విజయనగరం ఫోర్ట్: పొగాకు ఉత్పత్తులు హానికరమని జేసీ–2 నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతి రేక దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిగరె ట్లు, చుట్ల తాగేవారికంటే ఆ పొగపీల్చే వారికే నష్టం ఎ క్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా స్త్రీ, పురుషల్లో లైంగిక పటుత్వం తగ్గిపోతుందని చెప్పా రు. పొగాకు ఉత్పత్తులు తినడం గాని తాగడం గాని చేయకూడదన్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ జి.రవికుమార్, డీపీఎం బాలాజీ, డీఐసీ సాక్షి గోపాలరావు, డెమో విజయ, తదితరులు పాల్గొన్నారు.
దూరంగా ఉండండి..
ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడంతో పాటు వ్యాయామం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సి. పద్మజ సూచించారు. పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ వైద్యుల సంఘం రుపొందించిన కరపత్రాలను జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తుల తినడం వల్ల క్యాన్సర్, బ్రాంకలైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘ జిల్లా అధ్యక్షుడు గద్దె చిరంజీవి, ప్రధాన కార్యదర్శి శర్మ, జోనల్ కన్వీనర్ గోపి, ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు.
పొగాకు ఉత్పత్తులు హానికరం..
Published Thu, Jun 1 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement