చలించని సంప్రదాయం | unalloyed convention | Sakshi
Sakshi News home page

చలించని సంప్రదాయం

Published Wed, Dec 11 2013 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

unalloyed convention

ఆధునికత...
 ఎన్ని మెలికలైనా తిరుగుతుంది.
 సంప్రదాయం...
 చిన్న ట్విస్టుకే సిగ్గుల మొగ్గవుతుంది.
 ఎలా మరి?
 ‘ఆహ్వానం’ అంటూ పెళ్లి పిలుపులు.
 ‘ఆగండి’ అంటూ చలి బెదిరింపులు!
 చీర - లంగాఓణీ - లెహంగా - సల్వార్ కమీజ్... ఇవన్నీ...
 ట్రెడిషనలే కానీ, చలిని తట్టుకోడానికి అడిషనల్ కాదు.
 ఎలా మరి?
 ఓ పని చేద్దాం.
 పైటని శాలువాతో డిజైన్ చేయిద్దాం.
 బ్లవుజ్‌కి స్వెటర్ స్లీవ్స్ జత చేద్దాం.
 కమీజ్‌కు రా సిల్క్ కోట్ తొడుగుదాం.
 లంగాఓణీకి ఆల్టర్ నెక్ అల్లేద్దాం.
 అప్పుడిక సంప్రదాయం సంప్రదాయమే.
 వణికించే చలిలోనైనా... వేడుకకు వెళ్లిరావడమే.

 1- లేత, ముదురు ఆకుపచ్చల కాంబినేషన్‌తో రూపొందించిన లంగా ఓణీ. రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఆల్టర్‌నెక్ ఓవర్‌కోట్ వేయడంతో ఆధునికంగా కనిపిస్తోంది. ఓవర్‌కోట్ అంచును ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేశారు.
 
 2- రెడ్ సల్వార్ కమీజ్‌కు రా సిల్క్ వెల్వెట్‌తో క్విల్ట్ చేసి ఓవర్ కోట్‌గా  జతచేశారు. దీంతో చలిని తట్టుకునేలా ఛాతి భాగం వెచ్చగా ఉంటుంది.
 
 3- ముదురు గులాబీ రంగు లెహంగాకు అదే రంగు శాలువాతో ఓణీని డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్ చేసిన మల్టీకలర్ బార్డర్‌ను జత చేశారు. బ్రొకేడ్ బ్లౌజ్‌కు స్వెటర్ స్లీవ్స్ జత చేశారు. లేదంటే శాలువా ఫ్యాబ్రిక్‌ను కట్ చేసి స్లీవ్స్‌గా వేసుకోవచ్చు.
 
 4- లేత గులాబీ, నలుపు రంగుల కాంబినేషన్‌తో డిజైన్ చేసిన లంగాఓణి చీర ఇది. పైట భాగాన్ని శాలువాతో డిజైన్ చేసి, బార్డర్‌ని మల్టీకలర్ థ్రెడ్‌వర్క్‌తో రూపొందించారు.
 
 మోడల్స్: కావ్య, అశ్విని, సోనాలి
 
 మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్
 www.mangareddy.com

 

 ఫొటోలు: శివ మల్లాల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement