విద్యుద్దీపాల వెలుగులతో కలెక్టరేట్
మహబూబ్‌నగర్ క్రైం / మహబూబ్‌నగర్ న్యూటౌన్ : స్వాతంత్య్ర దినోత్సవానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. ఈ పాటికే కలెక్టరేట్, జెడ్పీ, ఎస్పీ కార్యాలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. శనివారం రాత్రి వాటిని విద్యుద్దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. సోమవారం జరిగే వేడుకలకు జిల్లా పరేడ్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఇందులోభాగంగా జిల్లా పోలీస్ అధికారులు కవాతు సాధన చేశారు. ఇక్కడ జరిగే కార్యక్రమానికి జిల్లా మంత్రి జూపల్లి కష్ణారావు, కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్నారు.