Kannappa: నాథనాధుడుగా శరత్ కుమార్..లుక్‌ అదిరింది! | Sarathkumar As Nathanadhudu In Kannappa, First Look Unveiled As Birthday Special Goes Viral | Sakshi
Sakshi News home page

Kannappa Sarathkumar Look: నాథనాధుడుగా శరత్ కుమార్..లుక్‌ అదిరింది!

Published Sun, Jul 14 2024 3:55 PM | Last Updated on Sun, Jul 14 2024 6:11 PM

Sarathkumar As Nathanadhudu In Kannappa, First Look Unveiled As Birthday Special

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘కన్నప్ప’.  ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.

 ఇక తాజాగా ఈ మూవీ నుంచి  శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా నేడు(జులై 14) ఆయన కారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌లో  ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement