చిలువూరుకు చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోటా నాగేశ్వరరావు (70) అనారోగ్యంతో సోమవారం రాత్రి
చిలువూరు (దుగ్గిరాల) : చిలువూరుకు చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోటా నాగేశ్వరరావు (70) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని మంగళవారం పలువురు బీజేపీ నాయకులు సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు గారపాటి పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొంగర జోగేంద్రప్రసాద్, కొండపనేని రవీంద్రరావు తదితరులు ఉన్నారు.