
వరలక్ష్మి (ఫైల్)
అనంతపురం ,కళ్యాణదుర్గం: పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో వరలక్ష్మి (23) అనే వివాహిత కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి రామచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నార్పలకు చెందిన వరలక్ష్మికి రెండేళ్ల క్రితం కళ్యాణదుర్గానికి చెందిన శ్రీకాంత్‌తో వివాహమైంది. వీరికి సంతానం లేదు. భర్త మద్యానికి బానిసవడమే కాకుండా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త ఏమి మందలించాడో తెలియదు కానీ వరలక్ష్మి శనివారం రాత్రి ఇంటిలోని పైకప్పు కడ్డికీ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో భర్త ఇంటిలో లేడు. ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment