చంద్రుడు సొంతంగా వెలగలేడు.
వెనుక సూర్యుడు ఉండాలి.
ఆభరణాలు సొంతంగా మెరవలేవు.
ఆడవాళ్ల ఒంటి మీద ఉండాలి.
ఇంకేం గొప్ప... ఈ బంగారాలు, వజ్ర వైడూర్యాలు?!
ఇంకేం గొప్ప... ఈ ధగధగలు, ఏడువారాల నగలు?!
లేడీస్ టచ్‌తో ముఖం వెలిగిపోయేవి కాకుండా...
లైడీస్‌కే ఫినిషింగ్ టచ్ ఇచ్చే జ్యూయలరీనే లేదా ఈ అసహాయ లోకంలో?!
ఉందుంది! తొందరపడకండి!!
ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలను...
ప్రకృతిలోని సొగసైన ఆకృతులను...
పోగేసి, అల్లేసి, చుట్టేసి, కుట్టేసి...
అతివల మెడలో హారంగా కొలువుదీర్చే ‘ఫ్యాబ్రిక్ జ్యూయలరీ’ ఉంది!
ఏడు వారాల నగలను సైతం ఫేడవుట్ చేసే...
ఏడు దారాల్లాంటి నగలివి.
1- మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ డోరీని వలయాకారంగా చుట్టి అన్నింటినీ జత చేస్తూ కుట్టాలి. దీంతో హెవీ మల్టీ కలర్ నెక్లెస్‌గా రూపుదిద్దుకుంటుంది.
2- కాపర్‌సల్ఫేట్, బ్లూ సిల్క్ ఫ్యాబ్రిక్ డోరీలతో జడలా అల్లిన పొడవాటి దండ ఇది. ఫ్యాబ్రిక్ డోరీలు, బీడ్‌స, గవ్వలతో రూపొందించిన లాకెట్‌ను దీనికి జత చేశారు.
3- ఫ్యాబ్రిక్ డోరిస్‌తో చేసిన పింక్ లాంగ్ చెయిన్, పువ్వుల డిజైన్‌తో కనువిందు చేస్తోంది. ఇది ప్రింటెడ్ లేదా ప్లెయిన్ శారీ లేదా డ్రెస్ పై కూడా ధరించవచ్చు.
4- కాషాయం రంగు ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన నెక్‌పీస్, ఇయర్ హ్యాంగింగ్‌స!
5- బ్లాక్ ఫ్యాబ్రిక్ డోరీలకు పెద్దవి, చిన్నవి బీడ్స్ జత చేసి తయారుచేసిన కంఠాభరణం.
6- గ్రీన్, గోల్డ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఆకర్షణీయమైన నెక్లెస్!
7- సాదా సిల్క్ ఫ్యాబ్రిక్‌ని దూది ఉండలకు చుట్టి, బాల్స్‌లా చేయాలి. ఈ బాల్స్‌ని యాంటిక్ గోల్డ్ చెయిన్‌కి జత చేయాలి.
మోడల్: వైష్ణవి
ఫొటోలు: శివమల్లాల
మంగారెడ్డి,
ఫ్యాషన్ డిజైనర్
www.mangareddy.com
ఏడు దారాల నగలు!
Published Wed, Sep 25 2013 11:23 PM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement