hand injury
-
గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ గాయపడ్డాడు. తాజాగా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో అఖిల్ కనిపించాడు. కాకపోతే ఎడమ చేతికి కట్టు ఉండటంతో పెద్ద దెబ్బ తగిలిందని అర్థమైంది. అసలు ఇంతకీ అఖిల్ చేతికి ఏమైంది? 'సలార్' సక్సెస్ పార్టీలో ఈ కుర్ర హీరో కనిపించడానికి కారణమేంటనేది చూద్దాం. గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన 'సలార్' సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే మొన్నీమధ్య బెంగళూరులో గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. అదే టైంలో అయ్యగారు అఖిల్ కూడా కనిపించాడు. కాకపోతే చేతికి కట్టుతో కనిపించడంతో గాయం విషయం బయటపడింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) అయితే అఖిల్.. గతేడాది 'ఏజెంట్' మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా అని అప్పట్లో అన్నారు. ఇది నిజమో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థనే. అలా అఖిల్‌కి ఆహ్వానం అంది ఉండొచ్చు. అలా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కనిపించి ఉండొచ్చు. ఇక గాయం విషయానికొస్తే.. బయటకు చెప్పకుండా అఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడేమో. ఈ క్రమంలోనే గాయమై ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. చేతికి కట్టు చూస్తే పెద్ద గాయంలానే కనిపిస్తుంది. మరి ఎప్పుడైందో ఏమో? (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) -
స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!
బాలీవుడ్ హీరోలందరూ సౌత్ డైరెక్టర్లపై మనసు పారేసుకుంటున్నారు! ప్రస్తుతం అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ ధావన్.. దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. షారుక్‌తో 'జవాన్' తీసిన తమిళ దర్శకుడు అట్లీ.. వరుణ్ ధావన్ సినిమాని మాత్రం నిర్మిస్తున్నాడు. కలీస్ దర్శకుడు. ఇదంతా పక్కనబెడితే షూటింగ్ మొదలైన రోజే హీరో గాయపడ్డాడనే వార్త అభిమానుల్ని కంగారు పెట్టింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'బవాల్' సినిమాతో ఈ మధ్య ప్రేక్షకుల్ని పలకరించిన వరుణ్ ధావన్.. 'VD18' వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ప్రోమో కోసం కీలక ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఓ యాక్షన్ సీన్లో భాగంగా పట్టుతప్పి కిందపడిపోయిన వరుణ్ మోచేతికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఇతడు.. 'నో పెయిన్ నో గెయిన్' (ఫలితం కావాలంటే నొప్పిని భరించాలి) అని రాసుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేశ్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. వామిక గబ్బి మరో హీరోయిన్. ఇదిలా ఉండగా గతేడాది 'భేడియా' చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్.. మొన్నీ మధ్య 'బవాల్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే పెట్టుకుని, గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!) -
ట్రైనింగ్ సెషన్లో గాయపడిన అశ్విన్
బెంగళూరు: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు టీమిండియాకు ప్రతికూలత ఎదురైంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన భారత క్రికెట్ శిక్షణ శిబిరంలో చివరి రోజు అశ్విన్ చేతికి గాయమైంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో భారత టెస్టు జట్టు క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ట్రైనింగ్ సెషన్లో అశ్విన్ కుడిచేతికి బంతి తగలడంతో గాయపడినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీంతో అతను ట్రైనింగ్ సెషన్ నుంచి వైదొలిగాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా తరపున కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న అశ్విన్ గాయపడటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెల 21 నుంచి వెస్టిండీస్‌లో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆడనుంది. -
శశికుమార్ చేతికి గాయం
షూటింగ్లో నటుడు శశికుమార్ చేతికి గాయమైంది. ఆయన చేతి ఎముకలు విరగడంతో తారై తప్పట్టై చిత్ర షూటింగ్ రద్దు అయింది. వివరాల్లోకి వెళితే, బాల దర్శకత్వం వహిస్తున్నతాజా చిత్రం తారై తప్పట్టై. శశికుమార్, వరలక్ష్మి జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని వారాలుగా తంజావూరులో జరుగుతోంది. ఇటీవల శశికుమార్ విలన్‌తో పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం శశికుమార్ చేతి ఎముక విరగడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వైద్య బృందాన్ని, రెండు అంబులెన్స్‌లను చిత్ర యూనిట్ సిద్ధం చేసుకోవడంతో వెంటనే శశికుమార్‌ను వైద్య బృందం సాయంతో సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన చేతికి బలమైన గాయాలైనట్టు, ఎముక విరిగినట్టు తేల్చి పిండి కట్టు వేశారు. కొన్ని వారాల పాటుగా విశ్రాంతి తప్పదని శశికుమార్‌కు వైద్యులు సలహాలు ఇచ్చారు. దీంతో ఆ చిత్రం షూటింగ్ రద్దు అయింది. శశికుమార్ విశ్రాంతి కోసం మదురై వెళ్లారు. చిత్ర యూనిట్ సోమవారం చెన్నైకు తిరుగు పయనమైంది. శశికుమార్ పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ మళ్లీ మొదలు అవుతుందని ఆ చిత్రయూనిట్ పేర్కొంది.