మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. దేవరాజ్‌ లుక్‌ చూశారా? | Kannappa Team Revealed First Look Poster Of Devaraj In This Movie | Sakshi
Sakshi News home page

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. దేవరాజ్‌ లుక్‌ చూశారా?

Published Mon, Aug 5 2024 2:37 PM | Last Updated on Mon, Aug 5 2024 2:37 PM

Kannappa Team Revealed First Look Poster Of Devaraj In This Movie

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  అవా ఎంటర్ టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ మూవీలో నటుడు దేవరాజ్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో ఆయన గిరిజనుల నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. అతని కుమారుడిగా బాలీవుడ్ నటుడు లావి పజ్నీ నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలిపారు. తాజాగా రిలీజైన ఈ పోస్టర్లపై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement