంట తదితర కార్యక్రమాలను అర్చకులు పూర్తి చేశారు. 8.30 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవంలో పాల్గొని భక్తుల నుంచి హారతులు అందుకున్నారు. ఆలయానికి చేరుకున్న స్వామికి ఉభయ నాంచారులతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం కైంకర్యాల అనంతరం ఊంజల్ సేవ చేశారు. రాత్రి 8 గంటల కు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి బాలనరసింహరావు, సహాయకులు వీరయ్య, షరాబులు మణి, గోవిందస్వామి పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు స్వామికి ఏకాంత సేవ నిర్వహించారు. నేడు వెంకన్న రథోత్సవం పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య తెలిపారు. ఉదయం 7.20 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారికి 40 అడుగుల చెక్క రథాన్ని ముస్తాబు చేశారు. వివిధ రకాల దేవతా ప్రతిమలు, రంగుల వస్త్రాలు, పుష్ప హారాలతో సుందరంగా అలంకరించారు. ఆదివారం ఉదయం ఆలయంలో రథ కలశానికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో రూ.500 చెల్లించి దంపతులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
అచ్చు బొమ్మలు
అమ్మాయిలను ‘అచ్చు బొమ్మ’లా ఉన్నావంటూ... రకరకాల పోలికలు చెబుతుంటారు.చీరలపై ‘అచ్చు’తో అందమైన బొమ్మలు వేస్తే... చూపరులు సైతం బొమ్మల్లా ఉండిపోవాల్సిందే! ఆ చీరలను కట్టుకున్న అతివలు... కుందనపుబొమ్మల్లా మెరిసిపోవాల్సిందే!హ్యాండ్లూమ్, సిల్క్, పట్టు... మెటీరియల్ ఏదైనా...వేసే డిజైన్‌లో సృజన ఉంటే బామ్మనైనా భామనైనా ‘అచ్చు’ చీరలే ఆకట్టుకుంటాయి. కుచ్చిళ్ల భాగంలో మల్టీకలర్ ఇక్కత్, ఓణీ భాగంలో పసుపురంగు కోటా, అంచుగా బ్లాక్ సీక్వెన్స్ మెటీరియల్‌ను జత చేశారు. దీంతో అటు సంప్రదాయం, ఇటు ఆధునికతల సమ్మేళనంతో చీర ఆకర్షణీయంగా మారింది. ఓణీ భాగంలో జత చేసిన వస్త్రానికి పసుపు రంగును అద్ది,పువ్వులను ‘అచ్చు’గా వేశారు. ఆకుపచ్చ, వంగపండు రంగుల కలయికతో రూపుదిద్దుకున్న హ్యాండ్లూమ్ శారీ ఇది. టెంపుల్ డిజైన్ వచ్చిన బార్డర్ పైన అద్దిన ఆకుపచ్చని ‘అచ్చు’తో ఈ చీర మరింత గ్రాండ్‌గా మారింది. సాదా క్రీమ్ కలర్ టస్సర్ సిల్క్ చీరపై కేరళ మురుగ ఆర్ట్ కనువిందు చేస్తోంది. పెన్ కలంకారి డిజైన్ అనిపించేలా ‘అచ్చు’ వేసి, ఈ డిజైన్‌ను శోభాయమానంగా రూపుకట్టారు. నలుపు, ఎరుపు మేళవింపుతో ఉన్న కోటా చీరపై తెల్లని నెమళ్ల ప్రింట్ ఆకట్టుకుంటుంది. కథాకళి నాట్య భంగిమలను ‘అచ్చు’గా రూపుకట్టి ఈ చీరను అందంగా తీర్చిదిద్దారు. లేత ఆకు పచ్చరంగు చీరకు కనకాంబరపు అంచును జత చేసి, ఆకుపచ్చని లతలు, పువ్వుల శోభ వచ్చేలా ‘అచ్చు’ వేశారు. వేసవిని కూల్ చేసే ఇలాంటి చీరలు ఆధునిక యువతులకు అందమైన అలంకరణ. డ్రెస్ కర్టెసీ: అనుపమ స్నేహాస్ కలర్స్ అండ్ ప్రింట్స్, సిద్ధార్థనగర్, హైదరాబాద్ మోడల్స్: క ల్పన, శాంతిప్రియ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
చల్లచల్లని కూల్ కూల్..
‘ఈసారి వేసవి ముందే వచ్చేస్తోంది. ఫిబ్రవరి తొలివారానికే పెరిగిన ఉష్ణోగ్రతలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఓ వైపు ఎండవేడి, ఉక్కపోత భరించలేకపోతుంటే మరోవైపు సంప్రదాయదుస్తులు ఊపిరాడనివ్వడం లేదు’ అంటూ వాపోయేవారికి చల్ల చల్లగా కూల్ కూల్‌గా ‘సమ్మర్వేర్’ ఆహ్వానం పలుకుతోంది. చల్లచల్లని ఫ్యాబ్రిక్: సింథటిక్ దుస్తులు ధరిస్తే వేడికి చికాకు కలుగుతుంది. చర్మం మీద దద్దుర్లు వస్తాయి. అందుకని చర్మానికి సౌకర్యంగా ఉండేవి, వీలైనంతవరకు ప్రకృతి సిద్ధమైన రంగులు, ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటే మేలు. కలంకారీ, మంగళగిరి, ప్లెయిన్ మల్ మల్, ప్రింటెడ్ మల్ మల్, కోరా, ఛీజ్ కాటన్, ఖాదీ కాటన్లు... తక్కువ రేటుకే లభిస్తాయి. ఇవి చర్మానికి సౌకర్యంగానూ ఉంటాయి. వీటితో వదులుగా ఉండేలా నచ్చినట్టు దుస్తులను డిజైన్ చేసుకోవచ్చు. లేదా ఈ ఫ్యాబ్రిక్‌తో ఉన్న రెడీమేడ్ దుస్తులను కొనుగోలు చేయవచ్చు. కాలానుగుణంగా దుస్తులను ధరించడంలో భారతీయులు ఏ మాత్రం ఆసక్తి చూపరంటూ విదేశీయులు విమర్శ చేస్తుంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే మన చర్మ రంగు, శరీరాకృతి, వాతావరణం, సంప్రదాయాలు.. ఇవన్నీకురచ దుస్తులు ధరించడానికి సహకరించవు. అయితే ఆధునికపు హంగులతో పాటు సౌకర్యాలను కోరుకునే నేటికాలపు మహిళలు, కాలేజీ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందిన వేసవి దుస్తులు ఇప్పటికే మార్కెట్లో ప్రత్యేక అమ్మకాలకు వచ్చి కనువిందు చేస్తున్నాయి. అయితే వాటి ఎంపికలోనే ఎవరికి వారు తమదైన ముద్ర చూపించాలి. లేత రంగులు... ధరించిన దుస్తుల రంగు గాడీగా ఉంటే బయట వేడి మరికాస్త పెరిగిందేమో అనిపిస్తుంటుంది. అందుకని లేత రంగులను ఎంచుకోవాలి. అంటే ఆకుపచ్చను ఇష్టపడే వారు లేత ఆకు పచ్చ, పసుపును ఇష్టపడేవారు లేత పసుపు, ఎరుపు అయితే లైట్ ఆరెంజ్, బ్లూ అయితే లైట్ బ్లూ... ఇలా ఎంపిక చేసుకోవచ్చు. నూలుతో ఆధునికం: నూలు వస్త్రంతో ఆధునిక, సంప్రదాయ తరహా రెండువిధాల దుస్తులనూ తయారు చేయించుకోవచ్చు. సల్వార్ కమీజులను ఏ నూలు వస్త్రంతో అయినా కుట్టించుకోవచ్చు. అనార్కలీ అయితే ఫ్లెయిర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఛీజ్, మల్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. పాశ్చాత్య దుస్తులైన గౌన్లను కలంకారీ, ఖాదీ కాటన్‌తో కుట్టించుకుంటే లుక్ స్టైలిష్‌గా మారిపోతుంది. స్కర్ట్స్ కోసం లినెన్, ఖాదీని వాడుకోవచ్చు. లినెన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఖరీదులోనూ లభిస్తుంది. దీనితో కుర్తీలు, ట్రౌజర్లను డిజైన్ చేసుకోవచ్చు. ఆఫీసుకు వేసుకెళ్లడానికి లినెన్ ట్రౌజర్లు, లినెన్ షర్ట్స్, షార్ట్స్ డిజైన్ చేయించుకోవచ్చు. అయితే ఏ తరహా దుస్తులైనా పగటి పూట సాదాగా ఉండే లేత రంగులు గలవి, సాయంకాలం ప్రింట్లు ఉన్న దుస్తులను ఎంచుకోవాలి. లేత రంగుల గౌనులు వేసవి ప్రత్యేకం. ఇలాంటప్పుడు కాంట్రాస్ట్ బెల్ట్ వాడితే స్టైలిష్‌గా కనిపిస్తారు. చమట, ఉక్కపోతల బాధలేకుండా లాంగ్ కాటన్ స్కర్ట. ఈ వేసవికి మీ వార్డరోబ్లో ఉండాల్సినదుస్తులు: పలాజో ప్యాంట్స్, గౌన్లు, షార్ట్స, స్కర్టలు, కెప్రిస్... కాటన్ కార్గో కెప్రిస్! వదులుగా, మోకాళ్ల వరకు ఉండే కెప్రిస్ వేసవి వేడిని దూరం చేస్తుంది. సౌకర్యంగానూ, ఆధునికంగానూ ఉంటుంది. వేసవి ఉక్కపోతకు చెక్ పెట్టాలంటే వార్డరోబ్లో స్కర్టలా ఉండే పలాజో ప్యాంట్స్ ఉండాల్సిందే! కురచ దుస్తులు ధరించలేం కదా అని ఇబ్బందిపడేవారికి ఈ ప్యాంట్స్ మంచి ఎంపిక. పొట్టివి, పొడవైన స్కర్టలు, గౌనులు అనుకూలమైన ఎంపిక. నిర్వహణ: నిర్మలారెడ్డి -
వెలుగు వన్నెలు
దీపాలు... దీపాలు అంటుంటారు కానీ... అతివల కనులలోని వెలుగులకంటేనా! మోమున విరిసే చిరునవ్వులకంటేనా! మేనికి అంటిన మెరుపులకంటేనా! కురులలో కదిలే కాంతివంకలకంటేనా! మిణుగురు ధారణల ముస్తాబుకంటేనా! చూద్దాం... తారకలు మీతో పోటీకొస్తాయో... ఒత్తి వెలిగించమని వరుసలోకి వచ్చేస్తాయో. విష్యూ ఎ హ్యాపీ అండ్ బ్రైట్ సెలక్షన్. 1- హాఫ్‌వైట్ సిల్క్ బెనారస్ చీరకు, నలుపురంగు వెల్వెట్ బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్. హైనెక్ బ్ల్రౌజ్ గ్రాండ్‌గా ఉండేలా దానిపై చేసిన యాంటిక్ గోల్డ్ వర్క్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. 2- రాణీ పింక్ ఉప్పాడ చీరపైన స్టోన్, జర్దోసీ వర్క్ దీపాలతో పోటీపడుతోంది. బుట్ట చేతుల వర్క్ బ్లౌజ్ అధనపు ఆకర్షణ. 3- జర్దోసీ వర్క్ చేసిన బార్డర్ జత చేసిన మల్టీకలర్ చెక్స్ కంచి పట్టు చీర ఇది. దీనికి కాంట్రాస్ట్ కలర్లో నెటెడ్ స్లీవ్స్ ఉన్న బ్లూ వెల్వెట్ బ్లౌజ్ హైలైట్! 4- ముదురు పసుపురంగు కంచిపట్టు చీర ఇది. అంచు భాగంలోనూ, చీరంతా అక్కడక్కడా స్టోన్ వర్క్ వాడటంతో ఆ కాంతులు దీపాలతో పోటీపడుతున్నాయి. మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com -
గ్రాండ్ గా... దాండియా
దేవీనవరాత్రి ఉత్సవాలలోభక్తిశ్రద్ధలతో చేసే నృత్యం... గర్భా. అదయ్యాక... వినోద కార్యక్రమాలలో ఉల్లాసంగా చేసే డాన్స్... దాండియా. నిజానికి దాండియా డాన్స్ కాదు. ఫైటింగ్!! దుర్గాదేవికి, మహిషాసురుడికీ మధ్య జరిగిన యుద్ధానికి నృత్యరూపకం! దాండియాలో ప్రధాన ఆకర్షణ... యువతులు ధరించే దుస్తులు! భక్తిని, సంప్రదాయాన్ని మేళవించి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో... అలా ఉంటుంది దాండియా డ్రెస్! దాండియా ఆడితేనే దశమి ‘ముస్తాబు’ పూర్తైట్లు! 1- నీలం, నలుపు, నారింజ రంగుల ప్రింటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లెహంగా ఇది. చోళీని పూర్తి అద్దకం వర్కతో తీర్చిదిద్దారు. మల్టీకలర్లో మెరిసిపోతున్న ఈ దాండియా డ్రెస్‌కు పూర్తి గిరిజన సంప్రదాయ హంగులను అద్దారు. 2- బాందినీ ప్రింట్ ఉన్న జార్జెట్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహంగా, చోళీ ఇది. ఎంబ్రాయిడరీ, పూసలు, గవ్వలు, అద్దకం వర్క ఈ డ్రెస్‌కు కళను తీసుకువచ్చాయి. 3- తెల్లని కాటన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గాగ్రాచోళీ దుపట్టా! లెహంగాపైన చేసిన ప్యాచ్‌వర్‌క, చమ్కీ, నడుం దగ్గర గవ్వల బెల్ట్ ఈ డ్రెస్‌ను ఆకర్షణీయంగా మార్చాయి. 4- పసుపు, పచ్చ, నారింజ రంగులతో రూపొందించిన గాగ్రాచోళీ దాండియా వేడుకకు రెట్టింపు కళ తీసుకువస్తోంది. ఉలెన్ బాల్ హ్యాంగింగ్స, అద్దకం వర్క ఈ డ్రెస్‌కు హైలైట్! డిజైనర్ టిప్స్... బాందినీ ప్రింట్లు, రంగురంగుల ఫ్యాబ్రిక్‌తో రూపొందిన గాగ్రా దుస్తులు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. లోబ్యాక్, లో వెయిస్ట్, ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్, కలర్‌ఫుల్ ప్రింట్స్ ఈ దుస్తుల ప్రత్యేకత. దాండియా సందర్భంగా దుస్తులకు తగిన యాక్సెసరీస్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. లెహంగాలకు తోడుగా ఎంబ్రాయిడరీ చేసిన చిన్న చిన్న బ్యాగ్‌లు, మెటల్, ప్లాస్టిక్ గాజులను ఎంచుకోవాలి. చె వులకు పెద్ద పెద్ద ఝుంకీలు, మెడలో వెడల్పాటి ఆభరణాలు ధరిస్తే వావ్ అనిపిస్తారు. గాజులతో పాటు చురియాన్ (రింగులతో ఉండే గాజులు) కూడా ధరించాలి. ఇవి దాండియా లుక్‌ను మరింత హైలెట్ చేస్తాయి. మాంగ్-టికా(ముక్కుకు పెట్టుకునే ఓ పెద్ద రింగ్) ధరించవచ్చు. పెద్ద రాళ్ల ఉంగరాలు ఇప్పుడు ఫ్యాషన్. దాండియా దుస్తులకు నప్పేలా పెద్ద పెద్ద ఉంగరాలు, నృత్యాలకు ఇబ్బంది కలిగించని విధంగా పాదాలకు జోధ్‌పూర్ షూ ధరించడం మంచిది. రాత్రివేళనే ఈ వేడుకలు ఉంటాయి కాబట్టి మేకప్ కూడా గ్రాండ్‌గా ఉండాలి. ఐ మేకప్, ఐ షాడోస్ దుస్తుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పూర్తిస్థాయి గాగ్రాఛోళీ లేనప్పుడు అద్దాలు అతికించిన బాందినీ దుపట్టాను ఎంచుకుని దాండియాలో పాల్గొనవచ్చు. దాండియా స్టిక్స్‌ను సైతం పెయింట్‌తో, లేసులతో అందంగా అలంకరించుకుంటే అవి దుస్తుల అలంకరణకు ధీటుగా ఉంటాయి. బాందినీ ప్రింట్లు ఉన్న జార్జెట్ లెహంగాలు, లైట్ వెయిట్‌తో ఉండే నెటెడ్ లెహంగాలు దాండియా కళను రెట్టింపు చేస్తాయి. కోర్సెట్ స్టైల్ బ్లౌజ్‌లు, కాంట్రాస్ట్ కలర్ దుపట్టాలు ఆక ర్షణీయంగా కనిపిస్తాయి. బ్లౌజ్‌కు గోల్డ్‌కలర్, లెహంగా కోసం రెడ్ లేదా ఆరెంజ్ కలర్... రంగులు బాగా నప్పుతాయి. మెటాలిక్, గోల్డ్ కలర్ యాక్సెసరీస్, సిల్వర్ జ్యూయలరీ ధరించవచ్చు. షార్ట్ లెహంగా ధరిస్తే 2 సిల్వర్ యాంక్లెట్లు జత చేయాలి. ఇప్పుడు చాలామంది స్వంతంగా కూడా యాంక్లెట్స్ తయారుచేసుకుంటున్నారు. ఇవి ఎంత ఫ్యాన్సీగా ఉంటే అంత అందంగా ఉంటుంది. ఆయేషా లఖోటియా ఫ్యాషన్డిజైనర్, ఎల్ ఫ్యాషన్ స్టూడియో -
తెప్పపై వినాయకుడి విహారం
కాణిపాకం, న్యూస్‌లైన్: స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన తెప్పోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు కొలువుదీరి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాల సమర్పణ జరిపారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని వేంచేపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య స్వామివారిని సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. జై గణేశ.. జై జై గణేశ నామస్మరణతో కాణిపాకం మారుమోగింది. తెప్పోత్సవానికి పుండరీకనాయుడు, శేషాద్రినాయుడు ఆయన సోదరులు, దామోదరనాయుడు, హనుమంతనాయుడు, రామకృష్ణారెడ్డి కుమారులు, కొత్తపల్లె దామోదరనాయుడు, రామచంద్రనాయుడు, లంకిపల్లె మోహన్‌బాబు ఆయన సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ వెంకటనారాయణ, ఏసీ ఆదికేశవపిళ్లె, ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి తది తరులు పాల్గొన్నారు. వినాయకుని మహాప్రసాదం వేలం వినాయకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా 21కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఆదివారం రాత్రి బహిరంగ వేలం వేశారు. 21రోజుల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 21కేజీల లడ్డూ ప్రసాదాన్ని మూలవిరాట్ వద్ద నైవేద్యంగా ఉంచి ఆస్థాన మండపంలో బహిరంగవేలం వేశారు. ఈ లడ్డూ ప్రసాదం కోసం భక్తులు పోటీ పడ్డారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి తెప్పోత్సవంతో విజయవంతంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు దేవస్థానం వారు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తదుపరి 11రోజులు ఉభయదారుల అధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారికి వాహనసేవలు నిర్వహించారు. -
ఏడు దారాల నగలు!
చంద్రుడు సొంతంగా వెలగలేడు. వెనుక సూర్యుడు ఉండాలి. ఆభరణాలు సొంతంగా మెరవలేవు. ఆడవాళ్ల ఒంటి మీద ఉండాలి. ఇంకేం గొప్ప... ఈ బంగారాలు, వజ్ర వైడూర్యాలు?! ఇంకేం గొప్ప... ఈ ధగధగలు, ఏడువారాల నగలు?! లేడీస్ టచ్‌తో ముఖం వెలిగిపోయేవి కాకుండా... లైడీస్కే ఫినిషింగ్ టచ్ ఇచ్చే జ్యూయలరీనే లేదా ఈ అసహాయ లోకంలో?! ఉందుంది! తొందరపడకండి!! ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలను... ప్రకృతిలోని సొగసైన ఆకృతులను... పోగేసి, అల్లేసి, చుట్టేసి, కుట్టేసి... అతివల మెడలో హారంగా కొలువుదీర్చే ‘ఫ్యాబ్రిక్ జ్యూయలరీ’ ఉంది! ఏడు వారాల నగలను సైతం ఫేడవుట్ చేసే... ఏడు దారాల్లాంటి నగలివి. 1- మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ డోరీని వలయాకారంగా చుట్టి అన్నింటినీ జత చేస్తూ కుట్టాలి. దీంతో హెవీ మల్టీ కలర్ నెక్లెస్‌గా రూపుదిద్దుకుంటుంది. 2- కాపర్సల్ఫేట్, బ్లూ సిల్క్ ఫ్యాబ్రిక్ డోరీలతో జడలా అల్లిన పొడవాటి దండ ఇది. ఫ్యాబ్రిక్ డోరీలు, బీడ్‌స, గవ్వలతో రూపొందించిన లాకెట్‌ను దీనికి జత చేశారు. 3- ఫ్యాబ్రిక్ డోరిస్‌తో చేసిన పింక్ లాంగ్ చెయిన్, పువ్వుల డిజైన్‌తో కనువిందు చేస్తోంది. ఇది ప్రింటెడ్ లేదా ప్లెయిన్ శారీ లేదా డ్రెస్ పై కూడా ధరించవచ్చు. 4- కాషాయం రంగు ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన నెక్‌పీస్, ఇయర్ హ్యాంగింగ్స! 5- బ్లాక్ ఫ్యాబ్రిక్ డోరీలకు పెద్దవి, చిన్నవి బీడ్స్ జత చేసి తయారుచేసిన కంఠాభరణం. 6- గ్రీన్, గోల్డ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఆకర్షణీయమైన నెక్లెస్! 7- సాదా సిల్క్ ఫ్యాబ్రిక్‌ని దూది ఉండలకు చుట్టి, బాల్స్‌లా చేయాలి. ఈ బాల్స్‌ని యాంటిక్ గోల్డ్ చెయిన్‌కి జత చేయాలి. మోడల్: వైష్ణవి ఫొటోలు: శివమల్లాల మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com -
భారతీయ మగువ ఆత్మ ఆరుగజాల చీర
‘నువు పట్టుచీర కడితే... ఓ పుత్తడిబొమ్మా... ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ!’ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్! వేటూరి పాటలోని ఈ చరణం... ప్రతి స్త్రీమూర్తికీ... ఓ ప్రణామం! అవునూ... పట్టుపురుగు జన్మొక్కటేనా... ఇంకో ‘పురుగు’ జన్మ కూడా తరించాలే! (సారీ బాయిస్... ఊరికే... సరదాకి...) బాటమ్ లైన్ ఏంటంటే... చీర ప్రాణం ‘కట్టు’లో ఉంటుందని! అందుకే ఈవారం ‘ముస్తాబు’లో... ‘హౌ టు’ నుంచి ‘హవ్వీజిట్’ వరకు... కట్టుబడి పాఠాలు. భారతీయ మగువ ఆత్మ ఆరుగజాల చీర. పొడవులో అర గజం తగ్గినా ప్రపంచవస్త్రధారణలో ఎప్పుడూ పై మెట్టు మీదే ఉంటుంది చీర. పాశ్చాత్యులు సైతం సలామ్ చేసే చీర అంచులుగా, కుచ్చిళ్లుగా... ప్రతి కదలికలోనూ చూడచక్కని కళతో ఆకట్టుకుంటుంది. బంగారు తీగెలతో నేసినా, వెండి దారాలతో అల్లినా, నైలాన్‌తో నయనానందకరం చేసినా అమ్మాయి చీరకట్టు సరిగ్గా ఉంటేనే నూటికి నూరు మార్కులు పడతాయి. అందరూ చీరలు కట్టుకుంటారు. కాని కొందరి ‘కట్టు’కే ప్రశంసలు అందుతాయి. ఎందుకలా? ‘మాకూ మీలా కట్టడం నేర్పుతారా?’ అని అడిగి మరీ ‘చీరకట్టు’ను నేర్పించుకుంటారు కొందరు. ఆ‘కట్టు’కోవడంలో అంత గొప్పతనం ఏముంది? చీరకట్టుకు ప్రత్యేకమైన క్లాసులూ, టీచర్లూ ఉండటం చూస్తుంటే తెలుసుకోవాల్సిన తప్పనిసరి సబ్జెక్ట్ అనిపిస్తుంది. ముచ్చటగొలిపే చీరకట్టు విశేషాల పాఠ్యాంశమే ఇది. చీరకట్టు గమనిక కొంతమంది వెనకవైపు చీర పొర నేలకు తగులుతున్నట్టుగా, ముందువైపు కుచ్చిళ్లు పైకి ఉండేలా కడుతుంటారు. దీనివల్ల చీర అందం తగ్గిపోతుంది. అందుకని వెనక, ముందు చీర అంచులు కొద్దిగా