గ్రాండ్‌గా వెలిగిపోయే వివాహ వేడుకైనా హుందాగా కదిలే సీమంతం ఫంక్షన్ అయినా ఆధునికంగా ఆలోచించే అమ్మాయిలు ఒకచోట చేరినా ఆ సందర్భంలో తమదైన ప్రత్యేకతను చూపాలనుకుంటారు. అందులో మరింత స్పెషల్‌గా నిలుస్తుంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్(Fabric Painting) ఫ్యాషన్ రంగంలో(Fashion) హ్యాండ్ వర్క్(Hand Work) ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. అవే ప్రతియేటా రూపును మార్చుకొని కొత్తగా మన మదిని ఆకట్టుకుంటాయి. వాటిలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లు ఈ ఏడాది స్పెషల్‌గా సందడి చేయనున్నాయి.
పండగ థీమ్
మనవైన పండగల వేళ సంప్రదాయం ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు వేషధారణలోనూ ఆ కళ కనిపించాలని కోరుకుంటున్నారు. పండగలో ప్రత్యేకంగా నిలిచే అమ్మవార్ల రూపాలు, పాదాలు, ఆభరణాలు, ముగ్గులు పెయింటింగ్ చేయించడం వీటి ప్రత్యేకత. వీటిలో సాదాసీదాగా కనిపించే పెయింటింగ్స్ కొన్ని అయితే పెయింటింగ్ కాంబినేషన్‌తో చేసే ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ప్యాచ్‌వర్క్‌లు అదనంగా జత కలుస్తున్నాయి.
దంపతులకు ప్రత్యేకం
వివాహ వేడుకలతో వధూవరుల దుస్తుల డిజైన్లు రిచ్‌గా కనిపించాలని కోరుకోని వారుండరు. దానితో పాటు తమ పెళ్లి ప్రత్యేకం అని చూపడానికి ఐదు రోజుల పెళ్లిలో ఏదో ఒకరోజు వధూవరుల రూపాలను పెయింటింగ్‌గా చిత్రించి, వాటిని ధరించడానికి ముచ్చట పడుతున్నారు. వీటిలో వారి వారి బడ్జెట్‌లను బట్టి ఎంపికలు ఉంటున్నాయి.
సీమంతం వేడుక
రాబోయే బిడ్డకు ఆహ్వానం పలకడానికి, తల్లీ–బిడ్డ క్షేమం కోసం చేసే ఈ వేడుకను... పెయింట్ చేసిన శారీస్, లెహంగాలతో ఎంతో సుందరంగా మార్చేస్తున్నారు. యశోదాకృష్ణ, గోపికా కృష్ణ, చిన్నారి ΄ాదాలు, కామధేను వంటి డిజైన్లు దుస్తులను అద్భుతంగా మార్చేస్తున్నాయి. తల్లిదండ్రులు–పిల్లల కాంబినేషన్ పెయింటింగ్స్ కూడా ఈ థీమ్‌లో చోటుచేసుకుంటున్నాయి.
మోడరన్ మగువ
డెనిమ్స్, షర్ట్స్‌తో క్యాజువల్ వేర్‌గానూ, ఫ్రెండ్లీ గెట్ టు గెదర్ పార్టీల్లోనూ ప్రత్యేకంగా నిలవడానికి తమదైన థీమ్‌తో డిజైన్ చేయించుకుంటున్నారు. తమలోని ఆధునిక భావాలను డ్రెస్సింగ్ ద్వారా చూపుతున్నారు. దీనిలో భాగంగా పెయిం
టింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ΄్యాచ్‌వర్క్ ఈ తరాన్ని బాగా ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment