
నటుడు శరత్‌కుమార్ తొలిసంతానం నటి వరలక్ష్మి అన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య సఖ్యత లేదంటూ రకరకాల వదంతులు ప్రచారం అవుతుంటాయి. అవి నిజం కాదని నటుడు శరత్‌కుమార్, నటి వరలక్ష్మీ సమయం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం సాయంత్రం స్థానిక నందనంలోని ఫ్లక్స్ ఫిట్‌నెస్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలో నటుడు శరత్‌కుమార్‌తో పాటు పాల్గొన్న వరలక్ష్మీ తండ్రిని ప్రేమగా హత్తుకున్నారు.