దీపాలు... దీపాలు అంటుంటారు కానీ...
అతివల కనులలోని వెలుగులకంటేనా!
మోమున విరిసే చిరునవ్వులకంటేనా!
మేనికి అంటిన మెరుపులకంటేనా!
కురులలో కదిలే కాంతివంకలకంటేనా!
మిణుగురు ధారణల ముస్తాబుకంటేనా!
చూద్దాం... తారకలు మీతో పోటీకొస్తాయో...
ఒత్తి వెలిగించమని వరుసలోకి వచ్చేస్తాయో.
విష్యూ ఎ హ్యాపీ అండ్ బ్రైట్ సెలక్షన్.
1- హాఫ్‌వైట్ సిల్క్ బెనారస్ చీరకు, నలుపురంగు వెల్వెట్ బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్. హైనెక్ బ్ల్రౌజ్ గ్రాండ్‌గా ఉండేలా దానిపై చేసిన యాంటిక్ గోల్డ్ వర్క్ ప్రత్యేకంగా కనిపిస్తోంది.
2- రాణీ పింక్ ఉప్పాడ చీరపైన స్టోన్, జర్దోసీ వర్క్ దీపాలతో పోటీపడుతోంది. బుట్ట చేతుల వర్క్ బ్లౌజ్ అధనపు ఆకర్షణ.
3- జర్దోసీ వర్క్ చేసిన బార్డర్ జత చేసిన మల్టీకలర్ చెక్స్ కంచి పట్టు చీర ఇది. దీనికి కాంట్రాస్ట్ కలర్‌లో నెటెడ్ స్లీవ్స్ ఉన్న బ్లూ వెల్వెట్ బ్లౌజ్ హైలైట్!
4- ముదురు పసుపురంగు కంచిపట్టు చీర ఇది. అంచు భాగంలోనూ, చీరంతా అక్కడక్కడా స్టోన్ వర్క్ వాడటంతో ఆ కాంతులు దీపాలతో పోటీపడుతున్నాయి.
మంగారెడ్డి,
ఫ్యాషన్ డిజైనర్
www.mangareddy.com
వెలుగు వన్నెలు
Published Wed, Oct 30 2013 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement
Advertisement