తాతయ్య కానున్న టాలీవుడ్ మన్మధుడు? | Nagarjuna to play grandpa role soon? | Sakshi
Sakshi News home page

తాతయ్య కానున్న టాలీవుడ్ మన్మధుడు?

Published Sat, Sep 20 2014 12:28 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

తాతయ్య కానున్న టాలీవుడ్ మన్మధుడు? - Sakshi

తాతయ్య కానున్న టాలీవుడ్ మన్మధుడు?

టాలీవుడ్ నవమన్మధుడు నాగార్జున ఐదు పదుల వయసులో కూడా ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూనే ఉంటారు. మనిషిని చూసి వయసు చెప్పడం ఆయన విషయంలో అసలు సాధ్యం కానే కాదు. అలాంటిది.. ఆయన తొందరలోనే తాత కాబోతున్నారు. అదేంటి.. ఇంకా నాగచైతన్యకు పెళ్లి కూడా కాకముందే నాగ్ ఎలా తాత అవుతారని అనుమానం వస్తోందా? అవును.. కాకపోతే ఆయన వెండితెరమీద మాత్రమే తాతయ్య అవుతున్నారు. తన కెరీర్లో ఇప్పటికి కొన్ని వృద్ధ పాత్రలను (అన్నమయ్య లాంటి చిత్రాల్లో) పోషించినా.. తాతయ్య అయినట్లు మాత్రం ఏ సినిమాలోనూ లేదు. ఇప్పుడు ఆయన ఆ పాత్ర చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

మనం మూవీతో సూపర్హిట్ కొట్టిన నాగార్జున.. తన జోష్ కొనసాగిస్తున్నారు. కొత్త సినిమాల్లో ఆయన రొటీన్కు భిన్నంగా కనిపిస్తారని చెబుతున్నారు. ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తాత, మనవడు ఈ రెండు పాత్రల్లో నటించి నాగార్జున సరికొత్త వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారట.  కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో తాతపాత్ర చేయబోతున్న నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తారు. మనవడి పాత్ర పోషించే నాగార్జున సరసన హీరోయన్గా తొలుత తమన్నా అనుకున్నా.. ఆమె పారితోషికం విని షాకయ్యి.. ముంబైకి చెందిన మరో కొత్త హీరోయిన్తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. "సోగ్గాడే చిన్ని నాయన" అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమా వివరాలను అక్కినేని జయంతి వేడుకలలో స్వయంగా నాగార్జున ప్రకటిస్తారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement