గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది? | Tollywood Actor Akhil Akkineni Left Hand Injury | Sakshi
Sakshi News home page

Akhil Akkineni: 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్.. గాయంతో కనిపించిన అఖిల్

Published Tue, Jan 16 2024 6:25 PM | Last Updated on Tue, Jan 16 2024 7:24 PM

Tollywood Actor Akhil Akkineni Left Hand Injury - Sakshi

అక్కినేని యంగ్ హీరో అఖిల్ గాయపడ్డాడు. తాజాగా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో అఖిల్ కనిపించాడు. కాకపోతే ఎడమ చేతికి కట్టు ఉండటంతో పెద్ద దెబ్బ తగిలిందని అర్థమైంది. అసలు ఇంతకీ అఖిల్ చేతికి ఏమైంది? 'సలార్' సక్సెస్ పార్టీలో ఈ కుర్ర హీరో కనిపించడానికి కారణమేంటనేది చూద్దాం.

గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన 'సలార్' సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే మొన్నీమధ్య బెంగళూరులో గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. అదే టైంలో అయ్యగారు అఖిల్ కూడా కనిపించాడు. కాకపోతే చేతికి కట్టుతో కనిపించడంతో గాయం విషయం బయటపడింది.

(ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?)

అయితే అఖిల్.. గతేడాది 'ఏజెంట్' మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా అని అప్పట్లో అన్నారు. ఇది నిజమో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థనే. అలా అఖిల్‌కి ఆహ్వానం అంది ఉండొచ్చు. అలా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కనిపించి ఉండొచ్చు.

ఇక గాయం విషయానికొస్తే.. బయటకు చెప్పకుండా అఖిల్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడేమో. ఈ క్రమంలోనే గాయమై ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. చేతికి కట్టు చూస్తే పెద్ద గాయంలానే కనిపిస్తుంది. మరి ఎప్పుడైందో ఏమో?

(ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement