శశికుమార్ చేతికి గాయం | hero Shashi Kumar hand injury | Sakshi
Sakshi News home page

శశికుమార్ చేతికి గాయం

Published Tue, Mar 17 2015 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

శశికుమార్ చేతికి గాయం

శశికుమార్ చేతికి గాయం

షూటింగ్‌లో నటుడు శశికుమార్ చేతికి  గాయమైంది. ఆయన చేతి ఎముకలు విరగడంతో తారై తప్పట్టై చిత్ర షూటింగ్ రద్దు అయింది. వివరాల్లోకి వెళితే, బాల దర్శకత్వం వహిస్తున్నతాజా చిత్రం తారై తప్పట్టై. శశికుమార్, వరలక్ష్మి జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని వారాలుగా తంజావూరులో జరుగుతోంది. ఇటీవల శశికుమార్ విలన్‌తో పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం శశికుమార్ చేతి ఎముక విరగడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వైద్య బృందాన్ని, రెండు అంబులెన్స్‌లను చిత్ర యూనిట్ సిద్ధం చేసుకోవడంతో వెంటనే శశికుమార్‌ను వైద్య బృందం సాయంతో సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
 
  వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన చేతికి బలమైన గాయాలైనట్టు, ఎముక విరిగినట్టు తేల్చి పిండి కట్టు వేశారు. కొన్ని వారాల పాటుగా విశ్రాంతి తప్పదని శశికుమార్‌కు వైద్యులు సలహాలు ఇచ్చారు. దీంతో ఆ చిత్రం షూటింగ్ రద్దు అయింది. శశికుమార్ విశ్రాంతి కోసం మదురై వెళ్లారు. చిత్ర యూనిట్ సోమవారం చెన్నైకు తిరుగు పయనమైంది. శశికుమార్ పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ మళ్లీ మొదలు అవుతుందని ఆ చిత్రయూనిట్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement