
న్యాయం చేయకపోతే ఆందోళన
భూబాధితురాలు వరలక్ష్మికి న్యాయం జరగకపోతే ఆందోళనలు చేస్తామని టీపీసీసీ కార్యదర్శి ఎం.సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుముల శంకర్ తెలిపారు...
బెల్లంపల్లి : భూబాధితురాలు వరలక్ష్మికి న్యాయం జరగకపోతే ఆందోళనలు చేస్తామని టీపీసీసీ కార్యదర్శి ఎం.సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుముల శంకర్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. వరలక్ష్మికి ఆమె తం డ్రి కట్నంగా ఇచ్చిన భూమిని సురేష్‌బాబు ఆక్రమిస్తే.. ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఎండీ.అఫ్జల్, బి.రాజేశ్వర్, దెబ్బటి రమేష్, బండి ప్రభాకర్, జి.జయరాం, కటకం సతీష్ పాల్గొన్నారు. అలాగే, వరలక్ష్మికి న్యాయం జరగకపోవడం వల్లనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బీజేపీ జిల్లాకార్యవర్గ సభ్యుడు కుస్మ భాస్క ర్, రాష్ర్ట కౌన్సిల్ సభ్యుడు రేవెల్లి రాజలింగు, బీజేపీ మజ్దూర్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు చిప్ప మల్లయ్య మరో సమావేశంలో పేర్కొన్నారు.