Danida
-
కోలాటం కలెక్షన్
నవరాత్రి రోజుల్లో ప్రతీ యేటా దాండియాకు ఒకే విధమైన డ్రెస్ ధరించాలంటే బోర్‌గా ఉంటుంది. అలాగని సందర్భానికి తగినట్టుగా ఉండకపోతే నలుగురిలో తేలిపోయినట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక ఫ్రెష్ ట్విస్ట్‌ను మీ డ్రెస్‌లకు ఇవ్వాలి. సంప్రదాయ ఫ్యాబ్రిక్స్ ఎన్నో అందుబాటులో ఉన్న నేటి రోజుల్లో అద్దాలు కుట్టినవి ఔటాఫ్ స్టైల్ అనిపిస్తే కొద్దిపాటి మార్పులతోనే మీ డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆకర్షణీయంగా రూపుకట్టవచ్చు. నవరాత్రి వేడుకలలో కోలాటానికి కొత్త కళ తీసుకురావచ్చు. పుల్కారి వర్క్ రంగులతో చూపరులను ఇట్టే అట్రాక్ట్ చేస్తుంది పుల్కారి వర్క్. ఇది పంజాబీ ఎంబ్రాయిడరీ. ఇండో-వెస్ట్రన్ దుస్తులకు సరిగ్గా సరిపోయే వర్క్. కుర్తీలకు, చోళీలకు, ప్లెయిన్ లెహంగాలకు, స్ట్రెయిట్ ప్యాంట్స్‌కు.. ఈ వర్క్ బాగా నప్పుతుంది. ఈ వర్క్ దుపట్టా , లెహంగా అంచులుగా డిజైన్ చేయించుకున్నా మీ చుట్టూ ఉన్నవారి లుక్స్ మీ వైపు తిరగకుండా ఉండవు. కట్‌వర్క్ లాంగ్, షార్ట్ జాకెట్స్‌ను కట్‌వర్క్‌తో మెరిపిస్తే వేడుకలలో హైలైట్ కాకండా ఉండరు. కుర్తా లేదా అనార్కలీ జాకెట్ కట్‌వర్క్ ఉన్నది ఎంచుకుంటే సింపుల్‌గా అనిపించడమే కాదు విభిన్నంగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది సరైన ఎంపిక కూడా అవుతుంది. షిమ్మర్ ఫ్యాబ్రిక్‌ని కట్వర్క్కు ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనపడతారు. గోటాపట్టి ఈ వర్క్ హెవీగా ఉన్నప్పటికీ లైట్‌వెయిట్‌గా చూడటానికి రిచ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద అంచులను లెహంగాలకు, అనార్కలీ కుర్తాలను వాడితే పండగ కళ వచ్చేసినట్టే. నిలువు, అడ్డం పట్టీలుగా ఫ్లోర్ లెంగ్త్ స్కర్ట్‌లకు గోటాపట్టిని వాడి చూడండి. - ఎన్.ఆర్. -
దాండియా ధూమ్
-
జోరు షురూ..
గర్భా నృత్యం ప్రాక్టీస్ చేస్తున్న గుజరాతీలు సరదాలు పంచే దసరాకు మూడు వారాలకు ముందే నగరంలో నవరాత్రుల సందడి మొదలైంది. గర్భా, దాండియా ఆటలతో శరన్నవరాత్రులకు పూజ కు సన్నద్ధం అవుతున్నారు సిటీవాసులు. మినీ ఇండియాగా బాసిల్లుతోన్న హైదరాబాద్‌లో దసరా విభిన్నంగా జరుగుతుంది. తమ తమ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా దుర్గాదేవి ఆరాధనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీవితం అంటే ఈ క్షణాన్ని పండుగలా పండించుకోవడమే అనే గుజరాతీలు నవరాత్రి సెలబ్రేషన్స్‌కు తెర తీశారు. దసరా సందర్భంగా గుజరాతీలు దాండియా, గర్భా నృత్యాలతో అమ్మవారిని కొలుస్తారు. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. మట్టి కుండలో దీపాన్ని ఉంచి, దాన్ని దుర్గాదేవి పటం ఎదుట పెట్టి నవరాత్రులు మొదలుపెడతారు. అలా ప్రతిష్టించిన గర్భాదీప్ ఎదుట తొమ్మిది రోజులు ప్రత్యేకమైన శైలిలో నృత్యం చేస్తారు. దీనినే గర్భా నృత్యంగా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజిస్తారు. మనిషి శరీరం కుండలాంటిదని.., అందులో జ్యోతి రూపంలో వెలుగుతున్న ఆత్మ దైవ స్వరూపమని చాటి చెప్పేదే గర్భా అని వారి నమ్మకం. కోలాటాల దాండియా.. గుజరాత్ పడుచులు ఆడే దాండియా ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోలాటాల తో సరదాగా, లయబద్ధంగా సాగిపోయే దాండియా నవరాత్రులకు మరింత వన్నెతెస్తాయి. దుర్గాదేవికి, మహిషాసురిడికి జరిగిన యుద్ధానికి ప్రతీకగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే శ్రీకృష్ణుడు గోపికలతో దాండియా రాస్ ఆడినట్టు చెప్తారు. నవరాత్రోత్సవాల్లో అమ్మవారి హారతికి ముందు దాండియా ఆట ఆడతారు. గర్భాతో పోలిస్తే దాండియా ఆడటానికి కాస్త క్లిష్టంగా అనిపించినా.. చూడటానికి మాత్రం చాలా ఇష్టంగా కనిపిస్తుంది. జతలు జతలుగా, దాండియా కర్రలతో వృత్తాకారంలో లయబద్ధంగా తిరుగుతూ ఆడతారు. డోల్, తప్పెట వాయిద్యాల సద్దులు.. అబ్బాయిలను గాల్లో ఎగిరేలా చేస్తే.. వారి ఆటలకు మరింత కిక్కునిచ్చేలా ఆడవాళ్లు దాండియాతో అలరిస్తారు. చిన్నాపెద్దా, ఆడా మగా తేడాలేకుండా అందరూ ఇందులో ఉల్లాసంగా పాల్గొంటారు. ఒక్కోసారి వీరి నాట్యం రాత్రంతా కొనసాగుతుంది. బతుకమ్మ లాంటిదే గర్భా.. తెలంగాణాలో తొమ్మిది రోజులు చేసుకునే బతుకమ్మకు, నవరాత్రి గర్భాకు చాలా దగ్గర పోలికలున్నాయి. ఇక్కడ బతుకమ్మను పూజించినట్టే.. గుజరాతీలు గర్భాదీప్ ఉంచి దుర్గాదేవి పూజ చేస్తారు. అయితే, సంప్రదాయ వరంగా లభించిన ఈ నృత్యానికి సినిమా పాటలు నేపథ్యంగా ఉండటం సరికాదు. సినిమా పాటలకు బతుకమ్మ ఆడటం ఎక్కడైనా చూస్తామా..? దుర్గాదేవిని పూజించేప్పుడు ఇలాంటి పాటలు పెట్టడం కరెక్ట్ కాదు. ఈ నృత్యాలు చేసే సమయంలో గుజరాతీ సంప్రదాయ దుస్తులు వేసుకుని చేస్తారు. ఆడవాళ్లు చనియా-చోళి, మగవాళ్లు చోర్నో-కేడియా ధరిస్తారు. అద్దాలు, గవ్వలు, కచ్ వర్క్‌తో జిగేల్మనే వీరి దుస్తులు నృత్యానికి మరింత అందాన్ని జోడిస్తాయి. స్త్రీలు తలపై దామిని, నడుముకి కమర్పట్టా, జూడా, బాజుబన్, పురుషులు మెడలో హాసిడి, చేతికి కడా లాంటి సంప్రదాయ ఆభరణాలు ధరిస్తారు. కన్నుల పండువగా కనిపిస్తారు. - మోహిని, డిజైనర్ ఫీజు కట్టు.. ఆట పట్టు.. నవరాత్రి సంబురాలు సందడిగా సాగాలంటే గర్భా, దాండియా ఉండాల్సిందే. అందుకే పలు సంస్థల్లో ఫీజు చెల్లించి మరీ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు చాలామంది. కొన్ని సంస్థలు నవరాత్రి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి. అవర్ సేక్రెడ్ స్పేస్‌లో మంగళ, గురువారాల్లో గర్భా, దాండియా నృత్య రీతులు నేర్పిస్తున్నారు. బేగంపేటలోని యశ్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, మాదాపూర్‌లోని రామ్స్ స్టెపప్ డ్యాన్స్ కంపెనీ కూడా గ ర్భా, దాండియా ఆటలు నేర్పిస్తున్నాయి. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 3 వరకు శిల్పి ఆధ్వర్యంలో ఇంపీరియల్ గార్డెన్స్‌లో నవరాత్రి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. పీపుల్స్ ప్లాజా, శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్స్‌లో కూడా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ట్రయిలర్ అదుర్స్ దశమి సెలబ్రేషన్స్‌కు గుజరాతీలు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు. నవరాత్రుల్లో చేయబోయే సందడికి ట్రైలర్ చూపించారు. శిల్పీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించారు. యశ్ జోషి గ్రూప్ నృత్యంతో మొదలైన ఈవెంట్ కలర్ఫుల్గా సాగింది. ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిన యువతీయువకులు గర్భా, దాండియా డ్యాన్స్‌ల తో అదరగొట్టారు. ర్యాంప్ వాక్‌తో మస్తీ మజా చేశారు. -
గ్రాండ్ గా... దాండియా
దేవీనవరాత్రి ఉత్సవాలలోభక్తిశ్రద్ధలతో చేసే నృత్యం... గర్భా. అదయ్యాక... వినోద కార్యక్రమాలలో ఉల్లాసంగా చేసే డాన్స్... దాండియా. నిజానికి దాండియా డాన్స్ కాదు. ఫైటింగ్!! దుర్గాదేవికి, మహిషాసురుడికీ మధ్య జరిగిన యుద్ధానికి నృత్యరూపకం! దాండియాలో ప్రధాన ఆకర్షణ... యువతులు ధరించే దుస్తులు! భక్తిని, సంప్రదాయాన్ని మేళవించి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో... అలా ఉంటుంది దాండియా డ్రెస్! దాండియా ఆడితేనే దశమి ‘ముస్తాబు’ పూర్తైట్లు! 1- నీలం, నలుపు, నారింజ రంగుల ప్రింటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లెహంగా ఇది. చోళీని పూర్తి అద్దకం వర్కతో తీర్చిదిద్దారు. మల్టీకలర్లో మెరిసిపోతున్న ఈ దాండియా డ్రెస్‌కు పూర్తి గిరిజన సంప్రదాయ హంగులను అద్దారు. 2- బాందినీ ప్రింట్ ఉన్న జార్జెట్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహంగా, చోళీ ఇది. ఎంబ్రాయిడరీ, పూసలు, గవ్వలు, అద్దకం వర్క ఈ డ్రెస్‌కు కళను తీసుకువచ్చాయి. 3- తెల్లని కాటన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గాగ్రాచోళీ దుపట్టా! లెహంగాపైన చేసిన ప్యాచ్‌వర్‌క, చమ్కీ, నడుం దగ్గర గవ్వల బెల్ట్ ఈ డ్రెస్‌ను ఆకర్షణీయంగా మార్చాయి. 4- పసుపు, పచ్చ, నారింజ రంగులతో రూపొందించిన గాగ్రాచోళీ దాండియా వేడుకకు రెట్టింపు కళ తీసుకువస్తోంది. ఉలెన్ బాల్ హ్యాంగింగ్స, అద్దకం వర్క ఈ డ్రెస్‌కు హైలైట్! డిజైనర్ టిప్స్... బాందినీ ప్రింట్లు, రంగురంగుల ఫ్యాబ్రిక్‌తో రూపొందిన గాగ్రా దుస్తులు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. లోబ్యాక్, లో వెయిస్ట్, ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్, కలర్‌ఫుల్ ప్రింట్స్ ఈ దుస్తుల ప్రత్యేకత. దాండియా సందర్భంగా దుస్తులకు తగిన యాక్సెసరీస్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. లెహంగాలకు తోడుగా ఎంబ్రాయిడరీ చేసిన చిన్న చిన్న బ్యాగ్‌లు, మెటల్, ప్లాస్టిక్ గాజులను ఎంచుకోవాలి. చె వులకు పెద్ద పెద్ద ఝుంకీలు, మెడలో వెడల్పాటి ఆభరణాలు ధరిస్తే వావ్ అనిపిస్తారు. గాజులతో పాటు చురియాన్ (రింగులతో ఉండే గాజులు) కూడా ధరించాలి. ఇవి దాండియా లుక్‌ను మరింత హైలెట్ చేస్తాయి. మాంగ్-టికా(ముక్కుకు పెట్టుకునే ఓ పెద్ద రింగ్) ధరించవచ్చు. పెద్ద రాళ్ల ఉంగరాలు ఇప్పుడు ఫ్యాషన్. దాండియా దుస్తులకు నప్పేలా పెద్ద పెద్ద ఉంగరాలు, నృత్యాలకు ఇబ్బంది కలిగించని విధంగా పాదాలకు జోధ్‌పూర్ షూ ధరించడం మంచిది. రాత్రివేళనే ఈ వేడుకలు ఉంటాయి కాబట్టి మేకప్ కూడా గ్రాండ్‌గా ఉండాలి. ఐ మేకప్, ఐ షాడోస్ దుస్తుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పూర్తిస్థాయి గాగ్రాఛోళీ లేనప్పుడు అద్దాలు అతికించిన బాందినీ దుపట్టాను ఎంచుకుని దాండియాలో పాల్గొనవచ్చు. దాండియా స్టిక్స్‌ను సైతం పెయింట్‌తో, లేసులతో అందంగా అలంకరించుకుంటే అవి దుస్తుల అలంకరణకు ధీటుగా ఉంటాయి. బాందినీ ప్రింట్లు ఉన్న జార్జెట్ లెహంగాలు, లైట్ వెయిట్‌తో ఉండే నెటెడ్ లెహంగాలు దాండియా కళను రెట్టింపు చేస్తాయి. కోర్సెట్ స్టైల్ బ్లౌజ్‌లు, కాంట్రాస్ట్ కలర్ దుపట్టాలు ఆక ర్షణీయంగా కనిపిస్తాయి. బ్లౌజ్‌కు గోల్డ్‌కలర్, లెహంగా కోసం రెడ్ లేదా ఆరెంజ్ కలర్... రంగులు బాగా నప్పుతాయి. మెటాలిక్, గోల్డ్ కలర్ యాక్సెసరీస్, సిల్వర్ జ్యూయలరీ ధరించవచ్చు. షార్ట్ లెహంగా ధరిస్తే 2 సిల్వర్ యాంక్లెట్లు జత చేయాలి. ఇప్పుడు చాలామంది స్వంతంగా కూడా యాంక్లెట్స్ తయారుచేసుకుంటున్నారు. ఇవి ఎంత ఫ్యాన్సీగా ఉంటే అంత అందంగా ఉంటుంది. ఆయేషా లఖోటియా ఫ్యాషన్డిజైనర్, ఎల్ ఫ్యాషన్ స్టూడియో