రెక్కలు టపటపలాడించడానికి..
రివ్వున ఎగిరిపోడానికీ... కాలం కాదిది.
చలి ఎలా ఉందో చూశారు కదా!
కత్తుల రత్తయ్యలా తిరుగుతోంది.
కొత్త కోడలి అత్తగారిలా వణికిస్తోంది.
బయటికి బయల్దేరినవారెవరైనా...
నిండా స్వెటర్ కప్పుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని భుజాలను దగ్గరకు బిగించుకుని ‘కృష్ణా, రామా...’ అనుకుంటూ
వెళ్లిన దారినే వచ్చేయడం క్షేమకరం.
కానీ మగువలు ఊరుకుంటారా!
చలి గాలులకు జడిసి నిలబడిపోతారా?!
చలి కోట్ల కింద అందమైన డ్రెస్‌లను దాచేసుకుని వేడుకలను వెలవెలబోనిస్తారా!
నో... వే..!
ఊలుతోనే సల్వార్ కమీజ్‌లు, ఊలుతోనే లెగ్గింగ్స్ డిజైన్ చేయించుకుని...
వింటర్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు!
మీరూ ఫాలో అవండి!
అదే బెస్ట్. ఆల్ ది బెస్ట్.
1- లక్నో వర్క్ చేసిన జ్యూట్, కాటన్ మెటీరియల్‌తో తయారు చేసిన బ్లేజర్ చలిని ఆపుతుంది. దీనికి ఇన్నర్‌గా కాంట్రాస్ట్ స్పగెట్టి లేదా టీ షర్ట్ వేసుకొని, జీన్స్‌కి మ్యాచ్ అయ్యే బెల్ట్ వాడాలి. కార్పొరేట్ ఉద్యోగులు ఇలా రెడీ అయితే వింటర్‌లో సౌకర్యవంతంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు.
2- లేత పచ్చపువ్వుల ప్రింట్ ఉన్న మందపు కాటన్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లేజర్, లోపల స్పగెట్టి లేదా టీ షర్ట్ ధరించి బెల్ట్ వాడాలి. జెగ్గింగ్ లేదా జీన్స్ ధరిస్తే స్టైల్‌గా ఉంటుంది. ఈ డ్రెస్ చలిని తట్టుకునేవిధంగా ఉంటుంది. సింపుల్‌గా సౌకర్యవంతంగా అనిపించే ఇలాంటి స్టైల్స్‌ని మీరూ ట్రై చేయవచ్చు.
3- ఆరెంజ్ రా సిల్క్ టాప్ పైన వెల్వెట్ ఓవర్ కోట్ వాడాలి. వెల్వెట్ క్లాత్ మందంగా ఉంటుంది. చలి తట్టుకునే విధంగానూ, ఫ్యాషన్‌గానూ ఉంటుంది. టాప్‌కి వాడిన ముదురురంగు లైన్స్‌ను బట్టి జెగ్గింగ్ ఎంచుకుంటే పర్‌ఫెక్ట్ వింటర్ డ్రెస్ అవుతుంది.
4- జెగ్గింగ్ ధరించి, పైన టీ షర్ట్ వేసి ఆపైన ఊలు ఓవర్ కోట్‌ను వాడటంతో స్టైల్‌గా కనువిందుచేస్తోంది ఈ డ్రెస్. కాలేజీకెళ్లే అమ్మాయిలకు ఈ స్టైల్ బాగుంటుంది.
5- ఊలుతో డిజైన్ చేసిన డ్రెస్సులు చలిని ఆపుతాయి. అందుకని స్వెటర్స్ అల్లేవారితో సల్వార్ కమీజ్, లెగ్గింగ్స్ మన శరీర కొలతల ప్రకారం తయారుచేయించుకోవచ్చు. వంగపండు రంగు ఊలుతో డిజైన్ చేసిన ఈ సల్వార్ కమీజ్, నలుపు రంగు ఊలుతో తయారుచేసిన ఈ లెగ్గింగ్ అలా డిజైన్ చేసినవే! నెక్‌కి గోటా బార్డర్, బ్లాక్ అండ్ వైట్ వీవింగ్ వల్ల ఈ సల్వార్ కమీజ్ హైలైట్‌గా నిలిచింది. ఊలుకు సాగే గుణం ఉంటుంది కాబట్టి పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ డ్రెస్ పైన రెగ్యులర్ యాక్సెసరీస్ ఏవైనా వాడుకోవచ్చు. ట్రెడిషనల్‌గా ఉండాలంటే డ్రెస్‌లోని రంగులను బట్టి ఇయర్ రింగ్స్, చెప్పులు ధరించాలి.
మోడల్స్: అశ్విని, సొనాలి
ఫొటోలు: శివమల్లాల
మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్
www.mangareddy.com
అత్తయ్య ఐతేనేం?కత్తుల రత్తయ్య ఐతేనేం?
Published Thu, Nov 28 2013 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement