Manga Reddy
-
అత్తయ్య ఐతేనేం?కత్తుల రత్తయ్య ఐతేనేం?
రెక్కలు టపటపలాడించడానికి.. రివ్వున ఎగిరిపోడానికీ... కాలం కాదిది. చలి ఎలా ఉందో చూశారు కదా! కత్తుల రత్తయ్యలా తిరుగుతోంది. కొత్త కోడలి అత్తగారిలా వణికిస్తోంది. బయటికి బయల్దేరినవారెవరైనా... నిండా స్వెటర్ కప్పుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని భుజాలను దగ్గరకు బిగించుకుని ‘కృష్ణా, రామా...’ అనుకుంటూ వెళ్లిన దారినే వచ్చేయడం క్షేమకరం. కానీ మగువలు ఊరుకుంటారా! చలి గాలులకు జడిసి నిలబడిపోతారా?! చలి కోట్ల కింద అందమైన డ్రెస్‌లను దాచేసుకుని వేడుకలను వెలవెలబోనిస్తారా! నో... వే..! ఊలుతోనే సల్వార్ కమీజ్‌లు, ఊలుతోనే లెగ్గింగ్స్ డిజైన్ చేయించుకుని... వింటర్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు! మీరూ ఫాలో అవండి! అదే బెస్ట్. ఆల్ ది బెస్ట్. 1- లక్నో వర్క్ చేసిన జ్యూట్, కాటన్ మెటీరియల్‌తో తయారు చేసిన బ్లేజర్ చలిని ఆపుతుంది. దీనికి ఇన్నర్‌గా కాంట్రాస్ట్ స్పగెట్టి లేదా టీ షర్ట్ వేసుకొని, జీన్స్‌కి మ్యాచ్ అయ్యే బెల్ట్ వాడాలి. కార్పొరేట్ ఉద్యోగులు ఇలా రెడీ అయితే వింటర్లో సౌకర్యవంతంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు. 2- లేత పచ్చపువ్వుల ప్రింట్ ఉన్న మందపు కాటన్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లేజర్, లోపల స్పగెట్టి లేదా టీ షర్ట్ ధరించి బెల్ట్ వాడాలి. జెగ్గింగ్ లేదా జీన్స్ ధరిస్తే స్టైల్‌గా ఉంటుంది. ఈ డ్రెస్ చలిని తట్టుకునేవిధంగా ఉంటుంది. సింపుల్‌గా సౌకర్యవంతంగా అనిపించే ఇలాంటి స్టైల్స్‌ని మీరూ ట్రై చేయవచ్చు. 3- ఆరెంజ్ రా సిల్క్ టాప్ పైన వెల్వెట్ ఓవర్ కోట్ వాడాలి. వెల్వెట్ క్లాత్ మందంగా ఉంటుంది. చలి తట్టుకునే విధంగానూ, ఫ్యాషన్‌గానూ ఉంటుంది. టాప్‌కి వాడిన ముదురురంగు లైన్స్‌ను బట్టి జెగ్గింగ్ ఎంచుకుంటే పర్ఫెక్ట్ వింటర్ డ్రెస్ అవుతుంది. 4- జెగ్గింగ్ ధరించి, పైన టీ షర్ట్ వేసి ఆపైన ఊలు ఓవర్ కోట్‌ను వాడటంతో స్టైల్‌గా కనువిందుచేస్తోంది ఈ డ్రెస్. కాలేజీకెళ్లే అమ్మాయిలకు ఈ స్టైల్ బాగుంటుంది. 5- ఊలుతో డిజైన్ చేసిన డ్రెస్సులు చలిని ఆపుతాయి. అందుకని స్వెటర్స్ అల్లేవారితో సల్వార్ కమీజ్, లెగ్గింగ్స్ మన శరీర కొలతల ప్రకారం తయారుచేయించుకోవచ్చు. వంగపండు రంగు ఊలుతో డిజైన్ చేసిన ఈ సల్వార్ కమీజ్, నలుపు రంగు ఊలుతో తయారుచేసిన ఈ లెగ్గింగ్ అలా డిజైన్ చేసినవే! నెక్కి గోటా బార్డర్, బ్లాక్ అండ్ వైట్ వీవింగ్ వల్ల ఈ సల్వార్ కమీజ్ హైలైట్‌గా నిలిచింది. ఊలుకు సాగే గుణం ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ డ్రెస్ పైన రెగ్యులర్ యాక్సెసరీస్ ఏవైనా వాడుకోవచ్చు. ట్రెడిషనల్‌గా ఉండాలంటే డ్రెస్‌లోని రంగులను బట్టి ఇయర్ రింగ్స్, చెప్పులు ధరించాలి. మోడల్స్: అశ్విని, సొనాలి ఫొటోలు: శివమల్లాల మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com -
వెలుగు వన్నెలు
దీపాలు... దీపాలు అంటుంటారు కానీ... అతివల కనులలోని వెలుగులకంటేనా! మోమున విరిసే చిరునవ్వులకంటేనా! మేనికి అంటిన మెరుపులకంటేనా! కురులలో కదిలే కాంతివంకలకంటేనా! మిణుగురు ధారణల ముస్తాబుకంటేనా! చూద్దాం... తారకలు మీతో పోటీకొస్తాయో... ఒత్తి వెలిగించమని వరుసలోకి వచ్చేస్తాయో. విష్యూ ఎ హ్యాపీ అండ్ బ్రైట్ సెలక్షన్. 1- హాఫ్‌వైట్ సిల్క్ బెనారస్ చీరకు, నలుపురంగు వెల్వెట్ బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్. హైనెక్ బ్ల్రౌజ్ గ్రాండ్‌గా ఉండేలా దానిపై చేసిన యాంటిక్ గోల్డ్ వర్క్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. 2- రాణీ పింక్ ఉప్పాడ చీరపైన స్టోన్, జర్దోసీ వర్క్ దీపాలతో పోటీపడుతోంది. బుట్ట చేతుల వర్క్ బ్లౌజ్ అధనపు ఆకర్షణ. 3- జర్దోసీ వర్క్ చేసిన బార్డర్ జత చేసిన మల్టీకలర్ చెక్స్ కంచి పట్టు చీర ఇది. దీనికి కాంట్రాస్ట్ కలర్లో నెటెడ్ స్లీవ్స్ ఉన్న బ్లూ వెల్వెట్ బ్లౌజ్ హైలైట్! 4- ముదురు పసుపురంగు కంచిపట్టు చీర ఇది. అంచు భాగంలోనూ, చీరంతా అక్కడక్కడా స్టోన్ వర్క్ వాడటంతో ఆ కాంతులు దీపాలతో పోటీపడుతున్నాయి. మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com -
ఏడు దారాల నగలు!
చంద్రుడు సొంతంగా వెలగలేడు. వెనుక సూర్యుడు ఉండాలి. ఆభరణాలు సొంతంగా మెరవలేవు. ఆడవాళ్ల ఒంటి మీద ఉండాలి. ఇంకేం గొప్ప... ఈ బంగారాలు, వజ్ర వైడూర్యాలు?! ఇంకేం గొప్ప... ఈ ధగధగలు, ఏడువారాల నగలు?! లేడీస్ టచ్‌తో ముఖం వెలిగిపోయేవి కాకుండా... లైడీస్కే ఫినిషింగ్ టచ్ ఇచ్చే జ్యూయలరీనే లేదా ఈ అసహాయ లోకంలో?! ఉందుంది! తొందరపడకండి!! ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలను... ప్రకృతిలోని సొగసైన ఆకృతులను... పోగేసి, అల్లేసి, చుట్టేసి, కుట్టేసి... అతివల మెడలో హారంగా కొలువుదీర్చే ‘ఫ్యాబ్రిక్ జ్యూయలరీ’ ఉంది! ఏడు వారాల నగలను సైతం ఫేడవుట్ చేసే... ఏడు దారాల్లాంటి నగలివి. 1- మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ డోరీని వలయాకారంగా చుట్టి అన్నింటినీ జత చేస్తూ కుట్టాలి. దీంతో హెవీ మల్టీ కలర్ నెక్లెస్‌గా రూపుదిద్దుకుంటుంది. 2- కాపర్సల్ఫేట్, బ్లూ సిల్క్ ఫ్యాబ్రిక్ డోరీలతో జడలా అల్లిన పొడవాటి దండ ఇది. ఫ్యాబ్రిక్ డోరీలు, బీడ్‌స, గవ్వలతో రూపొందించిన లాకెట్‌ను దీనికి జత చేశారు. 3- ఫ్యాబ్రిక్ డోరిస్‌తో చేసిన పింక్ లాంగ్ చెయిన్, పువ్వుల డిజైన్‌తో కనువిందు చేస్తోంది. ఇది ప్రింటెడ్ లేదా ప్లెయిన్ శారీ లేదా డ్రెస్ పై కూడా ధరించవచ్చు. 4- కాషాయం రంగు ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన నెక్‌పీస్, ఇయర్ హ్యాంగింగ్స! 5- బ్లాక్ ఫ్యాబ్రిక్ డోరీలకు పెద్దవి, చిన్నవి బీడ్స్ జత చేసి తయారుచేసిన కంఠాభరణం. 6- గ్రీన్, గోల్డ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఆకర్షణీయమైన నెక్లెస్! 7- సాదా సిల్క్ ఫ్యాబ్రిక్‌ని దూది ఉండలకు చుట్టి, బాల్స్‌లా చేయాలి. ఈ బాల్స్‌ని యాంటిక్ గోల్డ్ చెయిన్‌కి జత చేయాలి. మోడల్: వైష్ణవి ఫొటోలు: శివమల్లాల మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com