ఫ్లోర్‌ని తగిలేలా కట్టుకోవాలి. కాలి మడమలు కనిపించకుండా చీరకట్టు ఉండాలి. గుర్తుంచుకోవలసినవి పెట్టీకోట్ మరీ బిగుతుగా, మరీ లూజ్‌గా కాకుండా సౌకర్యవంతంగా ఉండేలా కట్టుకోవాలి. పల్లూ భుజం మీదుగా తీసి, మోకాలు కిందవరకు వచ్చేలా సెట్ చేసుకోవాలి. చీర ఫాల్ బయటకు కనిపించకూడదు. నడిచేటప్పుడు కుచ్చులు అడ్డుపడకుండా సౌకర్యవంతంగా ఉండేలా సెట్ చేసుకోవాలి. సింపుల్‌గా ఆలంకరణ మొదటిసారి చీరకట్టుకుంటే సింథటిక్ మెటీరియల్ శారీని కట్టుకోవడం సులువు. చీరకు సరిపోలే అందమైన జాకెట్టు ఉంటేనే అదనపు ఆకర్షణ. చీరకు సరిపోలే లక్షణమైన శాండల్స్, చెప్పల్స్ వేసుకోవాలి. మ్యాచ్ అయ్యే చెప్పులు ధరించాలి. (హై హీల్స్ వేసేవారు చీర కట్టుకునేముందు తప్పనిసరిగా హీల్స్ వేసుకొని కట్టుకోవాలి. ముందే చీరకట్టుకొని హీల్స్ వేసుకుంటే చీర నిడివి పొట్టిగా అనిపిస్తుంది. బయటకు హీల్స్ కనిపించకుండా చీర అంచులు కిందవరకు ఉంటే బాగుంటుంది) చీరకట్టు మీదకు ఎన్ని నగలైనా బాగుంటాయి కదా! అని ఎక్కువగా వేసుకుంటే ఎబ్బెట్టుగా ఉంటారు. ఎంత సింపుల్‌గా అలంకరణ అంత బాగుంటుంది. చీర కట్టుకున్నప్పుడు చీరకు తగిన గాజులపై కూడా దృష్టిపెట్టాలి. ఇతర డ్రెస్సులకు లేని అదనపు హంగులను చీరతో క్రియేట్ చేయవచ్చు. ఒక చేత్తో పల్లూను ముందుకు లేదా వెనక నుంచి పట్టుకోవడం. మెడ మీదుగా తీసుకొచ్చి పట్టుకోవచ్చు. ఏ తరహాగా కట్టినా చీర అందం రెట్టింపు అయ్యేలా వస్త్రధారణ ఉంటే మరీ మంచిది. పట్టు చీర పట్టు చీర కట్టుకునేటప్పుడు హిప్ దగ్గర ఉండే ఫస్ట్‌లైన్ పొరను కుడివైపు హిప్ దగ్గరకు తీసి, చిన్న చిన్నగా 3-4 నాలుగు కుచ్చులు పెట్టి, పిన్ పెట్టాలి. లేదా పెట్టీకోట్లోకి మడవాలి. పట్టు చీరకు బార్డర్ వెడ ల్పుగా, పెద్దగా ఉంటుంది. అందుకని పల్లూ 8 ఫ్రిల్స్ పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. బొద్దుగా ఉన్నవారు పట్టుచీర కట్టుకుంటే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. అలాంటప్పుడు హెయిర్ స్ట్రెయిట్నర్ పరికరాన్ని సాధారణ ఉష్ణొగ్రతలో పెట్టి, దాంతో అమర్చుకున్న పల్లూను, కుచ్చులను (కట్టుకున్న తర్వాత) ఐరన్ చేయాలి. అలాగే భుజం మీద నుంచి ఛాతీ భాగంలోనూ ఐరన్ చేయాలి. దీని వల్ల చీరకట్టు నీటుగా కనిపిస్తుంది. ఫిష్ కట్ వర్క్, నెటెడ్, షిఫాన్... ఏదైనా ఈవెనింగ్ పార్టీవేర్ శారీ అయితే చిన్న పిల్లల ఫ్యాన్సీ బ్యాంగిల్‌ను పల్లూకు వేసుకోవాలి. దీని వల్ల ఛాతీ భాగంలో చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి, ఫిష్‌కట్ మోడల్‌గా చీర అందం రెట్టింపు అవుతుంది. పల్లూ అమర్చుకునేటప్పుడు బార్డర్ పొరని కుడి నుంచి ఎడమవైపుకు తీసి, బ్లౌజ్‌కి అటాచ్ చేస్తూ పిన్ పెట్టాలి. దాని మీదుగా పల్లూ ఫ్రిల్స్ అమర్చుకుంటే రూపంలోనూ మార్పు కనిపిస్తుంది. - నిర్వహణ: నిర్మలారెడ్డి