అక్కినేని కుటుంబానికి ప్రముఖుల పరామర్శ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు సుచరిత, శోభా నాగిరెడ్డి ఉన్నారు. కాగా ఎన్నాఆర్ మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి వ్యక్తి చేశారు.
మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు మృతితో సినిమా పరిశ్రమ దిగ్ర్భాంతికి గురైంది. ఆయన మరణం గురించి తెలియగానే పరిశ్రమకు చెందిన సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలపడానికి ఆయన నివాసానికి క్యూ కట్టారు. అక్కినేనితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు... ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
కృష్ణ, జమున, డి.రామానాయుడు, విబి రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్ బాబు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, పరుచూరి బ్రదర్స్, చలపతిరావు, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణంరాజు దంపతులు, జగపతి బాబు, రాజీవ్ కనకాల, సురేష్ కొండేటి, దగ్గుబాటి సురేష్ బాబు, జయసుధ, నితిన్ కపూర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నన్నపనేని రాజకుమారి, జూలకంటి రంగారెడ్డి, రాజేంద్రప్రాసాద్, నాదెండ్ల మనోహర్, జయప్రకాష్ నారాయణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.