ఇళయరాజా ప్రస్థానంలో మరో మైలురాయి | music mestro ilayaraja is done with his 1000th movie | Sakshi
Sakshi News home page

ఇళయరాజా ప్రస్థానంలో మరో మైలురాయి

Published Sun, Nov 1 2015 11:00 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

ఇళయరాజా ప్రస్థానంలో మరో మైలురాయి

ఇళయరాజా ప్రస్థానంలో మరో మైలురాయి

ఈ తరం సంగీత దర్శకులు 50వ సినిమా చేయటమే చాలా కష్టంగా కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా 1000 సినిమాలకు సంగీతం అందించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్ను త్వరలోనే సొంతం చేసుకోబోతున్నారు, సౌత్ సినిమా మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా. తన స్వర ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించిన ఈ స్వర మాంత్రికుడు సంగీతం అందించిన 1000వ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది.

ఇళయరాజ కెరీర్లో మైల్స్టోన్ లాంటి సినిమా కావటంతో ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సుబ్రమణ్యపురం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి తరువాత హీరోగా మారిన శశికుమార్ హీరోగా నటిస్తున్నాడు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో భారీ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement