గ్రాండ్ గా... దాండియా | latest dress designs for dandia | Sakshi
Sakshi News home page

గ్రాండ్ గా... దాండియా

Published Thu, Oct 10 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

గ్రాండ్ గా... దాండియా

గ్రాండ్ గా... దాండియా

దేవీనవరాత్రి ఉత్సవాలలోభక్తిశ్రద్ధలతో చేసే నృత్యం... గర్భా.
 అదయ్యాక... వినోద కార్యక్రమాలలో ఉల్లాసంగా చేసే డాన్స్... దాండియా.
 నిజానికి దాండియా డాన్స్ కాదు.
 ఫైటింగ్!!
 దుర్గాదేవికి, మహిషాసురుడికీ మధ్య జరిగిన యుద్ధానికి నృత్యరూపకం!
 దాండియాలో ప్రధాన ఆకర్షణ...
 యువతులు ధరించే దుస్తులు!
 భక్తిని, సంప్రదాయాన్ని మేళవించి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో...
 అలా ఉంటుంది దాండియా డ్రెస్!
 దాండియా ఆడితేనే దశమి ‘ముస్తాబు’ పూర్తైట్లు!

 
 1- నీలం, నలుపు, నారింజ రంగుల ప్రింటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లెహంగా ఇది. చోళీని పూర్తి అద్దకం వర్‌‌కతో తీర్చిదిద్దారు.
 మల్టీకలర్‌లో మెరిసిపోతున్న ఈ దాండియా డ్రెస్‌కు పూర్తి గిరిజన సంప్రదాయ హంగులను అద్దారు.

 
 
 2- బాందినీ ప్రింట్ ఉన్న జార్జెట్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహంగా, చోళీ ఇది. ఎంబ్రాయిడరీ, పూసలు, గవ్వలు, అద్దకం వర్‌‌క ఈ డ్రెస్‌కు కళను తీసుకువచ్చాయి.
 
 3- తెల్లని కాటన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గాగ్రాచోళీ దుపట్టా! లెహంగాపైన చేసిన ప్యాచ్‌వర్‌‌క, చమ్కీ, నడుం దగ్గర గవ్వల బెల్ట్ ఈ డ్రెస్‌ను ఆకర్షణీయంగా మార్చాయి.
 
 4- పసుపు, పచ్చ, నారింజ రంగులతో రూపొందించిన గాగ్రాచోళీ దాండియా వేడుకకు రెట్టింపు కళ తీసుకువస్తోంది. ఉలెన్ బాల్ హ్యాంగింగ్‌‌స, అద్దకం వర్‌‌క ఈ డ్రెస్‌కు హైలైట్!
 
 డిజైనర్ టిప్స్...
 బాందినీ ప్రింట్లు, రంగురంగుల ఫ్యాబ్రిక్‌తో రూపొందిన గాగ్రా దుస్తులు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. లోబ్యాక్, లో వెయిస్ట్, ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్, కలర్‌ఫుల్ ప్రింట్స్ ఈ దుస్తుల ప్రత్యేకత.
     
 దాండియా సందర్భంగా దుస్తులకు తగిన యాక్సెసరీస్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. లెహంగాలకు తోడుగా ఎంబ్రాయిడరీ చేసిన చిన్న చిన్న బ్యాగ్‌లు, మెటల్, ప్లాస్టిక్ గాజులను ఎంచుకోవాలి.
     
 చె వులకు పెద్ద పెద్ద ఝుంకీలు, మెడలో వెడల్పాటి ఆభరణాలు ధరిస్తే వావ్ అనిపిస్తారు. గాజులతో పాటు చురియాన్ (రింగులతో ఉండే గాజులు) కూడా ధరించాలి. ఇవి దాండియా లుక్‌ను మరింత హైలెట్ చేస్తాయి. మాంగ్-టికా(ముక్కుకు పెట్టుకునే ఓ పెద్ద రింగ్) ధరించవచ్చు. పెద్ద రాళ్ల ఉంగరాలు ఇప్పుడు ఫ్యాషన్. దాండియా దుస్తులకు నప్పేలా పెద్ద పెద్ద ఉంగరాలు, నృత్యాలకు ఇబ్బంది కలిగించని విధంగా పాదాలకు జోధ్‌పూర్ షూ ధరించడం మంచిది. రాత్రివేళనే ఈ వేడుకలు ఉంటాయి కాబట్టి మేకప్ కూడా గ్రాండ్‌గా ఉండాలి. ఐ మేకప్, ఐ షాడోస్ దుస్తుల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
     
 పూర్తిస్థాయి గాగ్రాఛోళీ లేనప్పుడు అద్దాలు అతికించిన బాందినీ దుపట్టాను ఎంచుకుని దాండియాలో పాల్గొనవచ్చు. దాండియా స్టిక్స్‌ను సైతం పెయింట్‌తో, లేసులతో అందంగా అలంకరించుకుంటే అవి దుస్తుల అలంకరణకు ధీటుగా ఉంటాయి.
     
 బాందినీ ప్రింట్లు ఉన్న జార్జెట్ లెహంగాలు, లైట్ వెయిట్‌తో ఉండే నెటెడ్ లెహంగాలు దాండియా కళను రెట్టింపు చేస్తాయి. కోర్‌సెట్ స్టైల్ బ్లౌజ్‌లు, కాంట్రాస్ట్ కలర్ దుపట్టాలు ఆక ర్షణీయంగా కనిపిస్తాయి. బ్లౌజ్‌కు గోల్డ్‌కలర్,  లెహంగా కోసం రెడ్ లేదా ఆరెంజ్ కలర్... రంగులు బాగా నప్పుతాయి.
 
     
 మెటాలిక్, గోల్డ్ కలర్ యాక్సెసరీస్, సిల్వర్ జ్యూయలరీ ధరించవచ్చు. షార్ట్ లెహంగా ధరిస్తే 2 సిల్వర్ యాంక్లెట్లు జత చేయాలి. ఇప్పుడు చాలామంది స్వంతంగా కూడా యాంక్లెట్స్ తయారుచేసుకుంటున్నారు. ఇవి ఎంత ఫ్యాన్సీగా ఉంటే అంత అందంగా ఉంటుంది.


 ఆయేషా లఖోటియా
 ఫ్యాషన్‌డిజైనర్,
 ఎల్ ఫ్యాషన్ స్టూడియో

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement