ఎడ్‌సెట్ కమిటీ సభ్యురాలిగా వరలక్ష్మి
ఎడ్‌సెట్ కమిటీ సభ్యురాలిగా వరలక్ష్మి
Published Thu, Feb 9 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
కోవెలకుంట్ల: 2017 విద్యా సంవత్సర ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ కమిటీ సభ్యురాలిగా కోవెలకుంట్లకు చెందిన వరలక్ష్మి నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో కర్నూలు జిల్లా నుంచి స్థానిక శ్రీనివాస బీఎడ్ కళాశాల కరస్పాండెంట్‌కు కమిటీలో చోటు కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే ఎడ్‌సెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సౌకర్యార్థం తమ కళాశాలలో ఉచిత ఆన్‌లైన్ నమోదుకేంద్రం ఏర్పాటు చేసి, ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్‌బాషా, గౌరవ సలహాదారుడు నాగరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement