'స్టెప్పులతో హీరోలతో డాన్సులు చేయించారు' | heros got inspired from akkineni nageswararao dances | Sakshi
Sakshi News home page

'స్టెప్పులతో హీరోలతో డాన్సులు చేయించారు'

Published Wed, Jan 22 2014 11:11 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

'స్టెప్పులతో హీరోలతో డాన్సులు చేయించారు' - Sakshi

'స్టెప్పులతో హీరోలతో డాన్సులు చేయించారు'

హైదరాబాద్ :  తెలుగు సినిమాల్లోనే కాకుండా యావత్తు భారతదేశంలోనే ఒక హీరో స్టెప్పులేయడం అక్కినేని నాగేశ్వరరావుతోనే మొదలైంది. అంతకు ముందు కేవలం హీరోయిన్లు మాత్రమే డ్యాన్సు చేసేవారు. హీరో డాన్సు చేయడం చిన్నతనంగా భావించేవారు. అటువంటి పరిస్థితిని 'చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది' అంటూ తనదైన స్టెప్పులతో అభిమానులతోనూ ఆయన నృత్యం చేయించారు.

ఆ తర్వాత సినిమా హీరోలంతా అక్కినేని బాటలోనే డాన్సులు చేయక తప్పలేదు. ఏఎన్నార్ స్టెప్లంటే ఇప్పటికీ క్రేజ్ ఉంది. లేటు వయసులో కూడా హీరోయిన్లతో స్టెప్పులు వేసిన ఘనత ఏఎన్నార్ కు దక్కుతుంది. ఆయన బ్రాండు స్టెప్పులను ఆదర్శంగా తీసుకుని పలు ప్రాంతాల్లో కూడా జూనియర్ ఏఎన్నార్ పేరుతో పలువురు కళాకారులు ఆ తరహా స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను అలరించడం మనకు తెలుసు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement